.
అపారమైన సైనిక శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాహసాన్ని ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్ అన్నాడు మోడీ… గుడ్, తప్పదు… కనీస ప్రొటోకాల్ అది…
నీళ్లూ నెత్తురూ పక్కపక్కనే పారవు అన్నాడు… గుడ్, సింధు జలాల ఒప్పందం రద్దుకు కట్టుబడే ఉన్నట్టు సంకేతం… అలాగే స్థిరంగా నిలబడు పాలకా…
Ads
టెర్రర్, ట్రేడ్ కలిసి నడవలేవు అన్నాడు… గుడ్… ఆ ధూర్త దేశంతో వ్యాపారం ఏమిటి…? ఆ బిచ్చపు దేశంతో వాణిజ్యం ఏమిటి..? దీనిపైనా స్థిరంగా ఉండు మహాశయా…
పదే పదే అణ్వస్త్రాల పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తే ఇక ఊరుకోం అన్నాడు… గుడ్… ఆల్రెడీ వాడి అణుభరోసాకు ఏవో తూట్లు పొడిచినట్టున్నారు… దాన్నే పరోక్షంగా చెబుతున్నాడు… కానీ అసలు జరిగింది ఏమిటో జాతికి వివరిస్తే బాగుండు, పైగా ఇకపై ఏమాత్రం నమ్మలేని ఆ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకు మోడీ భాయ్…
ఎప్పటిలాగే తను మీడియా మీట్ పెట్టలేదు… జస్ట్, జాతికి ఓ వీడియో సందేశం… అవసరమే… వాడిని చీల్చిచెండాడే పైచేయి సాధించాక కూడా ఎందుకు అర్థంతరంగా కాడి కింద పడేశావ్ అని ఎవరూ అడిగే చాన్స్ ఇవ్వలేదు తను… తను దేశానికి చెప్పాల్సిన బాధ్యత ఉందనీ అనుకోలేదు… సరే, దాన్నలా వదిలేస్తే…
మీరు నేను చెప్పింది వినకపోతే మీతో ట్రేడ్ బంద్ పెడతాను అని ట్రంపుడు బెదిరించగానే రెండు దేశాలూ విన్నాయా..? నెవ్వర్… ఏదో మిస్టరీ ఉంది… కనీసం హింట్స్ కూడా ఇవ్వలేదు మోడీ… ఐనా అమెరికాకు మనం కావాలి… వాడు మనల్ని బెదిరించడం ఏమిటి…?
మీతో చర్చలు అంటే, అది ఉగ్రవాదం మీద, పీవోకే మీద మాత్రమే అన్నాడు మోడీ… ఎస్, వాడితో వేరే చర్చలు ఏముంటాయి..? కానీ పీవోకే స్వాధీనం చేసుకునే స్థితి వచ్చాక ఎందుకు వదిలేశాం… అసలు అదే కదా అసలు సమస్య మనకు…
ఉగ్రవాదులను మాత్రమే కాదు, ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలనూ విడిగా చూడబోం… ఉగ్రవాద మూలాల్ని ఇకపై సహించేది లేదు… గుడ్, కానీ దీనికి ఓ సుస్థిర, దృఢమైన మిలిటరీ విధానం అవసరం… చెత్తా కూతలకు దిగే పార్టీలకు, నాయకులకు, మీడియాకు నియంత్రణ కూడా అవసరం…
పాకిస్థాన్ మన గురుద్వారాలు, మన మందిరాలు, మన జనావాసాల మీద డ్రోన్లు, మిసైళ్ల దాడులు చేసింది… కానీ మన ప్రతిదాడితో వణికిపోయింది… కాళ్లబేరానికి వచ్చింది… గుడ్, కానీ ఇప్పుడు దొరికిన గ్యాపులో ఇక నార్త్ కొరియా, టర్కీ, చైనాల తుప్పాస్ యుద్ధ పరికరాల నాణ్యత తెలిసొచ్చింది కాబట్టి… వాడు ఇంకాస్త బలపడే ప్రయత్నం చేస్తాడు… ఏం చేద్దాం..?
కాల్పుల విరమణకు ప్రపంచాన్ని వేడుకుంది అన్నాడు మోడీ… గుడ్, కానీ ట్రంపుడు అలా చెబుతాడేమిటి మరి..? ఎస్, వాడి దగ్గర రూపాయి లేదు, బొచ్చె పట్టుకుని విశ్వవీథుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు… అనేక ఎయిర్ బేసులు, రాడార్లు, వార్ ఫైటర్ జెట్లు ధ్వంసం… ఆ అప్పర్ హ్యాండ్ ఒక్కసారిగా మనమే చేజార్చుకున్నాం అని కదా దేశం భావన, అసంతృప్తి… దానికి ఆన్సర్ లేదు…
పీవోకే, ఉగ్రవాదం మీదే చర్చలు అంటున్నాడు గుడ్… పాకిస్థాన్‌లో తిష్టవేసిన నొటోరియస్ ఉగ్రవాదుల అప్పగింత మీద కూడా చర్చలు అవసరం కదా మాస్టారూ… ఇకపై ఉగ్రదాడి గనుక జరిగితే మొహం పగిలిపోతుంది జాగ్రత్త, అదీ మాదైన శైలిలో అంటున్నాడు మోడీ… గుడ్,.. ఈ హెచ్చరిక అవసరమే… ఉగ్రవాదాన్ని ఇలాగే పోషిస్తే పాకిస్థాన్ అంతమైపోతుంది అన్నాడు… గుడ్… కానీ వాడు మారడు భాయ్…
ఆర్మీ మీడియాప్రతినిధులు చెప్పడం కాదు… పాకిస్థాన్ వైపు ఏమేం నష్టాలు జరిగాయో కూడా కొన్ని అధికారిక వివరాలు మోడీ నోటి వెంట వచ్చి ఉండాల్సింది… చివరగా… ట్రంపు చెబితే మనం ఎందుకు వినాలి మోడీజీ…!? మనం ఉన్న స్థితిలో వాడు మనల్ని శాసించలేడు, మన సహకారమే వాడికి కావాలి… కాదంటావా..?!
.
మోడీ స్పీచ్ ఐపోగానే కాశ్మీర్ లో వాడి డ్రోన్స్ కనిపించాయని వార్తలు… ఈ స్పీచులు సరే ఇంకాస్త గట్టి దెబ్బలు పడి ఉండాల్సింది… వదిలేశావ్…
Share this Article