మొన్న ఒకాయన రాశాడు… నిజమే… నాగార్జున కుటుంబం ఓ శాపగ్రస్తం అని… తను రామానాయుడి కూతురిని పెళ్లిచేసుకున్నాడు… ఫెయిల్… ఆమె తరువాత వేరే పెళ్లి చేసుకుంది, నాగ్ కూడా అమలను పెళ్లిచేసుకున్నాడు… కొడుకు చైతూ పెళ్లి ఫెయిల్… చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం ఫెయిల్… సుమంత్ పెళ్లి ఫెయిల్… సుప్రియ పెళ్లి ఫెయిల్… ఇవన్నీ నిజమే… కానీ ఆ కలర్‌ఫుల్ ఇండస్ట్రీలో అన్నీ ఇవే కథలు కదా… ఒక్క నాగ్ ఫ్యామిలీనే ఎందుకు వేలెత్తి చూపడం..!!
ఇవే చదువుతుంటే, మరో పోస్టు… నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు వీ.కె.నరేశ్ మాజీ భార్య రమ్యపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారట. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైందట… వీకే నరేశ్ అంటే సీనియర్ నరేష్ అని వ్యవహరిస్తుంటారు… విజయనిర్మల మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకు… తరువాత సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఉంది… అంతెందుకు నరేష్ పెళ్లిళ్లు కూడా అంతే కదా… మొదట్లో విజయనిర్మల ఓ సంబంధాన్ని చూసి పెళ్లి చేసింది… ఒక కెమెరామన్/ కొరియోగ్రాఫర్ కుమార్తె… తన ద్వారా నవీన్ అనే కొడుకు కూడా కలిగాడు… తరువాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియ…
Ads
తరువాత ఆ పెళ్లి కూడా పెటాకులైంది… ఆ తరువాత మాజీ మంత్రి రఘువీరా సోదరుడి కుమార్తె రమ్యతో పెళ్లయింది… కొన్నేళ్ల క్రితం అదీ పెటాకులైందట… అధికారికంగా ఇప్పటికీ వికీ ప్రకారం వాళ్లు భార్యాభర్తలే… కానీ విడాకులయ్యాయని మెయింటెనెన్స్ కూడా నరేష్ చెల్లిస్తున్నాడనీ వార్తలున్నయ్… సారు గారి వయస్సు ఇప్పుడు 62… సారు తాజాగా నటి పవిత్రాలోకేష్తో కలిసి ఉంటున్నట్టు ఫిలిమ్ నగర్ టాక్… ష్, ఆమెకు కూడా అంతకుముందే పెళ్లయింది… ఇప్పుడు వయస్సు 43… సుచేంద్రప్రసాద్ అనే నటుడు… ఆయనకు కూడా ఈమె రెండో పెళ్లాం… అధికారికంగా ప్రస్తుతానికి వాళ్లిద్దరూ భార్యాభర్తలే… ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు…
ఇప్పుడు నరేష్… కృష్ణ ఫ్యామిలీ టుగెదర్స్కు పవిత్రను తీసుకెళ్తున్నాడు… ఏడాది క్రితం నుంచీ ఆ వార్తలు వింటున్నాం… సో, ఎక్కడ టచ్ చేసినా సరే… ఈ విడాకులు, వివాహేతర బంధాలు చాలా కామన్ అయిపోయాయి కదా… విషయం ఏమిటంటే..? రమ్య రఘుపతితో ప్రస్తుతం నరేష్‌కు ఏ సంబంధమూ లేదు కదా… విజయనిర్మల సంపాదించిన ఆస్తులన్నీ కలిపి కొన్ని వేల కోట్ల విలువ చేస్తాయట… నరేష్ పేరు చెప్పి సదరు రమ్య చాలామంది దగ్గర డబ్బు తీసుకుందని, రిజిస్ట్రేషన్ల పేరిట వసూళ్లకు దిగిందని ఓ ఆరోపణ…
ఓ కేంద్ర పభుత్వ ఉద్యోగి దగ్గర రూ.45 లక్షలు ఆమె తీసుకుందట… ఇప్పుడామె సమాధానం చెప్పడం లేదట, ఆమె ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో బాధితులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారుట… దాదాపు ఆమె ఏడెనిమిది కోట్లు బయట వసూలు చేసిందని సమాచారం… దీనితో బాధితులు వారం రోజులుగా సూపర్‌స్టార్ కృష్ణ ఇంటి బాట పట్టారనీ, దీనిపై కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడనీ సమాచారం… రమ్యతో తన బంధం ఇప్పుడు ఏమిటో నరేష్ మాత్రమే బహిరంగం చేయాలి… సరే, పోలీసులకు ఎలాగూ కేసు నమోదు చేసుకోవడం, దర్యాప్తు చేయడం తప్పవు కదా… సో, ఇప్పుడు చెప్పండి… నాగార్జున కుటుంబాన్నే ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు కదా…!!
Share this Article