.
ప్రధానమైన రంగాల్లో ఒకటి విద్య… అందులోనూ ప్రాథమిక విద్య… దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అర్థవంతమైన చర్చకు తెరలేపాడు… నిజంగానే దీనిపై సీరియస్ చర్చ, అధ్యయనం అవసరమే… ప్రభుత్వం గనుక సీరియస్‌గానే అడుగులు వేస్తే రాష్ట్ర ప్రాథమిక విద్య రూపురేఖలు మారతాయి…
ప్రత్యేకించి తన కన్సర్న్ ఏమిటంటే..? టెన్త్ వరకూ వచ్చే విద్యార్థి ఇంటర్‌కు వచ్చేసరికి డ్రాపవుట్ కావడమో, సరిగ్గా చదవలేకపోవడమో… నిజమే… సరైన అధ్యయనం ఏ కోణంలో జరగాలంటే..?
Ads
బతుకు వెతల కారణంగా టెన్త్ అయిపోగానే ఏవో పనుల్లో చేరిపోవడం… కుటుంబానికి చేదోడుగా ఉండటం… ఐటీఐ, వొకేషనల్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో చేరేవాళ్లు… వాళ్లు డ్రాపవుట్స్ కిందకు రారు… మన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన ప్రమాణాలు, ప్రత్యేకించి మీడియం…
ప్రైవేటు కాలేజీలైతే ఇంటర్ తరువాత వివిధ ఎంట్రన్సులను దృష్టిలో పెట్టుకుని బోధిస్తాయి… ప్రత్యేకించి ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, ఎంసెట్ ఎట్సెట్రా… ఇంటర్ మార్కులకన్నా ఈ ఎంట్రన్సులకు ప్రిపేర్ చేయడమే ప్రధానం…
అసలు ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, యూపీల్లో మాత్రమే ఇంటర్ మీడియెట్ కోర్స్… చాలా రాష్ట్రాల్లో టెన్ ప్లస్ టు… అదే స్కూలింగ్ అంటే… పీయూసీ అన్నా, ప్రిడిగ్రీ కోర్స్ అన్నా, సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్నా… అన్నీ ప్లస్ టు వరకే… సో, ప్రత్యేకించి ఇంటర్మీడియెట్ కోర్స్ ఉండటం వల్ల వచ్చే ఫాయిదాపై అధ్యయనం జరగాలి…
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్ల ఐబీ తదితర సిలబసులన్నీ టెన్ ప్లస్ టూ విధానమే… సో, మన అవసరాలకు ఏ విధానం బెటరో బ్యూరోక్రాట్లు ఇతర రాష్ట్రాల్లో పరిశీలించడమే కాదు, మన విద్యావేత్తల అభిప్రాయాలనూ క్రోడీకరించాలి… ఏపీలో జగన్ పీరియడ్‌లో మీడియం, సిలబస్ విషయంలో కొంత సానుకూల మార్పు జరిగింది… (సర్కారు స్కూళ్ల రూపురేఖలు, వసతులతోసహా…)
ప్రపంచ అవసరాలకు… ఉన్నత విద్యలో నైపుణ్యం కోసం… మెరుగైన ఉపాధి అవకాశాల కోసం… ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అనే భావన సర్వత్రా వ్యాపించింది… ఐతే ఒక దశ వరకూ పిల్లలకు మాతృభాషలో బోధనే బెటరనే అభిప్రాయమూ ఉంది… సో, ఏ క్లాస్ వరకు మాతృభాషలో బోధించి, ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా బోధించాలి, ఏ క్లాస్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధించి, మాతృభాషను ఓ సబ్జెక్టుగా ఉంచాలో ఓ పర్‌ఫెక్ట్ మోడల్ అవసరం…
నర్సరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, ఇంటర్మీడియెట్… మనకు వేర్వేరు స్కూళ్లు… ప్రభుత్వ రంగంలో అంగన్‌వాడీ, ప్రైమరీ, సెకండరీ, హై స్కూల్, జూనియర్ కాలేజ్… జాతీయ విద్యావిధానం మోడల్‌పైనా దృష్టి అవసరం… అది 5 + 3 + 3 + 4…
అంటే, ఫౌండేషన్ 5 ఇయర్స్… అందులోనే నర్సరీ కూడా… (రఫ్‌గా చెప్పాలంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ క్లాసులు)… తరువాత మూడేళ్లు ప్రిప్రైమరీ లేదా ప్రిపరేటరీ స్టేజ్… 3, 4, 5 తరగతులు… మిడిల్ స్టేజ్‌లో మూడేళ్లు… అంటే 6, 7, 8 తరగతులు.,. సెకండరీ స్టేజ్ నాలుగేళ్లు… అంటే 9, 10, 11, 12… ఇవీ కీలక తరగతులు… ఏ స్టేజ్‌లో ఏం నేర్పాలో కూడా జాతీయ విద్యావిధానం సూచిస్తోంది…
రేవంత్ రెడ్డి చెబుతున్నదీ ఇదే… సెకండరీ స్టేజ్ స్కూలింగ్ గురించే… తను కోరుకుంటున్న విద్యావిధానంలో స్కూళ్లనూ, జూనియర్ కాలేజీలను కలిపేయాలా… మొత్తం టెన్ ప్లస్ వరకూ స్కూలింగ్‌గా పరిగణించాలా..? ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో..? అలా చేస్తే వచ్చే సమస్యలేమిటి..? మళ్లీ ఇది వేరే చర్చ… ఉద్యోగుల సర్వీసుల విలీనం దాకా చాలా చిక్కు ప్రశ్నలు, అమలుకు అడ్డంకులు ఉంటాయి… అందుకే సీఎం చెబుతున్నట్టు ఓ సమగ్ర అధ్యయనం ముందుగా అవసరం..!!
Share this Article