తెలుగు ఇండస్ట్రీలో రెండు ఎక్స్‌ట్రీమ్, ఫుల్లు కంట్రాస్ట్ కేరక్టర్లు… కాదు, కాదు, యూనిక్ కేరక్టర్లు కనిపిస్తాయి…. రాంగోపాలవర్మకేమో తన గుజ్జుకు తగినంత బుర్ర లేకపోవడంతో, ఓవర్ ఫ్లో అయిపోయి, ఎప్పుడూ మత్తడి దూకుతూ ఉంటుంది బయటికి… బండ్ల గణేష్‌కేమో చిన్నప్పుడే చిప్ కొట్టేసిందా, లేక చిప్ లేనేలేదా అనిపిస్తుంది…
ఎప్పుడైనా వేదిక ఎక్కినప్పుడు చేసే ప్రసంగాలు చూస్తే, వింటే ఇండస్ట్రీ మీదే జాలేస్తుంది… అంతెందుకు..? తనను కూడా మీడియా ఓ కేఏపాల్‌ను చూసినట్టే చూస్తుంది… జోకర్‌గా పరిగణిస్తుంది… ఇవన్నీ గాకుండా తనంతట తను నెత్తిమాశిన ట్వీట్లు వేసి, తిట్లు తింటుంటాడు… ఫాఫం, కొన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కూడా ఉద్దరించినట్టున్నాడు తను…
ఆమధ్య బ్రహ్మాస్త్ర ప్రిరిలీజ్ ఫంక్షన్ రద్దు తరువాత ఏదో పిచ్చి ట్వీట్ వేసి, జూనియర్ ఫ్యాన్స్ తిట్లు, ట్రోల్స్ భరించలేక, ఏదో కవరింగు ప్రయత్నం చేసి, భంగపడిన బండ్ల తాజాగా ఇద్దరు యువహీరోల మీద ఏదో తిక్క ట్వీట్ వేసి, ట్రోల్స్ భరించలేక, ఎలా కవర్ చేయాలో అంతుపట్టక, డొల్ల బుర్ర గోక్కుని, గోక్కుని, చివరకు ఆ ట్వీటే డిలిట్ కొట్టేశారు… (ప్రస్తుతం ఆ ట్వీట్ తన అధికారిక ఖాతాలో కనిపించడం లేదు)…
Ads
ఈమధ్య అడివి శేషు, జొన్నలగడ్డ సిద్దూ ఏదో సినిమా ఫంక్షన్‌కు వచ్చారు… పైన కనిపిస్తున్నది అదే ఫోటో… ఇద్దరూ రిలాక్స్‌డ్‌గా కూర్చున్నారు… ఈవెంట్ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు… ఇది సంస్కార రాహిత్యంలా కనిపించిందట బండ్ల గణేష్‌కు… కాలు మీద కాలేసుకుని కూర్చుకుంటే తప్పేముంది..? సిద్ధూ ఒక కాలిని మరో కాలి కింద మడిచి ఫ్రీగా కూర్చున్నాడు… ఇందులో తప్పు, అసభ్యత, ఓవరాక్షన్ ఎట్సెట్రా ఏమున్నాయి..? కానీ బండ్ల గణేష్ కళ్లు వేరు కదా…
ఆ కళ్ల ఎలా చూశాయో, ఆ కళ్లు బుర్రలో ఏ పురుగును కదిలించాయో గానీ… వెంటనే ఓ ట్వీట్ పెట్టేశాడు… పెడితే వాళ్లిద్దరూ కూర్చున్న తీరు మీద పెడితే ‘‘ఎహె, పోనీ, గణేష్ ట్వీట్లను ఎవడు పట్టించుకుంటాడు’’ అనుకుని అందరూ వదిలేసేవాళ్లు… కానీ పవన్ కల్యాణ్, చిరంజీవి పక్కన చేతులు కట్టుకుని కూర్చున్న ఫోటో ఒకటి పెట్టి… సంస్కారం అంటే మా దేవరదే… నేర్చుకొండి, అది మన సంస్కారం, మన ధర్మం అంటూ ఏదేదో రాసేశాడు…
- ఆ ఇద్దరు యంగ్ హీరోల మాటతీరు బాగానే ఉంటుంది… ఎక్కడా మాట తూలరు… బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతారు… నలుగురిలో వాళ్ల ప్రవర్తన హుందాగానే ఉంటుంది… వాళ్లకు ఒకరు సంస్కారం నేర్పాల్సిన పనిలేదు…
- అక్కడ వాళ్లు కూర్చున్న తీరులో అభ్యంతరకరం ఏమీ లేదు… వినయాన్ని నటించడానికో, ప్రదర్శించడానికో వాళ్ల పక్కన పెద్ద నటులు గానీ, ప్రసిద్ధులు గానీ ఎవరూ లేరు… హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చున్నారు…
- ఇందులోకి పవన్ కల్యాణ్‌ను లాగడం దేనికి..? ప్రతి అంశంలోకీ తనను లాగి… ఇదుగో ఇలాంటి వాళ్లే పవన్ కల్యాణ్ మీద నెగెటివిటీని పెంచేస్తుంటారు…
చివరకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కూడా నచ్చలేదట ఆ ట్వీట్… ఇక ట్రోల్స్ బాధ ఎక్కువై, చివరకు ఆ ట్వీటే డిలిట్ కొట్టేసినట్టున్నాడు… మరెందుకు ఆ నెత్తిమాశిన ట్వీట్లు..? తిట్లు తిని కడుక్కోవడం దేనికి..? అన్నట్టు… గణేషూ… ఆ ఇద్దరు కుర్ర హీరోల మీద ఇలాంటి తప్పుడు ట్వీట్లు పెట్టడాన్నే సంస్కారం లేకపోవడం అంటారు… అభిమానంతో మీ దేవర నిన్ను గాఢంగా అలుముకుని, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నప్పుడు కూడా ఇలాంటి సంస్కార ధర్మాలు నీకెప్పుడూ చెప్పలేదా..?!
Share this Article