Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివ అంటే నాగార్జున, వర్మ మాత్రమేనా..? ఇంకెవరికీ క్రెడిట్ లేదా..?!

November 14, 2025 by M S R

.

శివ… రీ-రిలీజ్ నేడు… ఎస్, తెలుగు సినిమా శివకు ముందు, శివకు తరువాత అన్నట్టు అదొక ట్రెండ్ క్రియేట్ చేసింది… చిరంజీవికి ఖైదీ ఎలాగో, నాగార్జునకు శివ అలాగే… తనను హీరోగా నిలబెట్టింది శివ…

కొన్నాళ్లు తెలుగు యువత ఆ మైకంలో ఉండిపోయింది… అంతటి ట్రెండ్ సెట్టర్ రాంగోపాల్ వర్మ కూడా తరువాత కాలంలో క్రమేపీ చెత్త, మూర్ఖ సినిమాలు తీసి భ్రష్టుపట్టిపోయిన తీరు మరో అధ్యాయం… అదిక్కడ అప్రస్తుతం…

Ads

ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా పలు ప్రమోషన్ షోలు… ఇంటర్యూలు, హైప్ క్రియేషన్ మార్కెటింగ్ ఎత్తుగడలు… ఇవన్నీ సహజమే… కానీ శివ అంటే జస్ట్, నాగార్జున, అమలు, వర్మ మాత్రమేనా..? వాళ్లేనా..? ఇంకెవరూ లేరా..?

శివ ఘన విజయానికి కారకుడు రఘువరన్ విలనీ కూడా… కాకపోతే ఇప్పుడు మనమధ్య లేడు… సరే, సంగీత దర్శకుడి పాత్ర కూడా ఈ సినిమా సక్సెస్‌లో ఎక్కువే… శబ్దంతో కాదు, నిశ్శబ్దంతో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఇళయరాజా… సీన్స్ ఎలివేట్ చేశాడు… బీజీఎం ఎలా ఉండాలో సినిమా ప్రపంచానికి కొత్త ఒరవడిని నేర్పించాడు… తనరు శివ రీ-రీలిజ్ ప్రచార తెర మీద ఎక్కడా లేడు…

అంతేనా..? ఆ సినిమాతో కృష్ణవంశీ, తేజ, శివ నాగేశ్వరరావు, ఉప్పలపాటి నారాయణరావు వంటి ఎంతోమంది దర్శకులు వెలుగులోకి వచ్చారు… ఏరీ, ఒక్కరూ ప్రచార తెర మీద కనిపించరేం..?

అలాగే సినిమాలో యువ విలన్ గా జేడీ చక్రవర్తి, భవాని అసిస్టెంట్‌గా తనికెళ్ల భరణి, నాగార్జున మిత్ర బృందంగా శుభలేఖ సుధాకర్, చిన్నా, ఏలూరుకు చెందిన గాంధీ, కాలేజీ క్యాంటీన్ బాయ్ గా ఉత్తేజ్ వంటి ఎంతోమంది నటులు ఆ సినిమా విజయానికి దోహదం చేశారు… ఎవరూ తక్కువ కాదు, అందరూ సీన్లను పండించినవాళ్లే…

వాళ్లంతా జీవించి ఉండడమే కాదు, ఇంకా తెరపై వెలుగుతూనే ఉన్నారు… కానీ వీళ్లలో ఏ ఒక్కరినీ నాగార్జున శివ రీ-రిలీజ్ పబ్లిసిటీకి వాడటం లేదు… అలాగే ఇతర టెక్నీషియన్స్ ని కూడా… పిటీ..!! శివ క్రెడిట్ కేవలం నాగార్జున- వర్మలదేనా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శివ అంటే నాగార్జున, వర్మ మాత్రమేనా..? ఇంకెవరికీ క్రెడిట్ లేదా..?!
  • డాక్టర్ ఐపీఎస్… ఉగ్రవాదుల ఓ భారీ కుట్రను ఛేదించిన తెలుగు పోలీస్…
  • వ్యూహాత్మక బగ్రామ్ ఎయిర్‌ బేస్‌కై చైనా, అమెరికా పాలిటిక్స్… కానీ..?
  • శివకు రీ-రిలీజ్ ఉన్నట్టే… వర్మకూ ఓ రీ-రిలీజ్ ఉంటే బావుండు…
  • దక్షిణాఫ్రికా నుండి గోవా తీరానికి… ఒక క్రికెట్ లెజెండ్ కొత్త కథ..!
  • ఏడీ..? ఆ కీరవాణి ఏమయ్యాడు..? టాలీవుడ్ సంస్కారం ఏమైంది..?!
  • పశ్చాత్తాప ప్రకటనలు… నేరాంగీకారాలు… జగన్ విధేయుల్లో భయం..!!
  • దాసి..! దోపిడీ కేంద్రాలు దొరల గడీలు… లైంగిక దోపిడీలకు కూడా…!
  • అమరజ్యోతి సంపూర్ణంగా వెలిగిస్తేనే… తెలంగాణ అమరులకు నివాళి…
  • నిష్కపటి, నిష్పక్షపాతి, నిర్మొహమాటి… నాకు తెలిసిన అందెశ్రీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions