.
ఓ మిత్రుడికి ధర్మసందేహం వచ్చింది… మన ఘొప్ప ప్రవచనకారులు ఇలాంటి సందేహ నివృత్తుల గురించి ఆలోచించరు, ఏమీ చెప్పరు కదా…
ఇంతకీ ఆ సందేహం ఏమిటంటే…? నిజంగా ఈరోజు హనుమాన్ జయంతేనా..? కాదని చాలామంది అంటున్నారు కదా… అసలు నిజం ఏమిటి…? దేశమంతా ఇదే రోజు జరుపుకుంటున్నారు కదా అనేది వారి సందేహం…
Ads
ఎస్… మంచి ప్రశ్న… ఈరోజు జయంతి ఉత్సవాలు, ఊరేగింపులు అయిపోయాయి కదా… ఇప్పుడు చెప్పుకుందాం… ఈరోజు నిజానికి హనుమాన్ జయంతి కాదు… నిజమే, మీరు చదివింది… కాదు… మరి…
హనుమంతుడు జన్మించింది వైశాఖ బహుళ పక్ష దశమి రోజు… అదెప్పుడో మే నెలలో వస్తుంది… (మే 22… పంచాంగాల్లో, తిథుల కేలండర్లలో కనిపిస్తుంది… పండుగల జాబితాలో కూడా…) మరి ఈ రోజు ఏమిటి..?
గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ ( https://www.onlinejyotish.com ) ఏమంటాడంటే..?
హనుమంతుడు శ్రీలంకలో సీతాదేవిని కనుగొంటాడు… ఆమెను సందర్శించి వెనక్కి వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకుని రాముడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు… దూత హనుమంతుడిని ఆలింగనం చేసుకుంటాడు…
హనుమంతుడికి అత్యంత ఆనందాన్ని ఇచ్చిన విషయమిది… హనుమంతుడు జన్మించింది వైశాఖ బహుళ దశమి రోజున అయితే, ఈ రోజు (చైత్ర పౌర్ణమి) హనుమంతుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఆ సందర్భాన్ని భక్తులు హనుమత్ జయంతిగా, హనుమద్విజయోత్సవంగా జరుపుకుంటారు…
హనుమంతుడు జన్మించింది వైశాఖ బహుళ పక్ష దశమి రోజు, అందుకే పుట్టిన 10 రోజుల లోపు వచ్చిన సూర్య గ్రహణం రోజు సూర్యున్ని మింగేయటానికి హనుమంతుడు ప్రయత్నంచడం, ఇంద్రుని వజ్రాయుధం తాకి స్పృహ కోల్పోవటం మొదలైన వృత్తాంతం వచ్చింది…
మరి ఆల్రెడీ హనుమాన్ జయంతి జరుపుకున్నాం కదా అంటారా..? పర్లేదు, మే 22న మరోసారి జరుపుకొండి, మన ఇష్టదైవమే కదా… కానీ ఆరోజు ఊరేగింపులు, ఉత్సవాలు ఏమీ ఉండవు… గుళ్లో పూజలు మాత్రమే… పర్లేదు, మీ వీలును బట్టి, మీ స్థోమతను బట్టి… తమలపాకుల పూజ, వడమాల పూజ, జిల్లేడు పూమాల పూజ మొదలైనవి హనుమంతుడికి ఇష్టపూజలు…
Share this Article