.
ఒక తెలుగు దర్శకుడు అంటాడు “ఫ్రెడరిక్ నీషే” గొప్ప ఫిలాసఫర్ అని, అతన్ని మించిన పిలాసఫర్ లేడు అన్నంత రేంజ్ లో మాట్లాడతాడు. మళ్లీ ఇండియన్ ఫిలాసఫీ నచ్చదు, చదవలేదు అంటాడు, చదివితే తెలుస్తుంది; చదవకుండా మూర్ఖంగా ఇండియన్ ఫిలాసఫీ మీద కామెంట్ చేయటం ఎంతవరకు కరక్ట్ అవుతుంది..?
నీషే ఫిలాసఫీ ప్రధానంగా ఇండివిడ్యులిజంపైనే ఉంటుంది. నిన్ను నీవు ప్రేమించుకో, కుటుంబం అవీ ఇవి అన్నీ మిధ్య, కుటుంబాన్ని పట్టించుకోకు ఇది ఒక్క మాటలో నీషే ఫిలాసఫీ. అతన్ని మించిన థింకర్ & తత్వవేత్త ఎవరూ లేరు అని కొందరు so called హేతువాదులు, నాస్తికులు మాట్లాడటం కూడా నాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Ads
ఫ్రెడరిక్ నీషేకు 40 ల్లోనే జబ్బు చేసి మంచం మీద పడితే సొంత తల్లి కంటికి రెప్పలాగా చూసుకుంది ఆమె మరణించేంతవరకు, ఆ తర్వాత వాళ్ళ సొంత చెల్లెలు చూసుకుంది నీషే మరణించేంతవరకు. వాడు చెప్పింది ఏంటి..? అక్కడ జరిగింది ఏంటి..? నీషే చెప్పింది అతనికే వర్క్ అవుట్ కాలేదు.
నిన్ను నీవు తెలుసుకో, నీవు ఏమిటి అనే దాని గురించి రమణ మహర్షి చెప్పాడు. ఫ్రెడరిక్ నీషే నిన్ను నీవు తెలుసుకో అని చెప్పింది ఏమీ లేదు. కుటుంబం అవసరం లేదు అని చెప్పి ఆయన గొప్పవాడు అయ్యాడేమో కాని అతన్ని కాపాడింది కుటుంబమే. కుటుంబంఅవసరం లేకుండా అసలు ఎలా ఎవరికైనా మనుగడ ఉంటుంది..? నిజానికి నీషే బతికున్నప్పుడు అతని రాతలు చాలా తక్కువ పబ్లిష్ అయ్యాయి. అతను మరణించాక వాళ్ల సిస్టరే వాటిని ఎడిట్ చేసి పబ్లిష్ చేపించింది. వేరే వాళ్ల అవసరం లేకుండా ఇండివిడ్యువల్ గా బతకటం ఎవరికైనా ఎలా కుదురుతుంది…? నీషే ఇండివిడ్యులిజం ఏ కోణంలో కరక్ట్ అవుతుంది..?
అయితే నీషే కొన్ని విషయాల్లో బానే చెప్పాడు, కానీ పెళ్ళాని వదిలెయ్, కూతుర్ని వదిలెయ్, ఇళ్ళు ఊడ్చుకోకు, ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గు వేసుకోకు, పొద్దున్నే లేసి బ్లూ వీడియోస్ చూడండి అని నీషే ఎప్పుడూ చెప్పలేదు.
ఎవడో ఒకడు అన్నీ వదిలేసి స్టూడియో పెట్టుకొని సినెమాలు తీస్తూ నీషే ఇలా అన్నాడు, అయన్ ర్యాండ్ అలా అంది అని కబుర్లు చెప్పుకుంటూ, గొర్రె ఇజం అని ప్రచారం చేసుకోవచ్చు కానీ అది ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడా కనీసం పది మందికి కూడా వర్క్ అవుట్ కాదు. నిజానికి అలా చెప్పిన దర్శకుడు కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు కానీ బయటికి చెప్పుకోడు. పబ్లిసిటీ పిచ్చితో ఎవరెవరో చెప్పిన మాటలని as it is గా తీసుకోవటం కరక్ట్ కాదు. కనపడిన ప్రతి స్త్రీని బూతు కోణంలో చూడటం అతి భయంకరమైన పెద్ద మానసిక రోగం, కనీసం ఇది గొర్రె ఇజం క్రిందికి కూడా రాదు.ఇలాంటి వాటికి హేతువాదం, నాస్తికత్వపు రంగులు వేయటం కూడా కరక్ట్ కాదు.
ఎవరు ఏం మాట్లాడినా గుడ్డిగా నమ్మకుండా ఆలోచించాలి అంటాడు ఒక రోమన్ తత్వవేత్త. నిజానికి ఈ ప్రపంచంలో గెలిచిన వాళ్లలో ఎక్కువ మంది విజయానికి కారణం వాళ్ల కుటుంబం, మరియూ వాళ్లకున్న సపోర్ట్ సిస్టం….. – సామాన్యుడు జగన్నాథ్ గౌడ్… (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article