.
Pardha Saradhi Potluri ………. డోనాల్డ్ ట్రంప్ డీప్ డీప్ స్టేట్ లింక్ – పార్ట్ 1
Yes..! ఒక డీప్ స్టేట్ కాదు రెండు డీప్ స్టేట్లు ఉన్నాయి!
ట్రంప్ ప్రమాణ స్వీకారం అనేది భారత్ కి అంత మంచి పరిణామం కాదు అని ముందే చెప్పాను కదా? ఎందుకు కాదో అనేది మొత్తం మూడు భాగాలుగా వివరించడానికి ప్రయత్నిస్తాను!
Ads
మొదటి డీప్ స్టేట్ బయటికి కనిపించేది….బిల్ క్లింటన్, బరాక్ ఒబామాల ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జార్జ్ సోరోస్, అమెజాన్ జెఫ్ బేజోస్, బిల్ గేట్స్, వరల్డ్ ఏకానమిక్ ఫోరమ్ ( WEC ), నాటో సభ్య దేశాలు ( టర్కీ కాకుండా ), హాలివుడ్, ప్రముఖ ఆర్ధిక సంస్థ బ్లాక్ రాక్ లాంటివి మనకు బయటికి తెలిసినవి. ఇక అమెరికన్ ఆయుధ పరిశ్రమ, ఫార్మా రంగం, వాల్ స్ట్రీట్ గురుంచి మనకి తెలుసు.
రెండో డీప్ స్టేట్!
దీనిని ఎవరు నిర్వహిస్తున్నారో ఎవరికి తెలియదు. అసలు ఈ డీప్ డీప్ స్టేట్‌లో ఎవరు ఉన్నారో ఎవరికి తెలియదు! తెలిసినా సమాచారం బయటికి రాదు.
కానీ డీప్ స్టేట్ కంటే ఇది బలమైనది. అఫ్కోర్స్! డీప్ డీప్ స్టేట్‌లో జార్జ్ సోరోస్ కూడా సభ్యుడు కానీ బయటికి కనిపించే డీప్ స్టేట్‌లోలాగా డీప్ డీప్ స్టేట్‌లో జార్జ్ సోరోస్‌కి ప్రాధాన్యత ఉండదు! డెమోక్రట్లు కావొచ్చు, రిపబ్లికన్స్ కావొచ్చు, డీప్ డీప్ స్టేట్‌ని కాదని ఏమీ చేయలేరు!
జార్జ్ సోరోస్‌ని ట్రంప్ ఏమీ చేయలేడు. కాకపొతే డెమోక్రాట్స్ ఇచ్చినంత చనువు రిపబ్లికన్స్ ఇవ్వరు! డీప్ డీప్ స్టేట్ సపోర్ట్‌తోనే ట్రంప్ గెలిచాడు కానీ షరతులు వర్తిస్తాయి!
బయటికి కనపడని డీప్ స్టేట్ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండి చురుకుగా ఉంది! టెక్నీకల్‌గా జార్జ్ సోరోస్ డోనాల్డ్ ట్రంప్‌కి నిధులు సమకూర్చాడు! డీప్ డీప్ స్టేట్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది!
కాబట్టి జార్జ్ సోరోస్ స్వేచ్ఛగా అమెరికా జెర్మనీల మధ్య తిరుగుతూ ఉంటాడు! జార్జ్ సోరోస్ ధనవంతుడు కాబట్టి అతనికి రాచ మర్యాదలు జరుగుతున్నాయి అనేది ఒట్టి మాట! జార్జ్ సోరోస్‌ని మించిన ధనవoతులు అమెరికాలో బోలెడు మంది ఉన్నారు!
ట్రంప్ జనవరి 20 న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి 30 న జార్జ్ సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్ బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లి తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్‌ని కలిసి చర్చలు జరిపాడు!
నిన్న ట్రంప్ బాంగ్లాదేశ్ విషయం మోడీ చూసుకుంటారు అని అనడంలో అర్ధం ఏమిటో అంతు పట్టడం లేదు! ట్రంప్ అధ్యక్షుడు అయినా మొహమ్మద్ యూనస్ బాంగ్లాదేశ్ వదిలి లండన్ వెళ్ళిపోవాలి, కానీ అలా జరగలేదు!
బేగం ఖలీదా జియా మాత్రం ట్రంప్ గెలవగానే వైద్యం చేయించుకోవాలి అంటూ లండన్ వెళ్ళిపోయింది నెల క్రితం… కానీ తిరిగి బాంగ్లాదేశ్ రాదు అని వార్తలు వస్తున్నాయి! మరి యూనస్ ఎందుకు ఇంకా బాంగ్లాదేశ్‌లో ఉన్నట్లు? సైనిక పాలన అనేది బాంగ్లాదేశ్‌కి కొత్త కాదు కదా?
So! జార్జ్ సోరోస్ ఇంకా చురుకుగానే ఉన్నాడు! దీనిని బట్టి భారత్ బాంగ్లాదేశ్‌ల మధ్య ఏదో పెద్దదే జరగడానికి ప్లాన్ ఉన్నట్లుగా ఉంది. అదేమిటో తెలియదు.
జార్జ్ సోరోస్‌తో కలిసి డోనాల్డ్ ట్రంప్ మరియు ఇతర రిపబ్లికన్ సభ్యులు కూడా షార్ట్ సెల్లింగ్‌లో పాల్గొన్నారు!
So! ట్రంప్ జార్జ్ సోరోస్‌లు ఇద్దరూ ఒకప్పుడు షేర్ మార్కెట్‌లో షార్ట్ సెల్లింగ్ బిజినెస్ చేశారు! ఇప్పటిలాగా కాకుండా ఒకప్పుడు జార్జ్ సోరోస్ మరియు ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్స్!
డోనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు హార్డ్ కోర్ డెమోక్రాట్ అని ఎంతమందికి తెలుసు? ఇవాల్టి రోజున ట్రంప్‌ని నెగటివ్ రోల్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నది హాలివుడ్ జార్జ్ సోరోస్‌కి వ్యతిరేకంగా ఉన్నాడు అని… కానీ 1980 దశకంలో ట్రంప్ హాలివుడ్ సినిమాలలో మంచి పాత్రలే పోషించాడు!
ట్రంప్ భార్య మేలేనియా ట్రంప్ తూర్పు యూరోపు నుండి హాలివుడ్‌కి మోడల్‌గా వచ్చి ఆపై ట్రంప్‌ని పెళ్లిచేసుకుంది! జార్జ్ సోరోస్‌కి ఏమీ కాకుండా మొదట అడ్డుపడేది రిపబ్లికన్స్ అన్నది నిజం!
బ్లాక్ వెన్స్ డే 1992 ఇంగ్లాండ్!
ఇంగ్లాండ్ బ్యాంకింగ్ వ్యవస్థలో చీకటి బుధవారం ( Black Wednesday ) గా ప్రసిద్ధిగాంచిన ఇంగ్లాండ్ కరెన్సీ సంక్షోభం సృష్టించిన వ్యక్తి జార్జ్ సోరోస్!
తన షార్ట్ సెల్లింగ్‌తో సెప్టెంబర్ 16, 1992 లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో కరెన్సీ సంక్షోభం సృష్టించాడు సోరోస్! అదానీ గ్రూపును ఎలా అయితే దెబ్బ తీశాడొ 1992 లో బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్‌ని దెబ్బతీసాడు సోరోస్!
జార్జ్ సోరోస్ దెబ్బకి బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ మరియు బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ బాగా తిన్నాయి! జార్జ్ సోరోస్ ఒక్కడే ఒక బిలియన్ డాలర్లు లాభపడ్డాడు. జార్జ్ సోరోస్‌తో పాటు చాలామంది లాభపడ్డారు 1992 లో.
1992 లో బిలియన్ డాలర్లు అంటే ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే 4 బిలియన్ డాలర్లు అవుతుంది! 1992 లో అప్పటి ప్రధాని మార్గరేట్ థాచర్ జార్జ్ సోరోస్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే జార్జ్ సోరోస్‌ని కాపాడింది రిపబ్లికన్స్!
So, ట్రంప్ తరుపున ఎలాన్ మస్క్ ఎంత తీవ్రంగా జార్జ్ సోరోస్‌ని విమర్శించినా జార్జ్ సోరోస్ తొణకట్లేదు ఎందుకు? డీప్ డీప్ స్టేట్‌కి డెమోక్రాట్లు అధికారంలో ఉన్నా, రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నా పట్టింపు ఉండదు! తమ రహస్య అజెండాని ఎవరు విజయవంతంగా అమలు చేస్తే వాళ్ళకే మద్దతు ఉంటుంది! ఒకరు కాకపొతే ఇంకొకరు!
మరొక నిజం ఏమిటంటే బ్రిటీష్ సామ్రాజ్యపు పూర్తి అధికారం పరోక్షంగా 1940 లోనే ఈ కనపడని డీప్ స్టేట్‌కి అప్పచెప్పారని అంటారు. 1947 లో మనకి స్వతంత్రం రావడం వెనుక, ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడడానికి కారణం ఈ కనపడని డీప్ స్టేట్ మాత్రమే!
మొన్నటి అమెరికా ఎన్నికలలో డెమోక్రాట్లు కూడా ట్రంప్‌కి నిధులు ఇచ్చారు అంటే వెనక నుండి ఎవరో ఆదేశాలు ఇచ్చారు అనే కదా అర్ధం?
డీప్ డీప్ స్టేట్ డోనాల్డ్ ట్రంప్ చేత అనిపించిన మాటలు ఇవి….
కెనడాని అమెరికాలో కలిపేస్తాను.
గ్రీన్‌లాండ్‌ని అమెరికాలో ఒక భాగం చేస్తాను.
పనామా కాలువని అమెరికా స్వాధీనం చేసుకుంటుంది.
అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులని ఎమర్జెన్సీ విధించి వెనక్కి పంపిస్తాను.
అమెరికాని మళ్ళీ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా చేస్తాను.
ఇలా డీప్ డీప్ స్టేట్ ట్రంప్ చేత మాట్లాడించడమే కాదు వేగంగా పనులు చేయిస్తున్నది.
బయటికి చెప్పలేకపోవచ్చు కానీ మోడీని పదవి నుండి దించే ప్రయత్నం ఎప్పటిలాగానే కొనసాగుతుంది. ఇది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం :
ట్రంప్ పేరుతో క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముఖేష్ అంబానీని పిలవడం, ఆపై ముఖేష్ అంబానీ కూడా క్రిప్టో కరెన్సీ ని ప్రవేశపెట్టబోతున్నాడు అనే వార్త రావడం యాదృచ్చికం కాదు!
ముఖేష్ అంబానికి అనుమతి నిరాకరణ!
మహా కుంభమేళాకి పవిత్ర స్నానం చేయడానికి వచ్చిన ముఖేష్ అంబాని 40 కార్ల కాన్వాయ్‌కి త్రివేణి సంగమం వరకూ రావడానికి యోగి అనుమతి ఇవ్వలేదు. కార్లని దూరంగా ఆపేసి కాలి నడకన రావాల్సిందిగా సలహా ఇచ్చారు అధికారులు అంబానికి!
BSNL ని ప్రమోట్ చేయడం, అనిల్ అంబానికి ప్రాముఖ్యం ఇవ్వడం వెనుక ముఖేష్ అంబాని మోడీ విషయంలో చేయకూడని పని ఏదో చేసి ఉండవచ్చు అనుకోవచ్చా..? Contd…. Part 2
Share this Article