Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో గ్యాంగ్‌‌స్టర్ కాల్చివేత… అసలు ఏం జరుగుతోంది కెనడాలో…

October 2, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి …….. పంజాబ్ కి చెందిన మరో గ్యాంగ్‌స్టర్ కెనడాలో హత్యకి గురయ్యాడు! అది రెండు సిక్కు గ్రూపుల మధ్య ఉన్న వైరం వల్లనే జరిగింది! RAW ని ఇండియన్ మొస్సాద్ గా పిలుస్తున్నారు ఇప్పడు! ఎందుకంత హైప్ వచ్చింది? ఇంగ్లాండ్, పాకిస్థాన్, కెనడా ఇలా ఒక దేశానికి పరిమితం కాలేదు RAW! 2014 కి పూర్వం కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, శ్రీలంకలకే పరిమితం చేశారు పూర్వ పాలకులు. అది కూడా ఇంటిలిజెన్స్ ని ఉపయోగించి సమాచార సేకరణకు మాత్రమే పరిమితం అయిపోయింది! ప్రధానంగా భారత ఉపఖండానికి పరిమితం చేశారు.

*****************

కానీ 2014 నుండి క్రమంగా విస్తరిస్తూ ఈ రోజున చాలా బలంగా తయారయ్యింది RAW. ఈ రోజున యూరోపుతో పాటు ఎక్కడయినా ఆపరేషన్ పూర్తి చేయగల సత్తాని సంతరించుకుంది RAW! కెనడా, బ్రిటన్, అమెరికా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్రికా ఇలా ప్రపంచంలో ఏ మూలన ఉన్న దేశంలో అయినా ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తిచేయగలుగుతున్నది కాబట్టే ప్రపంచ దేశాలు RAW ని ఇండియన్ మొస్సాద్ గా పిలవడం మొదలు పెట్టాయి.

Ads

అయితే ఇదేమీ రాత్రికి రాత్రి హఠాత్తుగా జరిగింది కాదు. గడిచిన 5 ఏళ్లలో చాలా వ్యయప్రయాసలతో కష్టపడితేనే సాధ్యం అయ్యింది. అయితే గూఢచర్యం చేయడం నేరమా? దాదాపుగా అన్ని దేశాలు తమ తమ దేశాలలో వేరే దేశం గూఢచర్యం చేయడాన్ని దేశద్రోహంగా పరిగణిస్తున్నాయి. అలా అని ఏ దేశము కూడా ఊరికే ఉండట్లేదు, తమకి అవసరం అయినప్పుడు వేరే దేశాలలో గూఢచర్యం చేస్తూనే వస్తున్నాయి.

**********************

గూఢచర్యం అంటే కోల్డ్ వార్ సమయంలో జరిగిందే చాల క్లిష్టమయిన, కష్టమయినదిగా చెప్తారు. KGB (USSR) Vs CIA (USA) మధ్య జరిగిన ఆధిపత్యం తాలూకు జ్ఞాపకాలతో చాలా నవలలు, సినిమాలు వచ్చాయి. ఇప్పుడున్నంత ఆధునిక టెక్నాలజీ అప్పట్లో లేకపోయినా మినియెచర్ కెమెరాలు, రహస్య మైక్రోఫోన్లతో రికార్డింగులు, శత్రువుని మట్టుపెట్టడానికి రహస్య రసాయనాలు, అందమయిన అమ్మాయిలతో హనీ ట్రాప్ వేయడం, ఏజెంట్స్ ని నియమించడం, ఆ ఏజెంట్స్ డబుల్ ఏజెంట్స్ గా మారిపోవడం, హత్యలు… ఇలా సాగిపోయింది.

******************

క్రమేణా USSR KGB బలహీనపడ్డా రహస్య కెమికల్ ఫార్ములా విషయంలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అయితే అరబ్ దేశాలతో ఉన్న వైరం కారణంగా మొస్సాద్ క్రమంగా ముందు వరసలోకి దూసుకువచ్చి ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. మొస్సాద్ మాయం చేసిన వ్యక్తుల జాబితా చాలా పెద్దది! అసలు ఎలా మాయం అయ్యారు? ఎంత మంది మాయం అయ్యారు? ఎవరు ఆ పని చేశారు? దశాబ్దాలు గడుస్తున్నా ఎలాంటి క్లూ లేదు! మొస్సాద్ కి అమెరికా సహకారం ఉంది కాబట్టి ఆపరేషన్స్ విషయంలో సక్సెస్ రేట్ ఎక్కువ!

*********************

సోవియట్ ఆఫ్ఘనిస్థాన్ లో ప్రవేశించిన తరువాత CIA కి పాకిస్థాన్ తో అవసరం ఏర్పడి, తద్వారా ISI కి గూఢచర్యంలో మెళుకువలు నేర్పడమే కాదు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఇచ్చి, ఆఫ్ఘనిస్థాన్ లో తన ప్రయోజనాలని కాపాడుకుంది. సోవియట్ విచ్చిన్నం, కాశ్మీర్ పండిట్ల మీద హింస, వలసలు 1990 ల కాలంలో జరగడం యాదృచ్చికం కాదు. ISI కి నిధుల పరంగా, మానవ వనరుల విషయంలో 90వ దశకం అనేది అత్యంత ఉచ్ఛస్థితి అని చెప్తారు.

ఆఫ్ఘన్ నుండి సోవియట్ వెనక్కి వెళ్లడం, ఆ తరువాత సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవడంతో ISI భారత్ లో ఏం చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరించింది అమెరికా! పైగా CIA ఆ సంవత్సరం ISI కి ఇచ్చిన నిధులలో సింహభాగం మిగిలిపోవడంతో వాటిని భారత్ ని అస్థిర పరచడానికి వాడింది!

******************

ISI ఒక వెలుగు వెలిగిన కాలంలో (1976 నుంచి 1995) RAW కి నిధుల కొరత, ప్రభుత్వ తోడ్పాటు కరువయ్యింది! ఫలితంగా కార్గిల్ చొరబాటు కానుకగా లభించింది! అఫ్కోర్స్ ఇంటి దొంగల నిర్వాకం కూడా RAW ని కుంగదీసింది! హమీద్ అన్సారీ లాంటి వాళ్ళకి కొదువ లేదు మనదేశంలో!ఏదన్నా దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళని మొగ్గలోనే తుంచకపోతే అది పెరిగి పెద్దది అయిపోయి విదేశాల వరకు వేళ్లూనుకొని పెద్ద విష వృక్షంగా పాకిపోతుంది!

*********************

ఒక్క మొస్సాద్ తప్పితే వేరే ఏ గూఢచార సంస్థ కూడా తమ ప్రత్యర్థులని మట్టుపెట్టవు! కేవలం ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి వాటిని క్రోడీకరించి చర్యలు తీసుకుంటాయి!

*******************

సినిమాలలో చూపించే స్పై దృశ్యాలు డ్రమటైజ్ చేయబడతాయి. స్పై ఏజెన్సీస్ చేసే హత్యలు 4 లేదా 5 అంచెలలో ఉంటాయి. 5వ స్టేజీ లో హిట్ మాన్ ఉంటాడు. హిట్ మాన్ కి టార్గెట్ ఎవరో చెప్పి పని అప్పచెప్తారు. తనకి టార్గెట్ ఇచ్చింది ఎవరో హిట్ మాన్ కి తెలియదు. తనకి ఇచ్చిన పని పూర్తిచేయగానే హిట్ మాన్ అకౌంట్ లో క్రిప్టో కరెన్సీ రూపంలో జమ అయిపోతుంది. ఒకవేళ హిట్ మాన్ దొరికినా అతని వద్ద వివరాలు ఉండవు.

*****************

RAW మీద కెనడా ప్రధాని ట్రాడూ చేసిన ఆరోపణలు నిరాధారం! RAW ని దోషిగా వేలెత్తి చూపడం అంటే నేరుగా ప్రధానిని దోషిగా చేయడమే! అసలు నిజ్జర్ హత్య జరిగిన వెంటనే అది ex మొస్సాద్ ఏజెంట్ ద్వారా రష్యన్ హిట్ మాన్ చేసింది అనే వార్తలు వచ్చాయి. హత్య చేయగానే రష్యన్ హిట్ మాన్ కెనడా వదిలి పారిపోయాడు. కెనడా పోలీసులకి ఆధారాలు దొరకలేదు!

జో బిడెన్ చేసిన పిచ్చి పని? నిజ్జర్ హత్య చేసింది RAW అని జో బిడెన్ ట్రాడూతో అన్నాడు! నిజానికి పెంటగాన్ ఎలాంటి సమాచారం ఇచ్చిందో తెలీదు కానీ జో బిడెన్ ట్రాడూ దగ్గర నోరు జారాడు! తీరా జరిగిన డామేజీని చూసి పెంటగాన్ సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. కానీ ట్రాడూ మాత్రం తమ వద్ద నమ్మకమయిన సమాచారం ఉందని పార్లమెంట్ లో నోరు జారాడు!

చివరకి కెనడా ప్రతిపక్షం ఆధారాలు అడిగింది ట్రాడూ ని ! RAW విషయంలో నోరు జారిన ట్రాడూ కి ప్రపంచ దేశాల నుండి ఎలాంటి మద్దతు దొరకలేదు! భారత్ తో శత్రుత్వం పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు! అసలు నిజ్జర్ అనే వాడిని టెర్రరిస్ట్ గా గుర్తించింది భారత ప్రభుత్వం! అక్రమంగా కెనడాలోకి ప్రవేశించి అక్కడ పౌరసత్వం పొందిన నిజ్జర్ కెనడా పౌరుడు ఎలా అయ్యాడు? కేవలం 3% సిక్కు జనాభా ఉన్న కెనడాలో నిజ్జర్ మీద ఎందుకంత ప్రేమ?

*************************

జస్టిన్ ట్రాడూ ఇలా పిచ్చి వాగుడు వాగడం ఇదే మొదటిసారి కాదు. 1985 లో ఎయిర్ ఇండియా విమానం కనిష్కని (Air India flight 182) బాంబులతో పేల్చి వేసి 300 మందికి పైగా అమాయక ప్రయాణికుల మరణానికి కారణం అయిన హంతకులు కెనడాలో ఉన్నారు. ఇదే జస్టిన్ ట్రాడూ తండ్రి పైరె ట్రాడూ అప్పుడు కెనడా ప్రధాని. కనిష్క విమాన ప్రమాదానికి కారణం అయిన వారిని మన దేశానికి అప్పచెప్పమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పైరె ట్రాడూ తమ పౌరులని అప్పచెప్పబోమని, తామే విచారణ చేస్తామని దాటవేత ధోరణిని అవలంబించాడు తప్పితే ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు!

*******************

గురుద్వారా సొమ్ము ట్రాడూ జేబులోకి? కెనడాలోని గురుద్వారాలలో వసూలు అయ్యే విరాళాలు ట్రాడూ పార్టీకి లక్షలాది డాలర్లు పార్టీ ఫండ్ కింద జమ అవుతున్నాయి! ఈ నిజ్జర్ అనే టెర్రరిస్ట్ తో పాటు మరో టెర్రరిస్ట్ పన్నూ పరిధిలో కెనడాలో గురుద్వారాలు ఉన్నాయి. విరాళాల రూపంలో వచ్చిన డాలర్లని వీళ్లిద్దరూ ట్రాడూ అతని మంత్రివర్గ సభ్యుల జేబుల్లో పెడుతున్నారు. అందుకే సిక్కులలో కొద్ది మంది మాత్రమే ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నా ట్రాడూ వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటున్నాడు!

*********************

ఒక ప్రశ్న! G20 సమావేశ ముగింపు రోజున అంటే సెప్టెంబర్ 10 వ తేదీ రాత్రి తిరిగి కెనడా వెళ్లాల్సిన ట్రాడూ రెండు రోజుల పాటు ఢిల్లీలోని హోటల్ కే పరిమితం అవడం వెనక చాలా సందేహాలు ఉన్నాయి! VIP భద్రత కోసం వినియోగించిన స్నిఫర్ డాగ్స్ ట్రాడూ విమానం దగ్గర పదే పదే ఆగి మొరగడం వలన బాంబులు ఉన్నాయేమో అని అనుమానం వచ్చి తనిఖీ చేయగా విమానంలో భారీగా డ్రగ్స్ ఉన్నట్లు కనుక్కున్నారు!

విమానం కెనడా ప్రధానిది కావడంతో హై లెవెల్ అలర్ట్ ప్రకటించి విషయం EAM జై శంకర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది! అయితే దీని మీద వివరణ ఆడగడంతో ట్రాడూతో పాటు వచ్చిన అధికారులు కెనడాలో ఉన్న అధికారులతో సమీక్షించారు పరిస్థితిని. ఒక ప్రధానిగా ట్రాడూకి దౌత్యపరమయిన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవడానికి వీలుండదు!

కానీ భారత విదేశాంగ అధికారులు వివరణ అడిగారు. డ్రగ్స్ తో ఉన్న విమానానికి అనుమతి ఇవ్వలేదు కానీ భారత ప్రధాని వాడే Air Force 1 విమానాన్ని ఆఫర్ చేసినా ట్రాడూ తిరస్కరించాడు. తమ విమానానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడం ట్రాడూ అవమానంగా భావించాడు! కెనడా వెళ్లి పార్లమెంట్ లో మోదీకి వ్యతిరేకంగా ప్రకటన చేయడం కూడా డ్రగ్స్ మత్తులో చేశాడని ఆరోపణలు వచ్చాయి!…. ఇంకా ఉంది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions