ముందుగా మీకు కృష్ణుడి పిల్లనగ్రోవి పేర్లు చెబుతాను… ఒకటి వేణువు… చిన్నగా ఉండి, ఆరు రంధ్రాలుంటయ్… రెండు మురళి… ఇది కాస్త పెద్దది, నాలుగు రంధ్రాలుంటయ్… మూడు వంశీ… దాదాపు పదిహేను అంగుళాలు ఉండే దీనిపై తొమ్మిది రంధ్రాలుంటయ్…
తన ప్రధాన రాగాల్లో 1) బ్రహ్మ, శివుడు కూడా తమ రోజువారీ విధులను మరిచిపోయేంత మహత్తు ఉంటుంది… 2) ఇది యమునానది ప్రవాహాన్ని నియంత్రిస్తుంది… 3) చంద్రుడిని స్తంభింపజేస్తుంది… 4) ఆవుల మందలను తన వద్దకు పరుగులు తీసేలా చేస్తుంది… 5) ఇది గోపికలను ఆకర్షించే అలౌకి ప్రణయగానం… 6) ఇది రాళ్లను కూడా కరిగింది, శరదృతువును సృష్టిస్తుంది… 7) అన్ని రుతువులను నియంత్రిస్తుంది… 8) ఇది రాధ కోసం ఉద్దేశించి ప్రత్యేకం… వాళ్ల బంధమెంతటి అపురూపమో తెలుసు కదా…
ఇదేకాదు, తనకు మహానంద అని మరో వేణువు ఉంది… మరొక దానికి పేరు మదనఝంకృతి… సరళమైన గానం కోొసం సరళ అనే పేరున్న వేణువును వాడేవాడు… ఎక్కువగా గౌడి, గర్జరి రాగాలు కృష్ణుడికి ఇష్టం… తయారీ వస్తువు, ఆభరణాలను బట్టి సన్మోహిని, ఆకర్షిణి, ఆనందిని, వసులి అనే వేరే వేణువులు కూడా ఉన్నయ్… మరి ఈ పిల్లనగ్రోవి ఏమైంది..? ఇదీ ప్రశ్న…
Ads
మనం ఆదిపురుష్ క్రియేటర్స్ ఎదవ్వేషాలను తిట్టేస్తున్నాం… కానీ ఈటీవీ, మల్లెమాల వాళ్లకు తాతలు… ఈరోజు దసరా స్పెషల్ అని ఓ షో చేశారు… అందులో రాధాకృష్ణుల స్కిట్ చేయించారు… ఆదర్శ్-సుహాసిని… పరమ పేలవంగా ఉంది… అసలు రాధాకృష్ణుల ప్రణయోద్వేగాలను అభినయించడం చాలా కష్టం… సరే, చేయలేకపోయారు… ఆమె ఓ పాట పాడమంటుంది… కృష్ణుడు పాడతాడు… ఈలోపు ఆమె మరణిస్తుంది… ఆ బాధతో కృష్ణుడు పిల్లనగ్రోవిని విరిచేస్తాడు… ఇక జీవితంలో వేణువు వాయించడు… ఇదీ కథ…
అసలు కృష్ణుడు బృందావనం విడిచి పెట్టి వెళ్లిపోయాక రాధ ఏమైంది..? ఇతర గోపికల్లాగే నిరాశకు గురైంది… అంతకుమించి ప్రసిద్ధ పురాణాల్లో ఇంకేమీ కనిపించదు… కానీ కృష్ణాంజనేయ, కృష్ణార్జున, భీమాంజనేయ, రామాంజనేయ తదితర యుద్ధాల్లాగే కొందరు ఓ కథను సృష్టించారు… దాని ప్రకారం… రాధా కృష్ణుడిని వెతుక్కుంటూ ద్వారకకు వెళ్తుందట, అక్కడ సేవికగా చేరుతుందట, కానీ కృష్ణుడి దర్శనమే దుర్లభమై వాపస్ వెళ్లిపోతూ ఉంటుంది… అప్పుడు కృష్ణుడు ఆమెను కలిసి, ఏదైనా కోరుకో అంటాడు, ఆమె నాకోసం వేణువు వాయించు అంటుంది… పాట నడుస్తుండగానే ఊపిరి ఆగిపోయి, తనలో ఐక్యమైపోతుంది…
ఇదుగో ఈ కథను దసరా స్పెషల్ షోలో స్కిట్ రూపంలో ప్రదర్శించారు… నచ్చలేదు… ఇలాంటివి అవాయిడ్ చేయాలి… నిజానికి కృష్ణుడు తన మానవ అవతారంలో ప్రేమించింది కేవలం వేణువునే… మిగతా బంధాలన్నీ తన లీలలు, తన ఆటలో భాగాలు… జర అనే వేటగాడు తన కాలిలోకి బాణాన్ని సంధించినప్పుడు కూడా తనతో వేణువు మాత్రమే ఉంటుంది… అలాంటిది తనే మధ్యలో దాన్ని విరిచేయడం అనే ప్రదర్శన చికాకు పెడుతుంది…
ఎవడో ఏదో రాస్తాడు, అలాంటివన్నీ టీవీలో ప్రదర్శించి, ప్రేక్షకుల బుర్రల్ని పొల్యూట్ చేయాలా..? నిజానికి ఈ దసరా స్పెషల్ షో విషయంలో ఈటీవీని కాస్త మెచ్చుకోవాలి… గెటప్ సీను దశావతారం వేషాల్ని బాగా వేశాడు… తనకు తిరుగులేదు… ఇక ఎవరెవరివో డాన్సులు అనబడే గెంతులు.., సేమ్, ఆది, ఆటో రాంప్రసాద్ అవే తిక్క పంచులు… నిజానికి వేరే ఏ టీవీ కూడా దసరా స్పెషల్ ప్లాన్ చేయలేదు… ఎవరైనా యాడ్స్ కోసం పోటీపడతారు… ఈసారి అదేమీ లేదు…
ఇలాంటి షోలను అర్జెంటుగా, అప్పటికప్పుడు ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈటీవీయే కరెక్టు… కానీ ఈమధ్య గాడి తప్పి, ప్రేక్షకుల్ని హౌలాగాళ్లను చేస్తున్నారు… రోజా ఏవేవో అనితర సాధ్యమైన త్యాగాలు చేసి, మంత్రి అయినట్టు ప్రత్యేకంగా ఓ స్కిట్… నిజానికి ఆ స్కిట్ కోసమే ఈ స్పెషల్ షో చేసినట్టున్నారు… మిగతా వాళ్లు ప్రచారం కోసం సోషల్ మీడియాకు బోలెడు ఖర్చు పెట్టాలి… రోజాకు ఆ ఖర్మేమీ లేదు…
జస్ట్, అలా ఈటీవీ స్టూడియోకు వచ్చి, మల్లెమాల డైరెక్టర్‌ను పిలిచి, ఏమోయ్, ఓ స్కిట్ కావాలోయ్ అని ఆర్డర్ వేయగలదు… అంతే త్యాగధనురాలు, జ్ఞానధనురాలు అంటూ వెంటనే ఓ స్కిట్ రెడీ… నిజంగా రోజా అంత గొప్ప నాయకురాలా..?! ఈ స్పెషల్స్‌లో ఫైమా, అనసూయ, రోహిణి, రష్మి వంటి చిన్న చిన్న కేరక్టర్ల స్కిట్లు కూడా వస్తున్నాయి… వాళ్లతో ఈక్వలా రోజా..!?
Share this Article