పల్లవి ప్రశాంత్… ఒలింపిక్ పతకం తెచ్చాడా..? గొప్ప పరిశోధన చేశాడా..? సివిల్స్‌లో గొప్ప పోస్ట్ కొట్టాడా..? నలుగురు జనానికి ఏమైనా సేవ చేశాడా..? ఏదేని ఎన్నికల్లో గెలిచాడా..? గొప్ప రచన ఏమైనా చేశాడా..? గొప్ప స్కాం బయటికి తీశాడా..? సైనికుడై దేశం కోసం పోరాడాడా..? వాటీజ్ దిస్..? ఆఫ్టరాల్ ఓ దిక్కుమాలిన షోలో ఓ ప్రైజ్ గెలవడమా..? అని తెగబాధపడిపోయాడు ఓ మిత్రుడు… ఆ మెసేజ్ చదువుతుంటే ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న ఓ రాత గుర్తొచ్చింది…
‘‘దేవుడు ప్రజలకు వివేకాన్ని ఇవ్వాలనీ, ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి’’ అని రాసుకొచ్చాడు… అఫ్ కోర్స్, తను జగన్‌ను తిట్టే క్రమంలో రాశాడు… కానీ అది చదువుతుంటే పల్లవి ప్రశాంత్ ఫాలోయర్ల సంఖ్య ఒక మిలియన్‌కు చేరుకున్నదనే ఓ సోషల్ పోస్టే గుర్తొచ్చింది… తను రైతుబిడ్డ అని రాసుకోవడం మానేసి, మల్లొచ్చిన, స్పై బ్యాచ్ విన్నర్ అని రాసుకుంటున్నాడట… నిజమే, రైతుబిడ్డ అనేది హౌజులో సింపతీ కోసం మాత్రమే… ఇప్పుడేం అవసరం..? స్పై బ్యాచ్ విన్నర్ అంటే తనేదో దేశానికి పనికొచ్చే గూఢచర్యం ఏదో చేశాడని అనుకోవద్దు సుమీ… ఆ పనికిమాలిన సోఫాజీ అలియాస్ శివాజీ చెక్కిన ఉన్మత్త శిల్పం ఈ పల్లవి ప్రశాంత్… కరెక్టే బ్రదర్, నువ్వు రైతుబిడ్డవు కావు, ఆ దిక్కుమాలిన స్పై బ్యాచ్ మెంబర్‌వే…
Ads
తన తరఫున 50 మంది లాయర్లు అట… ఇప్పుడు బిగ్‌బాసోడు ఇచ్చిన డబ్బులున్నాయి కదా… పర్లేదు, రైతులకు ఇవ్వకపోతే ఎవడూ అడగడు, లాయర్లకు ఖర్చు తప్పదు కదా… హైకోర్టు లాయర్లు కూడా ఫ్రీగా వాదించడానికి తను బర్రెలక్క కాదు కదా… ఈ వార్తలే చదువుతుంటే తను ఆరుగురు యూట్యూబర్లపై పరువు నష్టం దావా వేయబోతున్నట్టు మరో వార్త కనిపించింది… హైదరాబాదు బజార్లలో తను సృష్టించిన శాంతిభద్రతల సమస్యను పక్కకు మళ్లించడానికి ఇదో ఎత్తుగడా..?
సదరు యూట్యూబర్లను ఇదే పల్లవి ప్రశాంత్ హౌజులోకి వెళ్లడానికి ముందు స్వయంగా కలిసి మద్దతు అడిగాడట… అవును, అప్పుడు అవసరం… తరువాత ఇంటర్వ్యూల కోసం వెళ్తే –గెయ్ అని కసిరాడట… అవును, ఇప్పుడేం అవసరం..? కానీ ఎవరో శివ అనే యూట్యూబరట, మరో సిండికేట్ అట, ఆ కోపంతో ఈ పల్లవీ ప్రశాంతుడి పరువు తీశారట, యూట్యూబ్ వీడియోలతో… శివ అనగానే మరో వార్త గుర్తొచ్చింది… ఏదో టీవీ ప్రోమోలో శేఖర్ మాస్టర్‌ను ఈ శివ ‘‘మీకు ఎవరో హీరోయిన్‌తో అఫయిర్ ఉందట కదా’’ అనడిగాడు… సరే, టీఆర్పీల కోసం ఉద్దేశించిన డ్రామా కావచ్చు, కానీ నిజంగానే సదరు యూట్యూబర్ వీడియోలన్నీ అలాంటివేనట… సరే, దాన్నలా వదిలేస్తే…
ప్రశాంత్ జైలు నుంచి విడుదలైతే అది వార్త… దేశనాయకుడెవరో విడుదలైనట్టు..! మరో వార్త కనిపించింది… బిగ్‌బాస్ నిర్వాహకులనూ విచారిస్తాం అని డీసీపీ ప్రకటన… బిగ్‌బాస్ మీద కేసు నిలవదు గానీ… ఓ మామూలు రైతుబిడ్డను ఉన్మత్తుడిగా చెక్కిన ఆ శివాజీ మీద కేసు పెట్టండి… పల్లవి ప్రశాంత్‌కు మద్దతుగా నిలిచిన భోలే షావలీ, టేస్టీ తేజ, యావర్ తదితరులనూ బుక్ చేయండి… ఏం..? గీతూరాయల్ కారులోకి చేతులు పెట్టి సాగించిన అశ్లీల, అసభ్య పర్వానికి మద్దతా..? అశ్విని కారు మీద దాడికి సపోర్టా..? కడుపుతో ఉన్న తేజస్వి గౌడపై దాడికి సమర్థనా..? అమర్‌దీప్ తల్లి భయకేకలకు వీళ్ల ఆనందమా..?
ఆర్టీసీ, పోలీస్ వాహనాల మీద దాడులకు మద్దతు పలుకుతున్నారా వీళ్లంతా..? పైగా కులం ముద్ర వేసి, పాఫం, అమాయకుడు అని పోస్టులు… నేరాలకు కులమేమిటి..? అగ్రవర్ణాల వాళ్లు ఇలా చేస్తే పోలీసులు ఇలాగే చేస్తారా అని ప్రశ్న… చేయాలి అని డిమాండ్ చేయాలి తప్ప కులాన్ని బట్టి కేసుల నుంచి ఇమ్యూనిటీ వస్తుందా..? పైగా ఈటల, హరీష్ వంటి నేతల బాధ్యతారహిత మద్దతు…
వీథుల్లో ఉద్రిక్తత సృష్టించడానికి కారకుడు ఖచ్చితంగా ప్రశాంతే… పోలీసులు వేరే దారిలో పంపిస్తే, మళ్లీ వచ్చి, రైతుబిడ్డకు ఇదేనా గౌరవం అని పిచ్చి కూతలు కూసింది తనే… ప్రజాఆస్తుల ధ్వంసం గతంలోలాగా ఉపేక్షించే నేరాలు కావు… తెలంగాణ ఉద్యమంలో రైల్వే ఆస్తులను నష్టం చేకూర్చిన వారి మీద ఈరోజుకూ కేసులున్నయ్… బీఆర్ఎస్ అధికారంలో ఉండీ వాటిని రద్దు చేసుకోలేకపోయింది…
ఐనా… తనను ఈ స్థితికి తీసుకొచ్చిన యూట్యూబర్లను వదిలేది లేదని, తనపై కుట్ర పన్నారనీ తను ఆరోపిస్తున్నట్టు మరో వార్త కనిపించింది… ఎవరు కుట్ర పన్నారు..? ప్రభుత్వ వాహనాలు, లేడీస్ కార్లపై దాడులకు కుట్ర పన్నింది ఎవరు..? ఈ యూట్యూబర్లు గాకుండా ఇంకెవరైనా నిన్న డీఫేమ్ చేయడానికి, జైలులో పారేయించడానికి కుట్ర పన్నారా..? పోనీ, అదయినా చెప్పు సోకాల్డ్ ఏకైక రైతుబిడ్డా..? హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ విజయకుమార్ కూడా అదే తెలుసుకోవాలని అనుకుంటున్నారు… బేడీలు రెడీగా ఉన్నాయి బ్రదర్…!!
Share this Article