.
బుద్ధా మురళి…. డబ్బు దేవుడు కాదు, దేవుడి కన్నా తక్కువా కాదు …
డబ్బు గురించి బాగా నచ్చిన మాట ..
డబ్బు గురించి మనకు రెండు రకాల వాదనలు వినిపిస్తాయి … డబ్బే జీవితం కాదు .. డబ్బు లేనిదే జీవితం లేదు .. రెండూ నిజమే రెండూ అబద్దమే ..
Ads
డబ్బు లేనిదే జీవితం లేదు అనేది అక్షర సత్యం . అయితే డబ్బు ఒక్కటే జీవితానికి సరిపోదు … ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు అనిపిస్తుంది .. ఆ అభిప్రాయం తప్పు అని ధృవ్ రాథీ ఒక ఆసక్తికరమైన వీడియో రూపొందించారు ..
ఎలాన్ మాస్క్, బిల్ గేట్స్ మొదలు కొని ప్రపంచ లో టాప్ టెన్ సంపన్నులు విడాకులు తీసుకున్నారు .. మాస్క్ కూతురు తనకు తండ్రితో ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించారు .. ప్రపంచ సంపన్నుల్లో 50 శాతం మంది విడాకులు తీసుకున్నారు ..
టాప్ టెన్ సంపన్నులు సైతం డిప్రెషన్ తో బాధ పడుతున్నారు … సంపద ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వదు … సంపద సంతోషాన్ని ఇస్తే వీరంతా విడాకులు , డిప్రెషన్ తో ఎందుకు బాధపడుతున్నారు అని ధృవ్ రాథీ ఆసక్తికరమైన వీడియో రూపొందించారు.
మాస్క్ మొదలుకొని ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల వరకు అందరూ విడాకులు , డిప్రెషన్ , కుటుంబ సంబంధాలు లేకపోవడంతో సమస్యల్లో మునిగిపోయారు . ప్రపంచ సంపన్నులను కూడా డబ్బు సంతోషం ఇవ్వలేకపోయింది ..
ఇలా సాగింది వీడియో… చెప్పిన ఉదాహరణలు, డిప్రెషన్, విడాకులు అన్నీ నిజమే … మధ్యలో ఆనందకరమైన జీవితం కోసం తాను రూపొందించిన కోర్స్ కొనుక్కోమని ధృవ్ రాథీ సొంత ప్రకటన …
ప్రపంచ సంపన్నులకు సైతం డబ్బు సంతోషం ఇవ్వక పోవడం నిజమే …. రాథీ కోర్స్ కోసం కూడా డబ్బులు కావాలి అదీ నిజమే . ఈ వీడియో ప్రశాంతంగా వినడానికి సైతం ఎంతో కొంత డబ్బు అవసరం …
డబ్బు సంతోషాన్ని ఇవ్వదు … ఇదీ నిజమే … డబ్బు లేకపోతే కూడా సంతోషం దొరకదు … దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనకు మనమే నిర్ణయించుకోవాలి …
డబ్బుదేముంది అని మాట్లాడేంతగా డబ్బు సంపాదించిన తరువాత ఇలాంటి ఫిలాసఫి మాట్లాడాలి అని షారుఖ్ ఖాన్ ఓ సందర్భంలో అంటాడు ..
ప్రపంచ సంపన్నుల్లో డిప్రెషన్ , కుటుంబం విచ్చిన్నం నిజమే .. అలా అని డబ్బు లేకపోతే జీవితం దుర్భరంగా మారుతుంది ..
జీవితానికి డబ్బు అవసరం, బలమైన కుటుంబ సంబంధాలు … చిన్న చిన్న సరదాలు అవసరమే … డబ్బున్న వారి సమస్యల గురించి ఇంత బాగా సమాచారం సేకరించి చెప్పిన ధృవ్ రాథీ వీడియో మధ్యలో ఆనందకరమైన జీవితం గురించి తాను రూపొందించిన ఒక కోర్స్ గురించి చెప్పారు …
ఈ కోర్స్ బాగుంటుంది అని నా అంచనా అయితే అది పేయిడ్ కోర్స్ .. డబ్బులు చెల్లించాలి … జీవిత సత్యం ఇందులోనే ఉంది ధృవ్ రాథీ …. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అని నువ్వు రూపొందించిన వీడియోలోనే డబ్బు చెల్లించి, జీవిత ఆనందాన్ని పొందే కోర్స్ కొనమన్నావు చూడు ఇదే జీవితం …..
Share this Article