అసలు ఈ వార్తలో ఏముంది అనేది పెద్ద ఇష్యూ కాదు…. ఆ కోణంలో ఇది వార్తే కాదు… ఈనాడు పెద్దల పైత్యం తప్ప..! కానీ ఈ వార్త వెనుక ఉద్దేశం ఏమిటి అనేదే ప్రధానం… సాయిరెడ్డి వైజాగులో నాకు త్రీబెడ్రూం ఫ్లాట్ తప్ప ఇంకేమీ లేదు, ఆస్తుల్లేవు, భూముల్లేవు అని అప్పట్లో ఏవో నీతివాక్యాలు చెప్పాడట… ఫాఫం, అప్పుడప్పుడూ వీథి పక్కన ఇడ్లీ తిని పొట్టపోసుకునేవాడట కూడా… సాయిరెడ్డి కూడా రాజకీయ నాయకుడే, తనేమీ శుద్దపూస కాదు… అయితే ఇక్కడ ఈ వార్తలోని అంశాల్లో నిజమెంత..? (ఆమధ్య అటూఇటూ కాని, ప్రపంచంలో ఎవడికీ అర్థం కాని వింత రీతిలో… లేపాక్షి వార్త కూడా ఏదో రాసినట్టు గుర్తు…)
ఆయన అల్లుడు ఎప్పట్నుంచో ఫార్మా వ్యాపారి… బలమైన ఆర్థిక స్థోమత ఉన్నవాడే… ఈ భూములన్నీ లీగల్‌గా కొన్నవే కదా… లీగల్ కాబట్టే ఈ లిస్టు ఈనాడుకు దొరికింది కదా… ఒక్క బినామీ పేరు లేదు కదా… గతంలో ఇదే యెల్లోబ్యాచ్ ప్రచారం చేసినట్టుగా, రైతుల మెడలపై పులివెందుల వేటకొడవళ్లు పెట్టి, కబ్జా చేసి, కాగితాలపై సంతకాలు పెట్టించుకోలేదు కదా… మరి ఇది అక్రమం ఎలా అయ్యింది..? అబ్బే, అమరావతి మీద ఇన్‌సైడ్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేస్తున్నారు… మరి ఇదేమిటి అనే భావనను జనం బుర్రల్లోకి ఎక్కించే ఓ నాసిరకం, మోటు పాత ప్రయత్నం ఇది…
తీరా చూస్తే ఈ క్రయవిక్రయాలు గత సంవత్సరం చివరలో ఎక్కువగా జరిగాయి… ఇన్‌సైడ్ ఏముంది..? వైజాగ్ పరిపాలన రాజధాని అని జగనే అసెంబ్లీలో అన్నాడు కదా… ఇక రహస్యమేముంది..? జగన్ ఈ మూడేళ్లలో గొప్పగా చెప్పుకునే ఏ పనీ చేయలేకపోయాడు… చేతకాలేదు, చివరకు ఈనాడు, ఆంధ్రజ్యోతిల మీద చర్యలు కూడా చేతకాలేదు..! తెలుగుదేశం కేడర్ మీద వందలాది దాడులు చేయించి, కేసులు పెట్టించడం కాదు, ఈ ఆక్సిజెన్ పైపుల్ని కదా కత్తిరించాల్సింది చేతనైతే… పైగా ఆయన మంత్రులే ఈనాడు స్టూడియోలకు వెళ్లి, స్టెప్పులేసి, టీవీ ప్రోగ్రాంలు చేస్తూ పకపకా నవ్వుతుంటారు… ఫాఫం జగన్…
Ads
నిజం… వైసీపీకి ప్రధాన ప్రత్యర్థులు ఈనాడు- జ్యోతి…! కౌంటర్ చేయడం సాక్షికి చేతకాదు… అదెప్పుడో చేతులెత్తేసింది… ఏదో నడుస్తోందీ అంటే నడుస్తోంది… ఏదైనా యెల్లో వార్తకు ఖండన రాస్తే, చేతాడు పొడవు ఉంటుంది కానీ, అది చదివేలా ఉండదు, నాలుగుసార్లు చదివినా ఎవరికీ ఏమీ అర్థం కాదు… ఇప్పుడు చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మడం లేదు… 23 స్థానాలకు తొక్కేసిన వ్యతిరేకత కాస్త తగ్గిందేమో గానీ చంద్రబాబును క్షమించేసి అక్కున చేర్చుకునేంతగా పరిస్థితి ఏమీ మారలేదు…
పవన్ ఏం మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో తనకే తెలియదు… తెలుగుదేశం మాజీ మంత్రులు మాట్లాడితే జనానికి పట్టదు… ఇక రామోజీరావు- రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు… ట్రిపుల్ ఆర్… జగన్ వ్యతిరేకత వ్యాప్తి బాధ్యతను మీదేసుకుంది… ఎలాగూ ఇంకెవడూ దిక్కులేడు ఏపీలో… స్పేస్ ఉంది, వాడుకునే లీడర్ లేడు… (నిజంగా తెలుగు సమాజం ఎంత చైతన్యరహితం..?) సో, జగన్ మీద వ్యతిరేకత పెంచుదాం… ఆటోమేటిక్‌గా వేరే దిక్కులేక జనం చంద్రబాబుకే జై అంటారు అనేది వాళ్ల నమ్మకం కావచ్చు… ఒకవేళ పాత విలన్‌ను ఏం మోస్తాములే, ఈ విలన్ అలవాటయ్యాడు, మరో అయిదేళ్లు మోస్తే సరి అని జనం అనుకుంటే ఎలా..? చిక్కు ప్రశ్న..!!
Share this Article