.
గ్రేటర్ బంగ్లాదేశ్… ఇప్పుడు కలకలం రేపుతున్న పదాలు ఇవి… ఇది భారత దేశానికి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుందో, కొత్త సవాళ్లను విసురుతుందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి…
బంగ్లాదేశ్ పుట్టుక నేపథ్యం ఏమిటి..? ప్రస్తుత పాకిస్థాన్ నిరంకుశ పాలన, వివక్ష, అణిచివేసే ధోరణితో జనం తిరగబడి, ఇండియా సైనిక సహకారంతో కొత్త దేశంగా ఏర్పడింది… అది దాని చరిత్ర…
Ads
కానీ సాయం చేసిన చేతినే కాటేసే రకం బంగ్లాదేశ్… ఇప్పుడు ఇండియా మీద శతృభావనతో రెచ్చిపోతోంది… ఏ పాకిస్థాన్ అయితే తమను అణగదొక్కిందో అదే పాకిస్థాన్‌తో ఇప్పుడు అంటకాగుతోంది… ఇటు పాకిస్థాన్, అటు చైనా, వీటికి తోడుగా బంగ్లాదేశ్… ఇదీ ఇండియాకు తలనొప్పి… భద్రత కోణంలో..!
ప్రత్యేకించి బంగ్లాదేశ్ సైనికులకు పాకిస్థాన్ సైన్యం శిక్షణ ఇస్తుందట, డ్రోన్ టెక్నాలజీని ఇస్తుందట… అంతేకాదు, కొన్ని మిసైళ్లను (అబ్దాలీ) కూడా సప్లయ్ చేస్తుందట… అది భస్మాసుర బంగ్లాదేశ్…
తాజాగా పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్‌లో పర్యటించాడు… బంగ్లాదేశ్ తాత్కాలిక హెడ్ యూనస్ తనను కలిసి ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అనే ఓ పుస్తకాన్ని కానుకగా ఇచ్చాడు… దాని ముఖచిత్రం ఏమిటో తెలుసా..? గ్రేటర్ బంగ్లాదేశ్..!!
గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే అదొక భావన… బంగ్లాదేవ్‌లో అతి జాతీయవాాద ‘సుల్తానత్ ఎ బంగ్లా’ వంటి గ్రూపులు ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి… ఇది పాత బెంగాల్ సుల్తానేట్ ప్రాంతాలను ‘అఖండ బంగ్లా‘ తరహాలో ఏకీకరణ చేయాలనేది ఆ వాదన సారాంశం…
ప్రతిపాదిత గ్రేటర్ బంగ్లాదేశ్ చిత్రపటంలోకి సమస్త ఈశాన్య భారతదేశం (Entire Northeast India) అంటే… అసోం (Assam) త్రిపుర (Tripura) మేఘాలయ (Meghalaya) మిజోరం (Mizoram) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) నాగాలాండ్ (Nagaland) మణిపూర్ (Manipur) మాత్రమే కాదు…, పశ్చిమ బెంగాల్ (West Bengal) బీహార్‌లోని కొన్ని భాగాలు (Parts of Bihar) జార్ఖండ్‌లోని కొన్ని భాగాలు (Parts of Jharkhand) ఒడిశాలోని కొన్ని భాగాలు (Parts of Odisha) వస్తాయిట… అంతేకాదు, మయన్మార్ లోని అరకాన్ కూడా…
ఇవన్నీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఇండియా, బర్మా ప్రాంతాలు… ఒక దేశ టెంపరరీ చీఫ్, ఏకంగా మరో దేశ ఆర్మీ చీఫ్ జనరల్‌కు ఈ చిత్రపటాన్ని బహూకరించడాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు… అసలే పాకిస్థాన్, తోడుగా బంగ్లాదేశ్… బంగ్లా సరిహద్దుల్లో ఇండియాకు భద్రతపరంగా అత్యంత కీలకమైన, ఈశాన్య భారతానికి గేట్ వే వంటి చికెన్ నెక్ ఉంటుంది…
ఇదీ ప్రస్తుత కలకలం, వివాదానికి కారణం… మీడియాలో కాస్త గగ్గోలు కనిపించగానే… యూనస్ ఆఫీస్ ఏదో తలాతోకా లేని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది… నిజంగా గ్రేటర్ బంగ్లాదేశ్ వైపు నాలుగు అడుగులు వేయాలని ఆ దేశం ప్రయత్నిస్తే, ఇండియాకన్నా ముందు బర్మా విరుచుకుపడుతుంది… ఇండియాకు సంక్లిష్ట రాజకీయాల ఒత్తిళ్లు, తలనొప్పులు ఎక్కువ… బర్మాకు అవేమీ లేవు…
ఇంకా బంగ్లా ప్రేమికురాలు మమత బెనర్జీ వంటి జాతీయవాద వ్యతిరేకులు ఇంకా స్పందించలేదు… భారతీయ విదేశాంగ శాఖ తేలికగా తీసుకుంది… కానీ యూనస్ తమ దేశంలోని అతివాద గ్రూపుల ట్రాపులో పడిపోతున్న తీరుకు ఇది ఓ ఉదాహరణ… అది భారత దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు…!!
Share this Article