Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వైరల్ వీడియో..! అసలు ఏముందీ పాటలో… అంత బాగా ఎక్కేసింది..!!

August 17, 2021 by M S R

ఆశ్చర్యమేసింది… యూట్యూబులో కోట్ల వ్యూస్ ఈరోజుల్లో పెద్ద విశేషం ఏమీ కాదు… కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా సినిమా పాటల్ని దాటి వ్యూస్, ఆదరణ సాధిస్తున్న తీరు ఆసక్తికరంగా కూడా ఉంది… కాదు, చూడటం కాదు… జనంలోకి బలంగా ఎక్కడం… ఎంత అంటే..? సినిమా ట్యూన్లను మించి హమ్ చేయడం… దిగువ ఓ వీడియో ఉంది చూడండి… మస్తు వైరల్ అయిపోయింది… అందులో ఏముందీ అంటే..? పెళ్లికొడుక్కి స్వాగతం… పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట, వీథిలోనే, స్వయంగా పెళ్లికూతురే ఓ పాట పాడుతోంది… డాన్స్ చేస్తోంది… పెళ్లికొడుకు ఆనందంగా చూస్తున్నాడు… చివరలో బంధుగణం, స్నేహితులు కూడా అమ్మాయితో పాదం కలిపారు, పదం కలిపారు… మంచిగుంది… తెలంగాణ పాటే… ఎక్కడో తెలీదు గానీ, సోషల్ మీడియాలో ఒక్కసారిగా తెగ వైరల్ అయిపోయింది అమ్మాయి డాన్స్…

marriage

ఈమధ్య పెళ్లిళ్లలో మనది కాని ఓ ధోరణిని చూస్తున్నాం కదా… డబ్బులున్నవాడి పైత్యం… నార్తరన్ ఇండియాకు సంబంధించిన సంగీత్ అనబడే ఓ పెళ్లివేడుకను అడాప్ట్ చేసుకుంటున్నాం… పిల్ల, పిల్లాడు, వాళ్ల తల్లిదండ్రులు, సోదరులు, అక్కాచెల్లెళ్లు గట్రా అందరికీ ప్రత్యేకంగా డాన్సులు నేర్పిస్తారు ముందే… ఇక సంగీత్ అనగానే తుచ్ఛమైన, క్షుద్రమైన తెలుగు సినిమా పాటలు డీజేలో వేసి డాన్సులు చేస్తుంటారు… ఆ చెత్తతో పోలిస్తే ఈ వీడియోలో పెళ్లికూతురు పాడిన పాట చాలాచాలా బాగుంది… నిజానికి ఓ పెళ్లికూతురు బజారులో డాన్సులు చేస్తూ పెళ్లికొడుకును స్వాగతించడం ఏమిటీ అనిపించాలి కదా… అస్సలు అనిపించదు… పైగా ఆ సంగీత్‌తో పోలిస్తే వేల రెట్లు బెటర్ అనిపిస్తుంది… అమ్మాయి కూడా భలే డాన్స్ చేసింది… ఆ వీడియో చూడండి ఓసారి… ఇంకా చెప్పాల్సింది ఉంది…

Ads

https://muchata.com/wp-content/uploads/2021/08/పెళ్లి.mp4

సాంగ్ అస్పష్టంగా ఉంది… ఏ సినిమాలోనిది ఈ పాట అని ఎంత చించుకున్నా అర్థం కాలేదు… తరువాత ఓ మిత్రుడు చెప్పాడు ఈ పాట… బుల్లెట్ బండి ఆల్బమ్ పేరు… ఓసారి చెక్ చేద్దామని లింక్ ఓపెన్ చేస్తే ఆశ్చర్యమేసింది… ఏప్రిల్‌లో అప్‌లోడ్ చేస్తే 3 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నయ్… 3.5 లక్షల లైకులు, 14 వేల కామెంట్స్… అంటే సూపర్ హిట్ అన్నట్టే కదా… పాటలో సాహిత్యం బాగుంది… రచయిత లక్ష్మన్… ఓ నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పద అంటూ సరదాగా మొదలు పెట్టి… తన గురించి చెప్పుకుంటుంది… మట్టిమనుషుల మధ్య, మర్యాదల నడుమ పెరిగాను… ఏడు కుటుంబాల్లో ఒక్క ఆడపిల్లను… అవ్వా అయ్యా ప్రాణంలెక్క చూసుకుంటరు, నేనెంత మారాం చేసినా గారంగా పెరిగాను, పువ్వులా పెరిగాను… నీ చేయిపట్టుకోనీకి వస్తున్నా… ఇలాంటి వ్యక్తీకరణే ఉంటుంది పాట మొత్తం… మీ అమ్మానాయనల్ని నా అమ్మానాయనల్లాగా చూస్కుంటా అనే వాక్యం టచింగ్… ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే..? ఒక పెళ్లికూతురు ఒక పెళ్లికొడుకును డాన్స్ చేస్తే స్వాగతించేలా ఓ ప్రైవేటు పాట… అంత బలంగా జనంలోకి పోవడం… అదీ ఆశ్చర్యం… అఫ్ కోర్స్, దిగుదిగుదిగునాగా వంటి పైత్యాలకన్నా, నీకాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు వంటి దరిద్రాలకన్నా వేయి రెట్లు బెటర్… బెటరున్నర…!! మోహన భోగరాజు బాగా పాడింది… హృద్యంగా ఉన్న ఈ పాట తెలుగు సినీ కవులకు ఒక లెసన్… ఇదే పాత ఏ మంగ్లీ గొంతులోనో పడి, ఏ సాయి పల్లవి పదమో కలిసి, ఏ లవ్ స్టోరీ సినిమాలో చేరి ఉంటే….. ఈ పాట రేంజ్ ఊహించని స్థాయిలో ఉండేది… ఇదిగో… ఒరిజినల్ సాంగ్ లింక్… లిరిక్…

.

.


నే పట్టుచీరనే గట్టుకున్నా👸👸….

గట్టుకున్నుల్లో గట్టుకున్నా, టిక్కీబొట్టే పెట్టుకున్నా💃💃 …

పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా …..

నడుముకి వడ్డాణం జుట్టుకున్నా …

జుట్టుకునుల్లో జుట్టుకున్నా …..

దిష్టి సుక్కనే దిద్దుకున్నా …. దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా … ,

పెళ్ళికూతురు ముస్తాబురో .. నువ్వు యేడంగా వస్తావురో … చెయ్యి నీ చేతికిస్తానురో 👩🏻‍🤝‍👨🏼…

అడుగు నీ అడుగులేస్తానురో👣🐾🐾 ..

నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా … ఇట్టే వస్తారా నీ వెంటా👩‍❤️‍💋‍👨 …

నీ బుల్లెట్టు బండెక్కి🏍️🛵 వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే🌍🌎 సూపిత్తప్పా …

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …

చెరువు కట్టపోంటి చేమంతి💮💮🌼🌼 వనం బంతివనం చేమంతివనం చేమంతులు🌼🌼 తెంపి దండా అల్లుకున్న అల్లుకునోల్లో అల్లుకున్న…..

మా ఊరు వాగంచున మల్లేవనం … మల్లేవనములో మల్లేవనం ….. మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా … నింపుకున్నుల్లో నింపుకున్నా …

నువ్వు నన్నేలుకున్నావురో …. దండ మెళోన యేస్తానురో … నేను నీ ఏలుపట్టుకోని … మల్లె జల్లోన ఎడతనురో …

మంచి మర్యాదలు తెలిసినదాన్ని … మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని …. నీ బుల్లెట్టు బండెక్కి🏍️🏍️🛵🛵 వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే 🌍సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …

నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో🤱🤱 …. పిల్లనయ్యో , ఆడపిల్లనయ్యో .💃….

మా నాన్న గుండెల్లోనా👪 ప్రేమనయ్యో … ప్రేమనయ్యో 👪, నేను ప్రేమనయ్యో ….

ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో 👸… దాన్ని రయ్యో , ఒక్కదాన్నిరయ్యో ….

మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో … ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో ..

పండు ఎన్నల్లో ఎత్తుకొని , ఎన్న ముద్దలు పెట్టుకొని , ఎన్ని మారాలు జేస్తు ఉన్నా , నన్ను గారాలు జేసుకొని , చేతుల్లో పెంచారు పువ్వల్లే🌼🌼 నన్ను …

నీ చేతికిస్తరా నన్నేరా నేను … నీ బుల్లెట్టు బండెక్కి 🛵🛵🏍️🏍️వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని ….. అందాల దునియానే🌍🌍 సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …

నా కుడికాలు👣🐾 నీ ఇంట్లో పెట్టినంకా … వెట్టినంకుల్లో … వెట్టినంకా … సిరిసంపద సంబురం🌾🌾🌾 🕉️గల్గునింకా …. గల్గునింకుల్లో … గల్గునింకా …..

నిన్ను గన్నోల్లే కన్నోల్లు అనుకుంటా … , అనుకుంటుల్లో అనుకుంటా .. , నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా .👩‍❤️‍💋‍👨🤗… పంచుకుంటుల్లో🤗 పంచుకుంటా …….

సుక్క 🌇🌄పొద్దుకే నిద్రలేసి , సుక్కలా ముగ్గులాకిట్లేసి 🪔… , సుక్కలే నిన్ను నన్ను చూసి , మురిసిపోయేలా నీతో కలిసి .. , నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా👩🏻‍🤝‍👨🏼 , నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా🥰😍 ….

నీ బుల్లెట్టు బండెక్కి 🏍️🛵🛵వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions