Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జాగ్రత్తపడాలి… ఎందులో…!?

November 11, 2024 by M S R

కొన్ని సైట్లలో, కొన్ని యూట్యూబ్ చానెళ్లలో సాయిపల్లవిని ఉద్దేశించి కొన్ని వార్తలు… కావు, సలహాలు కనిపించాయి… నువ్వు గనుక ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే దెబ్బతింటావు సుమీ అని హితబోధ చేశాయి…

ఏమిటయ్యా అంటే… ఈ లేడీ పవర్ స్టార్ ప్రెస్‌ మీట్లు, మీడియా మీట్లు, ప్రమోషన్ మీట్లకు వచ్చినప్పుడు అందరూ కేకలు వేస్తున్నారు ఆమెను చూసి… అభినందనపూర్వకంగానే తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ… నెగెటివ్‌గా కాదు…

ఇదిలాగే కంటిన్యూ అయితే ఆమెతో కలిసి నటించిన హీరోలు, ఆమె సినిమాల తాలుకు నిర్మాతలు, దర్శకుల ఇగోలు దెబ్బతిని… మెల్లిగా ఇక ఆమెను పక్కన పెట్టేస్తారని ఆ వార్తల సారాంశం… దానికి కారణం కూడా చెప్పుకొచ్చాయి ఆ వార్తలు…

Ads

మన హీరోలు మహా ఇగోయిస్టులు… తమను కాదని హీరోయిన్లకు మంచి అప్లాజ్ దక్కితే ఓర్చుకునేంత సహృ‌దయులు కాదు కాబట్టి ..! నిజమే… ఆ వార్తల రచయితల ఉద్దేశం కరెక్టే… మన మగ తోపులు మహా ఇగోయిస్టులు… అందరూ రానాలాగా ఆమెకు గొడుగుపట్టలేరు… నాని, నాగచైతన్యల్లా సర్దుకుపోలేరు… నాగశౌర్యలు కూడా ఉంటారు…

ఆమె బహిరంగ వేదికల మీద కనిపించిన సందర్భాల్లోనూ జనం నుంచి పెద్ద ఎత్తున కేకలు వినిపిస్తాయి… అది ఆమె సంపాదించుకున్న అభిమానం… హీరోయిన్లకు ఇలాంటి ఆదరణ చాలా కష్టం… దాన్ని ఆమె ఎలా కాదనగలదు..? ఇందులో నిజంగానే ఆమె చేయగలదు..?

ఏయ్, సైలెంటుగా ఉండండి అని హెచ్చరించలేదు కదా… అలాగని ప్రమోషన్ ఫంక్షన్లు, మీడియా మీట్లకు రాకుండా ఉండలేదు కదా… అలా చేస్తే నిర్మాతలు, దర్శకులు ఊరుకోరు… ఐనా వాళ్లే పొగుడుపూల దండలు వేస్తున్నారు కదా అభిమానులకన్నా ఎక్కువగా…

అమరన్ దర్శకుడు ఆమెతో సినిమా చేయాలనే నా చిరకాల కోరిక నెరవేరింది అనేశాడు మొన్న… నిజం చెప్పాలంటే తెలుగులో ఆ సినిమా బాగానే వసూళ్లను సాధించిందీ అంటే అది సాయిపల్లవి కారణంగానే..! సినిమాకు ప్రాణం కూడా ఆమె నటనే… మరి ఆమె జాగ్రత్తపడాల్సింది ఏమీ లేదా..? ఉంది…

ఖచ్చితంగా ఉంది… కొన్ని ఆమె బయటికి రివీల్ చేయకూడదు… నా పోర్షన్ కట్ చేయకూడదని దర్శకుడి నుంచి రిటెన్ హామీ తీసుకున్నాను, ముంబైలో పీఆర్ ఏజెన్సీలు నాకక్కర్లేదని తిరస్కరించాను, సహాయ దర్శకుల దోపిడీ వంటి మాటలు అవసరం లేదు… ఇలాంటివి లోపలే దాచుకోవాలి తప్ప బయటికి చెప్పాల్సిన అవసరం లేదు… ఆమె ‘అతి’ చేస్తోందనే భావనలకూ ఆస్కారమిస్తాయి అలాంటి మాటలు… అన్నింటికీ మించి…

వివాదాస్పద అంశాలపై ఆమె మాట్లాడకుండా ఉంటే ఆమెకే మంచిది… ఆమె మనసులో అనుకున్న ఉద్దేశాల్లో తప్పు లేకపోవచ్చుగాక… కానీ ఆమె సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేదు, ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు… ఆమెకు వచ్చిన తెలుగు దానికి సహకరించదు… ఆమె అనుకునేది ఒకటి, జనంలోకి వెళ్లేది మరొకటి… గతంలో ఆర్మీ మీద గానీ, కశ్మీర్-గోహత్యల మీద గానీ చేసిన వ్యాఖ్యలు ఆమెకు నెగెటివ్ అయ్యాయి…

హైదరాబాదులో కేసు కూడా నమోదైంది… నాకు విషయాలన్నీ బాగా తెలుసు అనే భ్రమలుంటే తక్షణం ఆమె వాటిని వదిలేసుకోవాలి… సున్నితమైన, వివాదాస్పద అంశాల మీద లోతైన, సవివర వ్యాఖ్యలు చేసేంత పరిణతి ఆమెకున్నట్టు లేదు… ఉన్నాసరే, ఇంగ్లిషులో లేదా తమిళం- మలయాళం భాషల్లో చెప్పడం బెటర్… అసలు ప్రస్తుతానికి బియాండ్ మూవీస్ తన అభిప్రాయాలను తనలోనే ఉంచుకోవడం బెటర్…!!

అన్నింటికీ మించి ఆమె పాపులారిటీ ఎక్కువ కాబట్టి, పాత్రకు తగినట్టు నటించగలదు కాబట్టి ఆమెకు అవకాశాలిస్తున్నారు నిర్మాతలు, దర్శకులు… హీరోలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆమెను… దాన్ని కాపాడుకోవాలీ అంటే తన సినిమాలకు సంబంధించిన అంశాలకే పరిమితం కావడం బెటర్… ఎందుకంటే, ఇప్పుడు మీడియా ఏదైనా చిన్న తప్పు దొరికితే చాలు, సాయిపల్లవి అని కూడా చూడదు..!!

నటి కస్తూరి తాజా చేదు అనుభవాలు తెలుసు కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions