ప్రతి మనిషీ తెలుసుకోవాల్సిన 3 విషయాలు (జగన్నాథ్ గౌడ్)
1. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ (మన నియంత్రణ వలయం): మన ప్రవర్తన, మన ఆరోగ్యం, మన సంపద, మన ఉద్యోగం, మనం ఏమి చదువుతున్నాం, మనం ఏమి చూస్తున్నం, మనం ఏమి చేస్తున్నం, మన నిద్ర, మన మైండ్ సెట్ , మన బలం, మన బలహీనత, మన లోపాలు, మన అపజయం, మన విజయం మొదలగునవి (వీటి గురించి రోజులో 23 గంటల 50 నిమిషాలు సమయం కేటాయించాలి)
2. సర్కిల్ ఆఫ్ ఇన్ ఫ్లూయన్స్ (మన ప్రభావ వలయం): మన కుటుంబీకులు, మన ఇంటి పక్క పరిస్తితులు, మన స్నేహితులు, మన ఆఫీస్ వాతావరణం మొదలగునవి (వీటి గురించి పూర్తి ఎరుక, జాగరూకత ఉండాలి)
Ads
3. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ (మన బాహ్య వలయం): వాతావరణం, సినిమా నటులు, యుద్ధం, వార్తలు, క్రికెటర్స్, రాజకీయం, వేరే వాళ్ళ ప్రవర్తన, వేరే వాళ్ళ జీవితం మొదలగునవి. రోజులో 10 నిమిషాల కంటే ఎక్కువ వీటి గురించి ఎందుకూ పనికి రాని వాళ్ళు లేదా మానసిక రోగులు మాత్రమే వారి సర్కిల్ ఆఫ్ కంట్రోల్ గురించి కంటే ఎక్కువ సమయం గడుపుతారు అని ఒక అధ్యయనం చెప్తుంది
ఏ మనిషి అయినా మొదట పట్టించుకోవాల్సింది వాళ్ళ గురించి. రోజులో ఉన్న 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు వాళ్ళ గురించే ఉండాలి. నేను ఒక సాఫ్ట్ వేర్ కూలీ. నా కూలి ఎంత, నేను ఏమి నేర్చుకొని నా జీతం పెంచుకోవాలి, ఏ టెక్నాలజీ నేర్చుకొని ప్రస్తుత యువత , మార్కెట్ తో పోటీ పడాలి, నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, నా ఆందోళననిని ఎలా నియంత్రించుకోవాలి, నా కుటుంభాన్ని ఇంకా గొప్పగా ఎలా చూసుకోవాలి, నా స్నేహితులకి నేను ఏమైనా సహాయం చేయగలనా లేదా నాకు ఎవరు సహాయం చేస్తారు, నేను ఎలా ఎదగాలి, నా బలం ఏంటి, నా బలహీనతలు ఏంటి తెలుసుకొని వీటి గురించి అంటే సర్కిల్ ఆఫ్ కంట్రోల్, మన కంట్రోల్ ఉన్న వాటి గురించి సమయం కేటాయించాలి.
అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు తీరిగ్గా వాతావరణం ఎలా ఉంది, ఏ సినిమా ఎలా ఉంది లేదా ఏ రాజకీయ నాయకుడు గెలిచాడు లేదా ఓడాడు అన్నది లేదా వేరే వాళ్ళ బలాలు/ బలహీనతలు ఆలోచన చేయాలి అదీ రోజుకి 10 నిమిషాలు కంటే మించకూడదు. ఒకవేళ వాళ్ళ ఉద్యోగమే రాజకీయం లేదా సినిమా లేదా క్రికెట్ అయితే ఆయా వ్యక్తులు వాటి గురించి 23 గంటల 50 నిమిషాలు ఆలోచించాలి కారణం అది వాళ్ళ వృత్తి లేదా వారి సర్కిల్ ఆఫ్ కంట్రోల్.
ప్రస్తుతం ఎక్కువ మంది వాళ్లకి ఎందుకూ పనికి రాని సర్కిల్ ఆఫ్ కన్సర్న్ గురించి ఎక్కువ ఆలోచించి సమయం వృథా చేసుకుంటున్నారు. నిజానికి ఇదొక మానసిక రోగం. ఎవరైనా వాళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్యం , వాళ్ళ సంపాదన, వారి చుట్టు పక్కల స్నేహితులు , కుటుంబీకుల గురించి ఆలొచిస్తూ తనని తాను ఎలా అభివృద్ధి చేసుకొని తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఎక్కువ సమయం కేటాయించాలి, ఇంకా తాను ఎలా ఉన్నత స్థితికి చేరుకొవాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
అలా కాకుండా తమ వృత్తిలో భాగం కాకపోయినా తన సర్కిల్ అవతల ఉన్న వాతావరణం, క్రికెట్, సినిమా వాళ్ళు, రాజకీయాల గురించి 10 నిమిషాల కంటే ఎక్కువ ఆలోచన చేస్తుంటే అదొక మానసిక రోగం. ఒకవేళ మీరు అభినవ మదర్ థెరిస్సా, పెరియార్, స్వామి వివేకానందలు అయితే మీ గురించి కాకుండా సంఘం గురించి ఆలోచన చేయొచ్చు, తప్పు కాదు, లేదు.
కోవిడ్ కాలం తర్వాత ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక మానసిక రోగం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెప్తున్నై. నా అవగాహన అయితే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంది. తెలుసుకొని బయట పడటం ఉత్తమం అంటారు పెద్దలు…. – రోమన్ తత్వవేత్త, (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article