.
నటి భావన లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు, మరో హీరో దిలీప్‌కు మద్దతుగా నిలబడి, తన సినిమా ప్రమోషన్లకు సహకరించి మలయాళ ఇండస్ట్రీలోనే బోలెడు విమర్శలను ఎదుర్కుంటున్నాడు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్… ప్రత్యేకించి మాలీవుడ్ లేడీ ఆర్టిస్టులు కడిగేస్తున్నారు బాహటంగా…
ఈ నెగెటివ్ వాతావరణంలో రిలీజైన తన కొత్త సినిమా ‘వృషభ’ మీద ఆ వ్యతిరేకత తాలూకు ప్రభావం ఉంటుందా అనే ఆసక్తి కలిగింది… నిజానికి ఒక సినిమా ఫ్లాపుకు, హిట్టుకూ బోలెడు కారణాలు ఉంటాయి, కానీ హీరో వ్యక్తిగతం, ఇతర వివాదాల ప్రభావం సినిమా సక్సెస్ మీద పెద్దగా ఉండదు, కానీ సినిమా అట్టర్ ఫ్లాప్, హిస్టారిక్ డిజాస్టర్ అయితే మాత్రం… తన రీసెంటు వ్యక్తిగత వివాదాల మీద చర్చ ఖచ్చితంగా చర్చల్లోకి వస్తుంది…
Ads
నిజమే, మోహన్‌లాల్ పేరుతో… తెరపై తన మొహం కనిపిస్తేనే చాలు… తన ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు పెడతారు, ఎంతోకొంత వసూళ్లు ఉంటాయి అనుకుంటాం కదా… కానీ ఈ భావన నిజం కాదు అని చెప్పడానికి వృషభ డిజాస్టర్ కథ నిదర్శనం… పాన్ ఇండియా సినిమా తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా..? 70 లక్షలు…
50- 70 కోట్ల సినిమా కదా… వారం రోజుల్లో దాని వసూళ్లు ఘోరంగా కేవలం 2 కోట్లు… అందులో సగం తన సొంత మలయాళ వెర్షన్ నుంచే… కన్నడంలో వారంలో కేవలం 6 లక్షలు… థియేటర్ క్లీనింగ్ ఖర్చులూ, కరెంటు చార్జీలకూ సరిపోవేమో… తెలుగులో 38 లక్షలు… తమిళంలో రిలీజ్ చేసేవాడు దొరకలేదు, ఎవడో ఒక బయర్ బతికిపోయాడు…

హిందీ బెల్టు మొత్తంలో 10 లక్షలు… నిజానికి సినిమాకు పెద్ద ప్రమోషన్స్ లేవు, నిర్మాతలకూ దీని అదృష్టమూ మొదట్లోనే అర్థమైనట్టుంది… రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు జీరో బజ్… చిత్ర సమీక్షకులు కూడా ఈ పాత చింతపండు కథను, నాసిరకం గ్రాఫిక్సును కడిగిపారేశారు… ఈ దెబ్బకు ఎంత స్టార్ హీరో అయితేనేం… కొట్టుకుపోయాడు..!
సరే, తను ఎవరిని వెనకేసుకొచ్చాడు..? భావన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్‌ను… తన సినిమా భాభాబ… అందులో మోహన్ లాల్ కూడా ఉన్నాడు… ప్రమోట్ చేశాడు… ఇటు ఈ నెగెటివ్ పరిస్థితుల్లో వృషభ డిజాస్టర్ కదా… మరి నేరుగా విలన్ నటించిన భాభాబ పరిస్థితేమిటి అనేది ఇంట్రస్టింగు కదా…
వృషభ ఫలితానికి కంట్రాస్టుగా… అది ఒక్క మలయాళ వెర్షనే 45 కోట్లు వసూలు చేసింది… దిలీప్ స్థాయికి, అదీ ఈ నెగెటివిటీ నడుమ అంతగా వసూళ్లు రావడం విశేషమే… సో, కథానాయకుడు నిజజీవితంలో పెద్ద విలన్ అయినా సరే, ప్రేక్షకులు తన సినిమాను సినిమాలాగా మాత్రమే చూస్తారని అనుకోవాలన్నమాట..!!
Share this Article