.
మొన్న ఆదివారం ఫిష్ కొందామని వెళ్ళా, అక్కడ ఒక పాప వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి పని చేస్తోంది.. నేను వెళ్ళగానే అక్కడ ఉన్న చేపల పేర్లు అన్నీ చెప్పి కిలో ఎంతో చెప్పింది. నేను కన్ఫ్యూజన్ లో ఉంటే “fry కోసం అయితే ఇది తీసుకో అన్నా బాగుంటుంది” అని తూకం వేసి 170 అవుతుందని చెప్పి క్లీన్ చేసి cut చెయ్యడానికి వాళ్ళ నాన్నకి ఇచ్చింది…
“రొయ్యలు కూడా ఫ్రెష్ ఉన్నాయి, తీసుకో సార్” అంటే half కిలో ఇవ్వమన్నా. Prawns అన్నీ తనే ఒల్చి క్లీన్ చేసి ఇచ్చింది… కటింగ్ వరకే అమ్మా నాన్నా చూసుకుంటున్నారు. డబ్బులు తీసుకునే టైముకి “ బుజ్జి సారుది ఎంత అయ్యిందో చూడు?” అంటున్నారు వాళ్ళు… అంతే, బుజ్జిది చక చకా లెక్క చెప్పి చిల్లర వెనక్కి ఇస్తోంది…
Ads
ఇది కదా చదువుని చిన్నప్పటి నుంచి జీవితానికి అప్లై చేయడం అంటే అనిపించింది తనని చూసి… పిల్లలతో పని చేయించడం బాధ్యత తెలుసుకునేలా చెయ్యడమా? లేక దీన్ని Child Labour అనాలా…?
ఆ నాన్న బుజ్జి కన్నా బంగారు పిల్లల్ని పక్కన పెట్టేస్తే… మనం రోజూ చూసే పిల్లలు కొందరు ఉంటారు… పాల షాపులో ప్యాకెట్ అందిస్తూ, హోటల్లో పార్సెల్ కడుతూ, కిరాణ కొట్టులో లెక్క చెప్తూ, చేపల షాపులో తూకం వేస్తూ… ఇలా వాళ్ళ తల్లిదండ్రులు చేసే వ్యాపారంలో… స్కూల్ టైమ్ కానప్పుడు, ఇంకా సెలవు రోజుల్లో వాళ్ళతో కలిసి పని చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తుంటారు…
అది వాళ్ళ నెత్తిన భారం వెయ్యడం అందామా..? కానే కాదు… బాధ్యత తెలుసుకొనేలా చెయ్యడం… నాకు తెల్సిన ఒక అబ్బాయి నా క్లాసే, but వేరే school… నేను 10 th చదివేటప్పుడు వాళ్ళ నాన్న పానీపూరి బండి దగ్గర తిన్న ప్లేట్స్ కడుగుతూ నాన్నకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు హ్యాపీగా… ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?
బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ చేసి, జర్మనీలో ford కంపెనీలో పెద్ద ఇంజనీర్ గా చేస్తున్నాడు… ఇంకో 10 th క్లాస్మేట్, మేము కలిసి ఎంబీబీఎస్ చదివే రోజుల్లో, మేము చదివిన స్కూల్లో part time teacher లా పని చేస్తూ డాక్టర్ అయ్యాడు… అపోలో హాస్పిటల్లో పెద్ద న్యూరో సర్జన్ ఇప్పుడు… ఇప్పటికీ ఎప్పటికీ వీళ్ళంటే నాకు ఇన్స్పిరేషన్ …
ఇలా ఒకరు కాదు, చాలా మంది పిల్లలు బాగా సెటిల్ అయ్యారు… అసలు ఆ పిల్లలు వేసే లెక్కలు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది… నేనేమో మనసులో లెక్కేస్తుంటే ఆ పిల్లలు “నాకు ఇందాక 100 ఇచ్చావు, 74 పోతే 26 చిల్లర తీసుకో” అంటారు…
ఎందరు మ్యాథ్స్ టీచర్స్ పాఠాలు వింటే, ఎన్ని అబాకస్ క్లాసులకు వెళ్తే వస్తుంది ఈ బతుకు పోరాటం నేర్పే లెక్కలు … పిల్లల్ని కష్టం తెలీకుండా పెంచడం కాదు Good parenting… వాళ్ళ కోసం పడే కష్టాన్ని వాళ్ళు తెలుసుకునేలా పెంచడం… అప్పుడే చిన్న వయసులో వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది… పెద్దయ్యాక కష్టపడి పని చేస్తారు… జీవితంలో పైకి వస్తారు…
…………………
Dr రూపేష్ కుమార్ రెడ్డి, రిషి హాస్పిటల్, పీలేరు
Share this Article