ఫైవ్ ఐస్… ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? కొత్తగా తెర మీదకు వచ్చింది… నిజానికి పాత పేరే, ఇదొక దేశాల కూటమి… చాలా పాత కూటమి… ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, అమెరికా… ఈ దేశాలు గూఢచర్యంలో ఒకరికొకరు సహకరించుకోవడానికి ఈ కూటమి కట్టారు… దాదాపు 1941లో… అంటే 82 సంవత్సరాల క్రితం ఏర్పడింది…
దీని ఉద్దేశం ఏమిటంటే… అప్పట్లో రష్యాతో కోల్డ్ వార్ ఉండేది కదా… ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయింది… ఒక దానికి అమెరికా నేతృత్వం… మరొకటి రష్యా… సో, ఆ పరిస్థితుల్లో ఈ అయిదు దేశాలు మిలిటరీ, గూఢచర్యం, రహస్య సమాచారం, సీక్రెట్ ఏజెంట్ల డిటెయిల్స్ గట్రా షేర్ చేసుకోవడానికి… ఒక దేశం మరో దేశానికి అన్నిరకాలుగా మద్దతుగా నిలవడానికి ఉద్దేశించిన కూటమి ఇది… 2010 వరకూ గోప్యంగా ఉంచారు ఈ కూటమి గురించి…
(అవసరాలను బట్టి, భౌగోళికతలను బట్టి రకరకాల దేశ కూటములు ఉంటాయి… క్వాడ్, బ్రిక్స్, సార్క్ ఎట్సెట్రా… ఫైవ్ ఐస్ మాత్రమే కాదు, సెవన్ ఐస్, నైన్ ఐస్, ఎలెవన్ ఐస్ గట్రా తరువాత కాలంలో తెరపైకి వచ్చాయి గానీ… ఈ ఫైవ్ ఐస్ మాత్రం కాలపరీక్షకు నిలిచిన బలమైన కూటమి…)
Ads
స్థూలంగా చూస్తే ఈ ఐదు దేశాలూ ఓ కుటుంబం తరహా… ఆంగ్లం, శ్వేతవర్ణ ఆధిపత్యం, వర్ణ వివక్ష ఎట్సెట్రా కామన్ ఫీచర్స్… ప్రపంచ రాజకీయాల్లో ఒకరికొకరు తోడ్పాటు… ఇప్పుడు తెరమీదకు వచ్చిందంటే… ఇండియా- కెనడా నడుమ ఉద్రిక్తతలు పెరిగిన తీరు, కారణాలను మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా… నజ్జర్ అనే ఉగ్రవాదిని ఇండియన్ ఏజెంట్లే హతమార్చారు అనేది కెనడా ఆరోపణ… ఇందులోకి సహజంగానే అమెరికా తలదూరుస్తోంది… మరి కెనడా తన తమ్ముడు కదా…
ఖచ్చితంగా కెనడా దర్యాప్తుకు ఇండియా సహకరించాల్సిందే అంటోంది ఇప్పుడు అమెరికా… దీంతో అంతర్జాతీయ పత్రికలు సైతం అమెరికా ఇండియా పట్ల మొగ్గు చూపించడం మానేసిందని రాయడం మొదలెట్టాయి… అందులో డౌట్ దేనికి..? తమ్ముడు తమ్ముడే… ఇండియా ఎప్పుడైనా అమెరికాకు బయటి కేరక్టరే… చైనాతో పోరాటానికి, వాణిజ్యానికి ఇండియా కావాలి… ఆసియా రాజకీయాల్లో ఇండియాను ఇగ్నోర్ చేయలేదు… అందుకని ఇండియా కావాలి…
అందుకే క్వాడ్ పేరిట ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, ఇండియా దేశాలతో ఓ కూటమి ఏర్పాటు చేశారు ఆమధ్య… కానీ ఆఫ్టరాల్ క్వాడ్… ఫైవ్ ఐస్ అనేది హిస్టారిక్, సేమ్ ఫ్యామిలీ, సేమ్ నేచర్ కూటమి కదా… అందుకని కెనడా పాట పాడుతోంది అమెరికా… (తన సీఐఏ ఏజెంట్లు ఏకంగా దేశాల పెద్దలనే ఖతం చేయవచ్చు, కానీ ఇండియా మాత్రం తన సార్వభౌమత్వానికి- సమగ్రతకు థ్రెట్లను ఉపేక్షించాలా..?) నజ్జర్ రచ్చ పెరుగుతూ ఉండగానే మరో ఉగ్రవాదిని కెనడాలో ఖతం చేశారు…
ఒక్కసారి పరిశీలించండి… న్యూజిలాండ్‌ను వదిలేస్తే… ఖలిస్థాన్ శక్తులు బలం పుంజుకుంటున్న దేశాల్లో మూడు… అంటే బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా… ఇవి మూడూ ఫైవ్ ఐస్ సభ్యదేశాలే… అమెరికా సరేసరి… ఆ మూడు దేశాలకు పెద్దన్న… సో, ఇండియాకు ఖలిస్థాన్ కోణంలో ఈ ఫైవ్ ఐస్ కూటమి తలనొప్పిగా మారుతోంది… నజ్జర్ హత్య కేసుకు సంబంధించి ఫైవ్ ఐస్ సభ్యదేశాలే సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి… ఒక మాటలో చెప్పాలంటే ఫైవ్ ఐస్ తన పరిశోధనలో కొన్ని ఆధారాలు సంపాదించాకే కెనడా ఇండియాపై విరుచుకుపడుతోంది…
అలాగని నజ్జర్ హత్యను ఇండియా ఓన్ చేసుకోలేదు… తను హతమైపోయింది కెనడా గడ్డ మీద… తప్పుడు పాస్‌పోర్టుతో సాగిన నజ్జర్ యాక్టివిటీస్ తెలిసి కూడా కెనడా ఇప్పుడు నజ్జర్ తన పౌరుడు అంటోంది… అంటే, ఆ దేశాల సిక్కుల మద్దతు కోసం, సిక్కు ప్రజాప్రతినిధుల మద్దతు కోసం ఇండియాను గోకడానికీ సిద్ధమైపోయింది కెనడా… దానికి అమెరికా మద్దతు… సో, అమెరికా ఇండియాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నమ్మదగిన మిత్రదేశం కాబోదు… కాలేదు…!!
Share this Article