గంగా విలాస్ క్రూయిజ్… పలు నదీప్రవాహాల్లో 51 రోజులపాటు తిరుగుతూ, మార్గమధ్యంలో వచ్చే టూరిస్ట్ సైట్లను సందర్శించడం ఒక ప్యాకేజీ… తక్కువేమీ కాదు, ఒక్కొక్కరికీ దాదాపు పది లక్షల వరకూ ఖర్చు ఉంటుంది… ఇండియాలోనే గాకుండా బంగ్లాదేశ్ కూడా కవరవుతుంది… దీన్ని గత వారం ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించాడు… అది అకస్మాత్తుగా బీహార్ సమీపంలో గంగలో డోరీగంజ్ ఏరియాలో చిక్కుపడిపోయిందనేది వార్త…
బీహార్‌లోని ఛప్రా వద్ద గంగలో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఈ క్రూయిజ్ చిక్కుపడిపోయిందనీ, అక్కడ చిరాండ్ అనే ఆర్కియలాజికల్ సైటును సందర్శకులు చూడాల్సి ఉందని, దాంతో వేరే పవర్ బోట్లలో వారిని తీరానికి చేర్చి, ఆ సైటు చూశాక వాళ్లను మళ్లీ తీసుకెళ్లి, క్రూయిజులో చేర్చారు… ఇదీ వార్త సారాంశం… ప్రతి మెయిన్ స్ట్రీమ్ సైట్ ఈ వార్త మొదటి వాక్యంలోనే ప్రధాని ప్రారంభించిన అనే ప్రస్తావన తీసుకొచ్చాయి… నిజానికి ప్రధాని ప్రారంభించడానికి, గంగలో నీళ్లు సరిపడా లేక క్రూయిజ్ ఆగిపోవడానికి సంబంధం ఏముంది..? అక్కడికి ప్రధాని ప్రారంభించడమే దానికి ‘తాశిలి’ (అపశకున హస్తం- అన్‌లక్కీ హ్యాండ్) అనే తరహాలో చిత్రీకరించాయి…
నిజానికి సముద్రంలో తిరిగే టూరిజం ఓడలకు ప్రమాదాలు ఎక్కువ… వాతావరణ మార్పులు అకస్మాత్తుగా ప్రమాదాన్ని తీసుకొస్తాయి… కానీ గంగావిలాస్ క్రూయిజ్ ప్యూర్ ఇన్‌లాండ్ వాటర్ టూరిజం… అంటే నదీప్రవాహాల్లో తిరిగేది… చిక్కుపడిపోవడం అనే పదమే కరెక్టు కాదు… తీరానికి చేరేందుకు సరిపడా నీళ్లు లేనందున దూరంగా ఆపేసి, టగ్ బోట్లను ఉపయోగించారు… 51 రోజుల జర్నీలో ఎలాగూ అక్కడక్కడా ఎదురవుతుంది ఈ చిక్కు… అందుకని దానికి సదరు క్రూయిజ్ సిబ్బంది రెడీగానే ఉంటారు…
Ads
పైగా ఇదేమీ కేంద్ర ప్రభుత్వ టూరిజం ప్యాకేజీ ఏమీ కాదు… దీన్ని నిర్వహించేది అంతారా క్రూయిజ్… ఫౌండర్, సీఈవో రాజ్‌సింగ్ ‘క్రూయిజ్ చిక్కుపడిపోయిందనే వార్తల్ని చదివి నవ్వుకున్నాడు… నిజానికి దీనిపై ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏమిటంటే… ఇది మొదటి క్రూయిజ్… ఇది సక్సెసయితే మరికొన్ని ప్రవేశపెట్టాలనీ, రవాణా అవకాశాలను కూడా చేపట్టాలనీ భావిస్తోంది… ఇన్‌లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) అందుకే ఈ జర్నీని కీన్‌గా పరిశీలిస్తోంది…
గంగలో నీళ్లు లేక క్రూయిజ్ ఆపగానే, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది… అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించినట్టే… జస్ట్, టూరిజం జర్నీలో ఓ సాధారణ అంతరాయం… దీనికి ఏదో క్రూయిజులు మునిగిపోయినంత హడావుడి ప్రదర్శించాయి మీడియా సంస్థలు… ఎందుకంటే… ఈ జర్నీని ప్రధాని స్టార్ట్ చేశాడు కదా..! నిజంగా ప్రధానిని ఆడిపోసుకోవాల్సిన ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాల్లో మాత్రం ప్రధానిని నిందించడం చేతకాదు..!!
Share this Article