గుడ్, లాపతా లేడీస్ సినిమాను వచ్చే ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా ఫిలిమ్ ఫెడరేషన్ అధికారికంగా పంపించడానికి నిర్ణయించారు… సినిమా పర్లేదు కానీ, షార్ట్ లిస్ట్ చేసిన 29 సినిమాల్లో ఇంకొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి…
సరే, ఇవీ జాతీయ అవార్డుల వంటివే కదా… రకరకాల ప్రభావాలుంటాయి… ఏవేవో సమర్థనలూ ఉంటాయి… ఏవో లెక్కలుంటాయి… ఐతే దర్శకురాలు కిరణ్ రావుకు మంచి గుర్తింపు ఇది… ఆస్కార్ ఎంట్రీగా పంపించడం అంటే గుర్తించదగిన సినిమాగా మన వాళ్లు అధికారికంగా ఓ ముద్ర వేసినట్టే కదా…
సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు, లక్ష్యాలు, సంతోషాలు ఎలా అణచివేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకురాలు కిరణ్ రావ్ కాస్త కామెడీ లైన్‌లో చూపించారు. పెళ్లి చేసుకొని అత్తవారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తారనే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించారు…
Ads
కానీ చాలామంది ఆస్కార్‌కు వెళ్లింది అని రాసేస్తున్నారు… కానీ ఈ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజీ ఫిలిమ్ కేటగిరీలో అన్ని దేశాల నుంచీ ఎంట్రీలు వస్తాయి… ఇది మన దేశం నుంచి ఎంట్రీ… చాలా ప్రాథమిక దశ… తరువాత స్థాయిలో నామినేట్ అయితే కదా, చివరి పోటీ పరిశీలనలోకి చేరేది… అదీ అసలైన పరీక్ష… మంచి ఆశిద్దాం కానీ అదంత వీజీ మాత్రం కాదు…
2002లో లగాన్ మన ఎంట్రీగా వెళ్లి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్స్ జాబితాలో నామినేట్ అయింది… కానీ రాలేదు… తరువాత కూడా ప్రతి ఏటా మనం పంపిస్తూనే ఉన్నాం… నామినేషన్ దశకు చేరలేదు ఏవీ… అంతకుముందు నర్గీస్ నటించిన మదర్ ఇండియా, మీరానాయర్ తీసిన సలాం బాంబే సినిమాలు కూడా నామినేటయ్యాయి… కానీ మనకు నిరాశే కదా మిగిలింది…
అస్సామీ ప్రసిద్ధ దర్శకుడు జాహ్నూ బారువా అధ్యక్షుడిగా ఉన్న 13 మంది సభ్యుల కమిటీ తమ వద్దకు వచ్చిన 29 సినిమాలను పరిశీలించింది. అందరూ ఏకగ్రీవంగా ఈ లాపతా లేడీస్ సినిమాను అధికారిక ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక చేశారు. కమిటీ దాకా షార్ట్ లిస్టయి వెళ్లిన ఆ 29 సినిమాలు ఇవీ…
వీటిలో ఒడియా, మరాఠీ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల సినిమాలున్నాయి… చాలా పాన్ ఇండియా సినిమాలే… కాకపోతే ఒరిజినల్‌గా ఏ సినిమాలో తీయబడిందో ఆ భాష కేటగిరీలో చేర్చారు… ఇవీ ఆ సినిమాలు… (ఆస్కార్ ఎంట్రీ కోసం లాపతా లేడీస్ సినిమాతో శ్రీకాంత్ సినిమా బలంగా పోటీపడింది…)
- హనుమాన్ (తెలుగు)
- లాపతా లేడీస్ (హిందీ)
- ఛోటా భీమ్ (హిందీ)
- కల్కి 2898 ఏడీ (తెలుగు)
- గుడ్ లక్ (హిందీ)
- ఘరట్ గణపతి (మరాఠీ)
- కిల్ (హిందీ)
- యానిమల్ (హిందీ)
- శ్రీకాంత్ (హిందీ)
- ఆట్టమ్ (మలయాళం)
- చందు చాంపియన్ (హిందీ)
- కొట్టుక్కళి (తమిళం)
- మహారాజ (తమిళం)
- జొరం (హిందీ)
- మైదాన్ (హిందీ)
- శామ్ బహదూర్ (హిందీ)
- ఉల్లొజుక్కు (మలయాళం)
- మంగళవారం (తెలుగు)
- ఆడుజీవితం (మలయాళం)
- జిగర్‌తండా -2 (తమిళం)
- వీర సావర్కర్ (హిందీ)
- తంగలాన్ (తమిళం)
- జమా (తమిళం)
- వాళై (తమిళం)
- స్వరగంధర్వ (మరాఠీ)
- ఆర్టికల్ 370 (హిందీ)
- ఘాత్ (మరాఠీ)
- ఆభా (ఒడియా)
- ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం)
Share this Article