తగ్గిందా..? నిన్నటి జోష్ చల్లబడిందా..? నేలమీదకు దిగిపోయింది కదా హైప్..! హిట్టో, సూపర్ హిట్టో, బంపర్ హిట్టో క్లారిటీ వచ్చింది కదా..! ఇక కాస్త వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం… ఈ సినిమాలో హీరోయిన్ నిత్యామేనన్… సంయుక్త మేనన్ అనే మరో మలయాళ నటి కూడా ఉంది, ఎవరబ్బా ఈమె అని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది గానీ, ప్రధాన పాత్ర మాత్రం నిత్యదే…
ఈ సినిమా మలయాళ మాతృక అయ్యప్పనుం కోషియంలోని ఈ పాత్రతో పోలిస్తే బీమ్లానాయక్‌లో కాస్త స్క్రీన్ స్పేస్ పెంచారు… కథలో ప్రాధాన్యతను పెంచారు… కానీ అకస్మాత్తుగా సినిమా టీంతో నిత్యకు ఏం విభేదాలొచ్చాయో ఏమో మరి… ఆ పాత్ర పట్ల శ్రద్ధ తగ్గిపోయింది… ఒక్కసారి ఆ మేకప్ సంగతే చూడండి… ఆ హెయిర్ స్టయిల్ చూడండి… అందుకే ఓ రివ్యూయర్ భలే రాశాడు… ‘‘నిత్యామేనన్ హెయిర్ స్టైల్ చూస్తే… అడవిలో కూడా బ్యూటీ పార్లర్లు పెట్టేసారు అనిపిస్తుంది…’’
నిజమే కదా… ఒరిజినల్‌లో ఓ సీన్ చూస్తారా..? ఆ పాత్ర ఎలా కనిపిస్తుందో చూస్తారా..? ఇదుగో…
Ads
… ఇదీ పాత్ర స్వభావానికి తగిన మేకప్… బీమ్లానాయక్ ఇద్దరు డైరెక్టర్లకు ఈమాత్రం సోయి లేకుండా పోయిందా..? జైభీమ్ సినిమాలో హీరోయిన్ మేకప్ ఓసారి గుర్తుతెచ్చుకొండి… పర్‌ఫెక్ట్ మేకప్… పాత్రలకు తగినట్టుగా ఆహార్యం ఉండాలి, లుక్కు ఉండాలి… బీమ్లా నాయక్‌లో ఇదే సీన్ ఇలా ఉంటుంది చూడండి…
ఆ ప్రధాన పాత్ర స్వభావానికీ, ఈ మోడరన్ లేడీ లుక్కుకూ అసలేమైనా లింక్ ఉందా..? సరే, దీన్నలా వదిలేద్దాం… సినిమా సంగీత దర్శకుడు థమన్… కాస్త మెలొడీగా ‘‘అంత ఇష్టం ఏందయ్యా నీకు’’ అనే పాట కంపోజ్ చేశాడు… ఏ మంచి మూడ్‌లో ఉన్నాడో… ఏ పాత సినిమా నుంచి ఇన్‌స్పయిర్ అయ్యాడో… రామజోగయ్య శాస్త్రి కలం కదా, నా ఇంటి పెనిమిటి వంటి చిత్రమైన వింత పదాల్ని, వ్యక్తీకరణల్ని కుమ్మేసి వదిలాడు… కానీ చిత్రమ్మ చాలా బాగా పాడింది…
ఇదే పాట సినిమాలో ఉంటే కాస్త రిలీఫ్ ఉండేది… ఆ ఇగోయిస్టు పాత్రల డిష్యూం డిష్యూం మోతకోలు యాక్షన్ సీన్ల నడుమ ప్రేక్షకుడికి కొంత ఉపశమనం దక్కేది… కానీ తీసిపారేశారు… ఔనా..? నిత్యమేనన్ మీద కోపమేనా..? ఇదే అడిగితే… అబ్బే, సినిమా లెంత్ ఎక్కువైపోయింది, అందుకే కట్ చేశాం అంటున్నారట… సెకండాఫ్‌లోని భీకర పోరాట దృశ్యాల్లో ఓ బిట్ కట్ చేసినా, ఈ పాట ఇరికించినా బాగుండేది కదా… సో, లెంత్ ఎక్కువ అనేది అసలు రీజన్ కాదన్నమాట…
ఫస్టాఫ్ రానా హైలైట్ అయ్యాడు, సెకండాఫ్‌లో దాన్ని భర్తీ చేయడానికి పవన్ పాత్రను కృత్రిమంగా లేపడం స్టార్ట్ చేశారు… ఆ దెబ్బకు ఈ నిత్యామేనన్ పాత్ర కూడా ఎటో పారిపోయింది… అర్థంతరంగా ఆమె పాత్ర ఏమైనట్టు..? ఏమో ఆ త్రివిక్రముడే చెప్పాలి… ఎలాగూ టైటిల్ పేరు వేయించుకున్న దర్శకుడు చెప్పలేడు… ఇదీ వదిలేస్తే… ఆమె ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు కూడా రాలేదు… ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటే ఆమెకూ, సినిమా టీంకూ నడుమ గ్యాప్ వల్లే ఆ పాత్రను తొక్కిపారేశారనే డౌట్లకు బలం రావడం సహజం…
బరువు కారణంగా చాన్నాళ్లు అవకాశాల్లేకుండా ఉండిపోయిన ఆమె ఈమధ్యే మళ్లీ జనంలోకి వస్తోంది… స్కైలాబ్ సినిమాను నిర్మించింది, హీరోయిన్‌గా చేసింది… ఏదో టీవీ మ్యూజిక్ ప్రోగ్రాంకు జడ్జిగా చేస్తోంది… ఈ బీమ్లానాయక్ చేసింది… మెరిట్ ఉన్న నటి కదా, కాస్త బిజీ అయితే మంచిదేగా… కానీ బీమ్లానాయక్ కత్తెరలతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టుంది… హేమిటమ్మా ఇది…!!
Share this Article