Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!

August 9, 2026 by M S R

.

E20 ఇంధనం మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది… వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు… దీన్ని ప్రమోట్ చేస్తున్న నితిన్ గడ్కరీని కాషాయవాదులు కూడా ఆక్షేపిస్తున్నారు… ఈ సమయంలో కేంద్రం గోబర్దన్ స్కీమ్‌ను తెరపైకి తీసుకొచ్చింది… చాలామందికి ఈ గోబర్ధన్ కథేమిటో తెలియదు… మీడియా, పార్టీలు కూడా ఈ-20 మీద రచ్చను తప్ప ఈ ఉపయుక్త కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు… అసలు ఏమిటి ఈ గోబర్ధన్..?

(  Nàgaràju Munnuru  ) …. == స్వయం సమృద్ధ ఇంధనం బయో CNG == దేశంలో పెట్రోల్ లో ఇథనాల్ కలపడం మీద అనేక విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాబోయే దశాబ్ది కాలంలో దేశీయ బయో-CNG (కంప్రెస్డ్ బయోగ్యాస్) ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ₹23,731 కోట్ల గోబర్ధన్ పథకాన్ని ఆమోదించింది.

Ads

ఈ పాలసీ ప్రకారం ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్న సహజ వాయువు (Natural Gas) సరఫరాలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే బయో-CNGని క్రమంగా కలపాలి అనేది ప్రణాళిక.
ఇది 2027 ఆర్థిక సంవత్సరంలో 3%, 2028 ఆర్థిక సంవత్సరంలో 4%, 2029 ఆర్థిక సంవత్సరం నుండి 5% వరకు దేశీయ బయో CNGని సహజ వాయువులో కలుపుతారు.

gobardan

GOBARdhan… గోబర్ గ్యాస్ గురించి మనకు తెలిసిందే కదా, పథకం పేరులోని ఫస్ట్ మూడు అక్షరాలు అవే… GOBAR… తరువాత dhan… అంటే ధనం, తెలిసిందే… ఫస్ట్ రెండు లెటర్స్ ‘GO… గోవు… ఆవు… (బీజేపీ పథకాల్లో గోవు, రాముడు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది…?)

ఈ పథకం ద్వారా దేశీయ బయో-CNG ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడం,  దేశవ్యాప్తంగా శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

బయో-CNGని పశువుల పేడ, పంట వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, ఇతర సేంద్రియ వ్యర్థాల నుండి ఉత్పత్తి చేస్తారు. పెట్రోలులో ఇథనాల్ కలపడం ద్వారా వస్తున్న సమస్యలేవీ సహజ వాయువులో బయో-CNGని కలపడం ద్వారా ఉత్పన్నం అవవు. ఎందుకంటే ఇది రసాయనికంగా సహజ వాయువును పోలి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న CNG వాహనాలు ఈ మిశ్రమ ఇంధనాన్ని ఎలాంటి మార్పులు లేకుండా ఉపయోగించవచ్చు. బయో-CNG ఉత్పత్తి తర్వాత మిగిలిన వ్యర్థాలను రైతులు సేంద్రీయ ఎరువులుగా పొలంలో వేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ లో ఇథనాల్ కలపడం మీదకంటే దేశీయంగా చౌకగా లభించే పశువుల పేడ, పంట, ఆహార వ్యర్థాలు, నేపియర్ గడ్డి ద్వారా బయో CNG ఉత్పత్తి మీద దృష్టి పెడితే అటు చమురు దిగుమతుల మీద వెచ్చించే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవడమే కాకుండా ఇటు CNG వాహనాల్లో ఎటువంటి మార్పులు చేయకుండానే, వాహనదారులు ఎటువంటి అనుమానాలు లేకుండా బయో CNGని వినియోగించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి వచ్చిన సలహాలు సూచనలు స్వీకరించిందో లేదో తెలియదు కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ప్రభుత్వానికి, రైతులకు, వాహనదారులకు విశేషంగా ఉపయోగపడుతుంది.

PS : ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడుచుకునే ప్రభుత్వ పాలసీలను ఎలా విమర్శిస్తామో దేశానికి మంచి చేసే నిర్ణయాలను అభినందించడం అవసరం. – నాగరాజు మున్నూరు

#బయోసీఎన్‌జీ #సీఎన్‌జీ #గోబర్ధన్ #క్లీన్‌మొబిలిటీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…
  • Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!
  • సూర్య ! ఇప్పుడిక తనకు పోటీ లేదు – మరో రేంజుకు ‘మార్కెట్ వాల్యూ’..!!
  • ఎఐ సొంతంగా దొంగ దారులూ వెతుకుతోంది.. మరో ముప్పు !
  • Friendship Recession – స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది !
  • చీకటికి చెల్లుచీటీ ! అంధత్వంపై పోరుకు మరో అద్భుత సాంకేతికత !
  • న్యూ పల్స్ … మన ఆరోగ్యం విదేశీ ఇన్వెస్టర్ల చేతుల్లోకి !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions