Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

BBC… నీతుల గురివిందకు రాబోయేవి గడ్డురోజులే… నిర్బంధ చందాలిక చెల్లవు…

February 24, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……… బిబిసికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది ? బ్రిటన్ లో బిబిసి చానెల్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ! మిగతా బ్రిటన్ కి చెందిన ఎంటీటీలతో కలిపి ఏడా కి గాను లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఇలా ఏడాది సబ్స్క్రిప్షన్ ద్వారా ఏటా ఆదాయం వస్తుంది. ఇది కాక బిబిసి స్టూడియోస్ మరియు బిబిసి స్టూడియో వర్క్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది.

ది గార్డియన్ పత్రిక ఇచ్చిన సమాచారం మేరకు…. సంవత్సరానికి 3.2 బిలియన్ పౌండ్ల ఆదాయం వస్తుంది బిబిసికి. అయితే బిబిసి రూపొందించే ప్రోగ్రామ్స్ కోసం అయ్యే ఖర్చు పెరిగిపోతూ వస్తున్నది పెరుగుతున్న ద్రవ్యోల్బణం వలన… మరో వైపు Netflix వలన తీవ్ర పోటీ ఎదుర్కుంటున్నది బిబిసి. దీనివలన తన ప్రోగ్రామ్స్ మీద పెడుతున్న ఖర్చులని తగ్గించుకొని బాలన్స్ షీట్ ని అదుపులో ఉంచడానికి గాను ప్రోగ్రామ్స్ ఖర్చుల మీద కోత విధిస్తూ వస్తున్నది బిబిసి. ఈ ఖర్చుల కోత విలువ మిలియన్స్ లో ఉంటున్నది అని సమాచారం.

2022 లో బ్రిటన్ ప్రభుత్వం సంవత్సర చందా మీద నిషేధం విధించింది రెండేళ్ల పాటు అంటే 2022 నుండి 2024 వరకు బిబిసికి ఎలాంటి ఆదాయం ఉండదు సంవత్సరానికి కట్టే లైసెన్స్ ఫీజు రూపంలో… ఎలాంటి చందా కట్టకుండానే free to Air ప్రసారాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2027 కల్లా మొత్తానికే ఆ నిర్బంధ సంవత్సర చందాని రద్దు చేయబోతున్నది బ్రిటన్ ప్రభుత్వం. అంటే బీబీసీకి ఇంకా 4 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది నిర్బంధపు చందా వసూలు చేసుకునే అధికారం…

Ads

2022 నుండి 2024 వరకు చందా రద్దు చేయబడింది కాబట్టి 2024 వరకు బిబిసికి చందాల రూపంలో ఆదాయం రాదు… 2024 నుండి 2027 వరకు అంటే 4 ఏళ్లు మళ్ళీ చందా వసూలు చేసుకోవచ్చు… ఆ తరువాత చందా ద్వారా వచ్చే ఆదాయం ఉండదు అన్నమాట! దీని వల్లనే బిబిసి తరుచూ అటు బ్రిటన్ లోనూ విదేశాలలోనూ తప్పుడు ఆదాయ వ్యయ వివరాలు ఇవ్వడానికి అలవాటు పడ్డది! తమ ఉద్యోగుల ఇన్స్యూరన్స్ ప్రీమియం ఎగ్గొట్టిన చరిత్ర ఉంది బిబిసికి. మరి అలాంటప్పుడు మన దేశ పన్ను శాఖ సర్వే చేస్తే నొప్పి దేనికి ?

*******************

అనైతిక ప్రవర్తన కలిగిన బిబిసి?

ఈ మాట నా స్వంతం కాదు. చాలా కాలంగా బ్రిటన్ లో బిబిసి మీద ఉన్న అభిప్రాయం ఏమిటంటే బిబిసిలో పని చేసే సిబ్బంది ‘లెఫ్ట్ లిబరల్ ‘ అని… ఇది మరీ ముఖ్యంగా బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ ధాచర్ హయాం నుండి వినపడుతున్న విమర్శ బిబిసి మీద… ఏకంగా మార్గరెట్ ధాచర్ పార్టీ సభ్యులే నేరుగా బిబిసి మీద విమర్శలు చేశారు బిబిసి మార్గరెట్ కి కొమ్ము కాస్తున్నది అంటూ !

మరో సంఘటన గురించి చెప్పుకోవాలి… అది : బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లో ఉండాలా వద్దా అనే అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు [రిఫరెండం] దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది బిబిసి. చివరికి ప్రజాభిప్రాయం బ్రెగ్జిట్ కి అనుకూలంగా వెలువడి బిబిసి తప్పుని ఎత్తి చూపింది.

2020 లో టిమ్ డేవీని [Tim Davie] బిబిసికి డైరెక్టర్ జెనెరల్ గా నియమించినప్పుడు బిబిసిలో ఉన్న లెఫ్ట్ లిబరల్ లేదా మూర్ఖంగా వ్యవహరించే సిబ్బందిని తొలగిస్తాను అని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే బిబిసిలో పనిచేసే ఉద్యోగులని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు పక్షపాతంగా లేకుండా వ్యవహరించాల్సి ఉంటుందన్నాడు… తనే మరో ఘాటు వ్యాఖ్య చేశాడు బిబిసిలో కాలమిస్టులని ఉద్దేశించి : మీరు బిబిసిలో మీ మూర్ఖపు [opinionated or a partisan campaigner అనే రెండు పదాలని వాడాడు ] ఆలోచనా సరళితో రాస్తూ ఉంటే ఇక చాలు, మీరు బిబిసికి పనిచేయాలి అనుకుంటే ఆ పని మీరు బిబిసిలో చేయకండి, బయటికి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోండి ! అఫ్కోర్స్ ఇంత ఘాటుగా హెచ్చరించినా వాళ్ళలో మార్పు ఏమీ రాలేదు.

*********************************

మరో చండాలం ఏమిటో చూడండి !

2022 లో రిచర్డ్ షార్ప్ [Richard Sharp] బిబిసి ఛైర్మన్ గా నియమించబడ్డప్పుడు కూడా బిబిసి సిబ్బంది ‘లెఫ్ట్ బయాస్’ అని స్పష్టంగా పేర్కొన్నాడు. అఫ్కోర్స్ రిచర్డ్ షార్ప్ బిబిసి ఛైర్మన్ గా నియమించకముందు ఋషి శునాక్ కి సలహాదారుగా పనిచేశాడు. బ్రిటన్ లోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యులే కాదు, లేబర్ పార్టీ సభ్యులు కూడా బిబిసిని విమర్శిస్తారు. 2019 బ్రిటన్ జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా అప్పటి లేబర్ పార్టీ చీఫ్ జెరెమి కోర్బిన్ [Jeremy Corbyn] మద్దతుదారులు బహిరంగంగానే బిబిసి వ్యవహార శైలిని విమర్శించారు : బిబిసి నిస్సిగ్గుగా బోరిస్ జాన్సన్ కోసం పనిచేస్తున్నది అని.

**********************

సొ కాల్డ్ పత్రికా స్వేచ్చ- వాక్ స్వాతంత్ర్యం గురుంచి మనకి నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్న బ్రిటన్ తో పాటు యూరోపు సమాజం మరియు అమెరికా చేస్తున్నది మరియు చేసింది ఏమిటి ? ప్రజాస్వామ్యం, పత్రిక స్వేచ్చ, వాక్ స్వాతంత్ర్యం లాంటి పడికట్టు పదాలని తమకి అనుకూలంగా వాడుకుంటాయి అవి…

1. G7 దేశాలు RT [Russia Today ] ని ఎందుకు నిషేధించాయి తమ తమ దేశాలలో ? పశ్చిమ దేశాల ప్రయోజనాలకి అనుగుణంగా RT కధనాలు లేవు అనే కారణం చేతనే కదా ? మరి ఎక్కడికి పోయింది పత్రికా స్వేచ్చ ? ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ?

2. 24/2/22 నుండి ఇప్పటివరకు 8 వేల ట్విట్టర్ అక్కౌంట్ల ని బ్లాక్ చేసింది ఎందుకు ? అవి రష్యాకి అనుకూలంగా ఉన్నాయనే కదా ? మరి ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఏమయింది ?

3. జర్మనీ ఎందుకు 17 మంది జర్నలిస్టులని తొలగించింది ? వీళ్ళు అందరూ జర్మనీలోని ప్రముఖ పత్రికలకి పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్టులే ! ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎక్కడికిపోయింది ? రష్యాకి అనుకూలంగా వార్తలని వ్రాస్తున్నారు అనే నెపంతోనే కదా వీళ్ళని తొలగించింది ?

4. పులిట్జర్ అవార్డ్ గ్రహీత మరియు ఒకప్పుడు మీచేత ప్రజాస్వామ్య హీరోగా కీర్తించబడ్డ జర్నలిస్ట్ సేమోఉర్ హెర్ష్ [Seymour Hersh] అనే జర్నలిస్ట్ ఏమయ్యాడు ? పత్రికా స్వాతంత్ర్యానికి ప్రతీక, హీరో అని మీచే కీర్తించబడ్డ హేర్ష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ? రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నిజాలు వ్రాసినందుకు కనుమరగు అయ్యాడు కదా ? బాల్టిక్ సముద్రంలో రష్యా నుండి జర్మనీకి నాచురల్ గ్యాస్ సరఫరా చేసే నోర్డ్ స్ట్రీమ్ [Nord Stream ] పైపు లైన్ పేల్చింది అమెరికాయేననీ, కానీ దీనిని అమెరికా రష్యా మీదకి నెట్టింది అని నిజాలు బయటపెట్టినదుకు హేర్ష్ ని బహిష్కరించింది నిజం కాదా ?

5. నిజాలు బయటపెట్టినందుకు జూలియస్ అసాన్జె ని ఎందుకు ఇన్నాళ్ళూ జైల్లోనే ఉంచారు ?

ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది అవుతుంది కానీ సమాధానాలు దొరకవు. అసలు భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఏళ్ల తరబడి విచారించి భారత ప్రధాని మోడీ మీద మోపిన అభియోగాలకి ఎలాంటి ఆధారాలు లేవని, ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ అదే హాఫ్ బేక్డ్ ప్రచారాలని ప్రసారం చేసినందుకు బిబిసిని రెండేళ్ల పాటు దేశం నుండి బహిష్కరించాలి !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions