.
అవునూ… ఛావా అనగా సింహ సంతానం… అనగా శివాజీ కొడుకు శంభాజీ కథ తెలుసుకున్నాం… స్వధర్మం వీడకుండా, మొఘలులు ప్రత్యేెకించి ఔరంగజేబును ధిక్కరించి, పోరాడి… చిత్రహింసలకు గురై… చివరెకు నీ కూతుర్ని నాకిచ్చినా నేను మతం మారను, నీకు లొంగను, తలవంచను అంటూ… ఆ తలను ఖండించినా సరే, ఆ మరణాన్ని గర్వంగా స్వీకరించాడు… వోకే… ఛావా కథ అదే కదా…
అబ్బే, అంత సీన్ లేదు… శంభాజీ చరిత్రను మరీ కావాలని ఓవర్ ఎక్స్‌పోజ్ చేస్తున్నారు, ఇదంతా సంఘ్ కుట్ర అంటూ హాహాకారాలు కూడా బోలెడు వినిపిస్తున్నాయి… అవన్నీ కాసేపు పక్కన పెడితే… అలాంటి శంభాజీలు ఎందరో మొఘలుల హింసలకు, దాడులకు గురయ్యారనీ, లక్షల గుళ్లు దోపిడీలకు గురయ్యాయనీ, హిందువుల ఊచకోతలు జరిగాయనీ చరిత్రలో రికార్డయ్యిందేనే నిజాన్ని కూడా పక్కన పెడితే…
Ads
ఆ శంభాజీ హత్య తరువాత తన భార్య యశుబాయి (ఏసుబాయి అని వికీ చెబుతుంది, బహుశా యశోబాయి అనేది కూడా ఆమె అసలైన పేరు కావచ్చు… సరే, యశుబాయి అనే చెప్పుకుందాం ఈ కథనానికి…) ఏమైంది..? ఛావా సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రయారిటీ దక్కలేదు… పాపురల్ నటి రష్మికను తీసుకున్నా సరే ఎందుకోగానీ ఆమె కేరక్టర్‌కు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్… విక్కీ కౌశల్‌తోనే వన్ మ్యాన్ షో నడిపించాడు…
ఆమె పేరు యశుబాయి భోంసాలే… శివాజీ తల్లి జిజియాబాయి లాగే యశుకి కూడా విశేష అధికారాలుండేవి… రాజులు రాజధాానిలో లేనప్పుడు, యుద్ధాల్లో తిరుగుతున్నప్పుడు రాజ్యపాలన వాళ్ల బాధ్యతే… యశుబాయి దగ్గర శ్రీ సఖీ రద్నాయి జయతి అనే రాజముద్ర ఉండేది… బాహుబలిలో శివగామి చెప్పినట్టు ఆమె మాటే శాసనం…
శంభాజీ మరణం తరువాత తన మరిది (శివాజీ రెండో కొడుకు) రాజారామ్‌ను తదుపరి ఛత్రపతిగా ప్రకటించింది… ఏడెనిమిది నెలలు రాయగఢ్ కోట కోసం పోరాడింది… కానీ సాధ్యం కాలేదు… ఓడిపోయింది… కోటను అప్పగించి ఔరంగజేబు బిడ్డ జీనతున్నీసాతో ఓ ఒడంబడిక… నీ మరిదిని, నీ రాజ్యాన్ని వదిలేస్తాం, నువ్వు మా బందీగా ఉండు… అవును… రాజకుటుంబం భద్రతకు ఓ భరోసా అది… ఆమె అంగీకరించింది… (మరాఠాలు ఆమె నేతృత్వంలో బలపడి ఇక తమపై తిరగబడకుండా మొఘలుల వ్యూహం అది…)
మహారాష్ట్రంలోని పలు కారాగారాల్లో తన కొడుకు శాహూరాజేతోపాటు 17 సంవత్సరాలు ఉంచారు… తరువాత కొడుకును వదిలేసి ఆమెను ఢిల్లీ ఎర్రకోటలో 12 సంవత్సరాలు… అంటే మొత్తం 29 సంవత్సరాలు ఆమె మొఘలుల ఖైదీ… (ఎంత చరిత్రను మనం తెలుసుకోలేకపోయామో కదా…)
మొఘలుల చెరలో ఆమెకు పర్షియన్ భాషలో “యశుబాయి వలీదా-ఎ-షాహు” అనే మరో నామముద్ర ఉండేది… ఛత్రపతి శాహు మహారాజ్ మరియు రాజమాత యశుబాయి రహస్యంగా లేఖల ద్వారా ఒకరితో ఒకరు సంప్రదింపుల్లోనే ఉండేవారు..,
దీనికి సంబంధించిన ఆధారాలు కూడా చరిత్రలో ఉన్నాయి. 1719లో ఛత్రపతి శాహు మహారాజ్ (ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరియు మహారాణి యశుబాయి కుమారుడు) పీష్వా బాలాజీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో మరాఠాలు బలపడినప్పుడు చివరకు ఆమె విడుదలైంది…!!
Share this Article