.
ముందుగా విషయం ఓసారి చదవండి… హొంబలె ఫిలిమ్స్… బెంగుళూరు బేస్డ్ చిత్ర నిర్మాణ సంస్థ… మొదట్లో చిన్నాచితకా సినిమాలు తీసినా… కేజీఎఫ్ రెండు పార్టులతో దాని కథే మారిపోయింది… కాంతార అనుకోని బ్లాక్ బస్టర్… తరువాత సాలార్…
సుడి అంటే అదీ… పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ కావడమే కాదు… కాంతార ప్రీక్వెల్, సాలార్-2 చేతిలో ఉన్నాయి… రక్షిత్ శెట్టితో రిచర్డ్ ఆంటోనీ… ఇవేకాదు, తాజాగా మహావతార్ నరసింహా అనే యానిమేటెడ్ ఫిలిమ్ రిలీజ్ చేశారు…
Ads
అంతేకాదు, దశావతారాల మీద వరుసగా పది యానిమేటెడ్ సినిమాలు తీస్తామనీ ప్రకటించారు… సరిగ్గా ఇక్కడే మనకు నొసలు ముడిపడుతుంది… ఆల్రెడీ నరసింహా సినిమాలో వరాహ, నరసింహావతరాలు అయిపోయాయి… (హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కథలతో…)
ఇక మిగిలినవి ఎనిమిది అవతారాలు… అసలు మిగతా ఎనిమిది ఏమిటి..? ఇదీ అసలు ప్రశ్న.,. (అసలు ఎన్ని సినిమాల సీరీస్ తీస్తారు అనేదీ ప్రశ్నే…) సరే, మత్స్యావతారం… వోకే, కానీ ఓ పూర్తి నిడివితో సినిమా తీసేంత కథ అందులో ఉండదు… ఏదైనా అదనంగా క్రియేట్ చేసి, ఉపకథల్ని కలిపి, ఏ కన్నప్పలాగో ఏదేదో కలిపేస్తే తప్ప…
కూర్మావతారం కథ కూడా అంతే… మత్స్యం, కూర్మం కథలు ఎలాగోలా తీసేస్తారు అనుకుందాం… ఈ నాలుగు అయిపోతే ఇక మిగిలినవి ఆరు కదా… వామనావతారం కూడా కథ సినిమాకు బాగా పనికొస్తుంది… ఎలాగూ గ్రాఫిక్స్, యానిమేటెడే కాబట్టి రక్తికట్టొచ్చు… ఇక రాముడు, కృష్ణుడు అవతారాలు సరేసరి.., ఎన్ని పార్టులు తీసినా ఇంకా మిగిలే ఉంటుంది కథ…
మరి మిగతా మూడు ఏవి..? ఇదే అసలు ప్రశ్న… సరే, రాబోయే ప్రతిపాదిత కల్కి అవతారాన్ని కూడా కలిపితే… ఇంకా రెండు అవతారాలు ఏవి..? కొందరు పరుశురాముడు అంటారు… దాన్నీ వోకే అంటే… మరొకటి..? కొందరు బుద్ధుడు అంటారు… అసలు దేవుడు లేడు, పరలోకాలు లేవు, మన జీవన విధానమే ముఖ్యం అన్న బుద్ధుడిని కూడా దేవుడిని చేసేశారు… పోనీ, బుద్ధుడు అవతారం కాదు అనుకుందాం కాసేపు, మరి ఆ మిగిలిపోయిన ఆ అవతారం ఏమిటి..?
కొందరు బలరాముడు అంటారు… కానీ పురాణాల ప్రకారం తను ఆదిశేషుడి అవతారం, సో, విష్ణువు అవతారం కాదు… కొన్ని కథలు విఠోభా అంటాయి, మరికొన్ని జగన్నాథుడు అంటాయి… ఏమో, హొంబలె వాళ్లు ఏం ఫిక్స్ చేశారో చూద్దాం… కానీ ఏ కథకు ఆ కథ విడిగా చెప్పినా సరే, మొత్తం దశావతారాల్ని డార్విన్ జీవపరిణామ సూత్రంలో ఫిట్ చేసి చెప్పాలి ఎక్కడో ఓచోట… టి.కృష్ణ తీసిన దేవాలయం సినిమాలో దీన్ని అద్భుతంగా ఓ పాట రూపంలో చెబుతారు…
మత్స్య… పాలియోజోయిక్ యుగం… మొదట్లో కేవలం సముద్రజీవం…
కూర్మ… ఉభయచరం, తాబేలు… ఇది మెసోజోయిక్ యుగం…
వరాహ… భూతల జీవం… సెనోజోయిక్ యుగం… భూమ్మీదకు వచ్చింది జీవం…
నరసింహ… మృగం నుంచి మనిషి పరిణామ క్రమం… సెనోజోయిక్ యుగం…
వామనుడు… మరుగుజ్జు రూపం… అంటే సంపూర్ణ మనిషిగా పరిణామం వైపు ఓ దశ…
పరుశురాముడు… గొడ్డలి వంటి ఆదిమ ఆయుధాల్ని ఉపయోగిస్తున్న మనిషి…
రాముడు… సమాజ జీవనం, ఆదర్శం, కట్టుబాటు… వానరులతో స్నేహం…
కృష్ణుడు… విష్ణువు దేవుడిగా అవతారమెత్తడం, అధర్మానికి శిక్ష, ధర్మానికి బాసట…
బుద్ధుడు… మనిషికి ఇహ, పరలోకాల మీద జ్ఞానోదయం…
కల్కి… తదుపరి దశ… రక్షకుడు… రావల్సి ఉంది… ఇదే మానవ పరిణామ క్రమం… అదే దశావతార మార్మిక సూత్రం…!!
Share this Article