Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డొనాల్డ్ ట్రంపు ఎదుట ఉన్న అతి పెద్ద సవాలు ‘బ్రిక్స్’… పార్ట్ 1

November 17, 2024 by M S R

.

డోనాల్డ్ ట్రంప్ ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ BRICS ….. Part -1

BRICS ఆవిర్భవించినప్పటి నుండీ ఇది కూడా మరో పస లేని కూటమి అని భావించారు విశ్లేషకులు!

Ads

షరా మామూలుగా సమావేశాలు జరుగుతూ ఉండేవి!
కానీ జో బిడెన్ నేతృత్వంలో డెమోక్రాట్లు చేసిన విధ్వంసం వలన అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికా నుండీ దూరంగా జరగడం మొదలు పెట్టి చివరికి అమెరికా వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం జరిగింది!

BRICS 2024 అందుకు ఉదాహరణ!

Understanding Geopolitics !

BRICS SUMMIT 2024 ! PART -1

తప్పనిసరి పరిస్థుతులలో శల్యుడు కౌరవ పక్షంలో చేరినా శల్యుడిని ఎలా ఉపయోగించుకోవాలో శ్రీ కృష్ణుడు ధర్మారాజుకి సలహా ఇస్తాడు!

ఆధునిక ప్రపంచ రాజకీయాలలో ప్రత్యేకంగా శల్యులు అంటూ ఎవరూ లేకపోయినా శకుని పాత్రధారులకి కొదువ లేదు!

ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఎవరి ప్రణాళికలు ఏమిటో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్పో తెలిసి పోతున్నాయి.

*********
BRICS SUMMIT 2024 సమావేశాలు అక్టోబర్ 22 – 24 వరకూ రష్యాలోని కజన్ ( Kazan ) నగరంలో జరిగాయి !

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకి ఎప్పటిలా కాకుండా ఈసారి అత్యంత ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవాలి!

మొత్తం రెండు భాగాలుగా వివరించే ప్రయత్నం చేస్తాను!

********
BRICS ( Brezil , Rassia, India, China , South Africa )

2001 లో మొదటిసారిగా BRIC (BREZIL, RASSIA, INDIA CHINA) కి ఆలోచన చేసింది గోల్డుమాన్ శాచ్ ( Goldman Sachs ) లో చీఫ్ ఎకానమిస్ట్ గా పనిచేస్తున్న జిమ్ ఓ నీల్ ( Jim o’Neill ). అప్పట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు కలిసి ఒక జట్టుగా చేరితే లాభం ఉంటుంది అనే ఆలోచన చేశాడు జిమ్ ఓ నీల్.
ముందుగా స్పందించింది బ్రెజిల్.

బ్రెజిల్ ముందుగా బ్రిక్ కోసం వడి వడిగా అడుగులు వేయడంతో మిగతా దేశాలు కూడా ( రష్యా, చైనా, భారత్ ) ముందుకు రావడం జరిగింది.

మొదటి సమావేశం జరిగింది 2006 న్యూయార్క్ లో అదీ విధి విధానాలు ఎలా ఉండాలి అనే విషయం మీద చర్చించడానికి. 2006 లో ఒక ఫార్మాట్ కి రూప కల్పన జరిగింది!

మొదటి BRIC సమావేశం జరిగింది 2008 లో. రష్యా లోని యకటరిన్ బర్గ్ ( YEKATERINBURG )లో.

2010 లో సౌత్ ఆఫ్రికా BRIC లో చేరడంతో దానిని BRICS గా మార్చారు.

వ్యవస్థాపక సభ్య దేశాలు అయిన రష్యా, చైనా, బ్రెజిల్, భారత్ లకి ఏ దేశానికి బ్రిక్స్ లో సభ్యత్వం ఇవ్వాలో అనే దాని మీద అధికారం ఉంటుంది. అంటే ఏదన్నా దేశం బ్రిక్స్ లో చేరడానికి ఆసక్తి చూపి అప్లికేషన్ పెట్టుకుంటే వ్యవస్థాపక దేశాలలో ఏ ఒక్క దేశం అయినా తిరస్కరిస్తే బ్రిక్స్ లో చేర్చుకోకూడదు! ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న అయిదు దేశాలకి ఉండే వీటో హక్కు లాంటిది అన్నమాట!

**********
NDB – NEW DEVELOPMENT BANK!

బ్రిక్స్ దేశాల కోసం అంటూ ఒక బ్యాంక్ ఉండాలి అని జులై, 2014 న సభ్య దేశాలు బాంక్ ఏర్పాటు కోసం విధి విధానాలు చర్చించి ఒప్పందం చేసుకున్నాయి.

జులై 2015 లో ఒప్పందానికి రూపం ఇస్తూ NDB లేదా NDB BRICS బాంక్ ని నెలకొల్పయి!

NDB హెడ్ క్వార్టర్స్ చైనా లోని షాన్ఘయ్ నగరంలో నెలకొల్పారు! రీజనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా లోని జోహాన్స్ బర్గ్, సావో పోలో బ్రెజిల్, గిఫ్ట్ సిటీ, భారత్ మరియు రష్యాలలో ఏర్పాటు చేశారు.

100 బిలియన్ డాలర్ల మూల ధనంతో ప్రారంభం అయిన NDB వ్యవస్థాపక దేశాలతో పాటు అల్జీరియా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరుగ్వే, ఈజిప్ట్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

NDB అనేది సభ్యదేశాలకి ఋణాలు ఇవ్వడం, సభ్యదేశాలు కనుక అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుండి రుణాలు పొందాలి అనుకుంటే కావాల్సిన టెక్నీకల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఇది సభ్యదేశాల ఆర్ధిక స్థితి ఏమిటో బహుళజాతి ఆడిటింగ్ సంస్థల చేతిలోకి వెళ్లకుండా ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్య.

********
ఇక అక్టోబర్ 22, 23, 24 అంటే మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలు అమెరికాతో పాటు యూరోపుకి కూడ గట్టి సందేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు!

అయితే ఈసారి BRICS+ అని పిలవడం మొదలుపెట్టారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు BRICS లో సభ్యత్వం కోసం అప్లై చేయగా రష్యా ఈ సంవత్సరం BRICS అధ్యక్షత వహిస్తున్న కారణంగా గత అక్టోబర్ సమావేశాలలో సభ్యత్వం ఇచ్చాడు! అఫ్కోర్స్ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు!

1. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈసారి మరో 24 దేశాలని BRICS సమావేశాలకి ఆహ్వానించాడు.

2. టర్కి, పాకిస్థాన్ దేశాలు brics లో చేరడానికి అప్లై చేయగా భారత్ తన వీటో పవర్ తో తిరస్కరించింది. భారత్ తన అభిమతం ఏమిటో కుండ బద్ధలుకొట్టినట్లు చెప్పింది. భారత్ తో శత్రు వైఖరితో వ్యవహరించే ఏ దేశాన్ని కూడా బ్రిక్స్ లోకి రాకుండా అడ్డుకుంటాము అని చెప్పింది. టర్కీ, పాకిస్తాన్ ల సంగతి తెలిసిందే కదా!

3.వెనిజులా దేశాన్ని బ్రెజిల్ వీటో చేసింది అక్కడ ఎన్నికలు సక్రమంగా జరగలేదు అనే నెపంతో. మరి చైనా, రష్యాలలో ఎన్నికలు సక్రమమేనా?

4.సౌదీ అరేబియా, UAE దేశాలు కేవలం డెమోక్రాట్ల మీద వ్యతిరేకతతో BRICS లో చేరాయి అన్నది వాస్తవం.

*******
బ్రిక్స్ సమావేశం కోసం రష్యా లోని కజాన్ నగరానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినపుడు కాజాన్ నగరం భారతీయ జెండాలతో నిండిపోయింది!

దాదాపు 30 దేశాల నుండి ప్రధానులు, అధ్యక్షులు కాజాన్ కి వచ్చినా భారత ప్రధాని కోసం రష్యా లోని భారతీయులు భారీ సంఖ్యలో వేచిచూడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది!

Contd.. Part 2   (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions