కేసీయార్ అవినీతి…! ఇది ప్రస్తుతం ఓ చర్చనీయాంశం..!. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేదు కాబట్టి, కేసీయార్ దాన్ని తొక్కీ తొక్కీ నార తీసి ఇప్పటికే దాన్ని గాలికి వదిలేశాడు కాబట్టి, దానికి జాతీయ స్థాయిలోనే నాయకత్వం లేదు కాబట్టి, ఇప్పట్లో దానికి ఓ దశ, ఓ దిశ కనిపించదు కాబట్టి… దానికి ఇప్పటి స్థితిలో ఏదీ చేతకాదు…! కానీ బీజేపీకి చాన్స్ ఉంది… కేంద్రంలో అధికారంలో ఉంది, మొన్నమొన్నటిదాకా కేసీయార్ ఫేవర్డ్ నాయకులే దాన్ని లీడ్ చేశారు కానీ ఇప్పుడు బండి సంజయ్ లీడ్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీ దూకుడు మీద ఉంది… కేసీయార్ ఢిల్లీ వెళ్లి దాసోహం అన్నాడు సరే, ఐనా తెలంగాణ నాయకత్వం ఇప్పటికీ ‘టార్గెట్ కేసీయార్’ అన్నట్టుగా వెళ్తున్నది కాబట్టి ఇవి కాస్త ఆలోచించాలి…
ప్రాంతీయ పార్టీలు దూరం అవ్వాలి… వారసత్వ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది ప్రస్తుత బీజేపీ పాలసీ కాబట్టి…. ఈ కోణంలో ఆలోచించాలి… తన అవసరాల రీత్యా బలమైన ప్రాంతీయ పార్టీలను అవసరమున్నప్పుడు వాడుకోవాలి, తరువాత తన్ని తరిమేయాలి అనేది బీజేపీ పాలసీ కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించాలి… అదే సమయంలో కాంగ్రెస్ ముక్త భారత్ తన నినాదం కాబట్టి దాన్నీ విస్మరించకూడదు…
Ads
తెలంగాణ విషయానికొస్తే…. కాంగ్రెస్‌ను చీరి చింతకు కట్టేశాడు కేసీయార్… కానీ బీజేపీని వదిలేశాడు, ఆఫ్టరాల్ బీజేపీ అనుకున్నాడు, నా జాన్ జిగ్రీ ఒవైసీ నాకు చాలు అనుకున్నాడు… యాంటీ-హిందూ పోకడలకు పోయాడు… దుబ్బాక, గ్రేటర్ దెబ్బలకు దెయ్యం దిగివచ్చింది… నా ప్లానింగులోనే లోపముంది అని అర్థమవుతోంది ఇప్పుడు.., అమిత్ షా నట్లు బిగించేకొద్దీ తత్వం బోధపడుతోంది… ఈలోపు కేసీయార్ అవినీతి చుట్టూ వల బిగుసుకుంటోంది… అందుకే ఢిల్లీ వెళ్లొచ్చాక కిక్కుమనడం లేదు అనేది ఈ స్టోరీ పరోక్ష అర్థం…
చదవడం కష్టమే… కానీ విషయం ఏమిటంటే..? కేసీయార్‌కు మస్తు డబ్బులు ఇస్తున్న కంపెనీలు, వాటి అనుబంధ బినామీ కంపెనీలు, అనుబంధ కంపెనీలు, సబ్ కంట్రాక్టుల కంపెనీలపై ఐటీ, సీబీఐ, ED దాడులు సాగుతున్నాయి… కేసీయార్‌ను ఫిక్స్ చేసే కథలు సాగుతున్నాయి అనేది ‘దిశ’ అనబడే ఓ డిజిటల్ పేపర్ స్టోరీ…
కేసీయార్ సన్నిహిత కంపెనీల మీద దాడులు సాగుతున్నయ్, తనను బుక్ చేయబోతున్నారు, ఇక కిక్కుమనడు, అయిపోయింది, అందుకే మొన్న ఢిల్లీ వెళ్లొచ్చాక అన్నీ మూసుకుని ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు అనేది ఈ స్టోరీ అంతరార్థం… ఇలాంటి స్టోరీలు చివరకు ఆ కాషాయ వివేక్ ‘వెలుగు’కు కూడా చేతకాలేదు… (మిగతా పత్రికలు కేసీయార్ పాదాల మీద పడి పాకే దాస్య పురుగులే కాబట్టి.., ఆ జర్నలిస్టులు, ఎడిటర్లు సేమ్ కాబట్టి వాటి గురించి ఆలోచించనక్కర్లేదు…)…
అయితే ఈ స్టోరీలోనూ కొన్ని ఫ్లాస్ ఉన్నయ్… కాలేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల వేల కోట్ల అవినీతి అక్రమాలకు సంబంధించి ఆరోపణలు నిజమే… ఐటీ, సీబీఐ దాడులు నిజమే… కానీ ఇవేమీ కోఆర్డినేటెడ్గా జరుగుతున్నట్టు ఏమీ కనిపించడం లేదు… ప్రత్యేకించి మైహోం, మేఘా ఆల్రెడీ సరెండర్డ్ అనే వార్తల నడుమ ఈ కథనం మీద బోలెడు ప్రశ్నలున్నయ్… కేసీయార్ అవినీతిని నిరూపించే దిశలో ఇవి సమన్వయంతో, సంయుక్తంగా సాగుతున్న దాడులు, దర్యాప్తులు, విచారణలు అన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు పరిస్థితి… దేనికదే దాడులు చేస్తున్నయ్… అదీ ప్రశ్న…
ఎస్.., కేసీయార్ బీజేపీకి వ్యతిరేకంగా చాలామందికి ఎన్నికల నిధులు ఇచ్చాడు… సేమ్, చంద్రబాబు కూడా ఇచ్చాడు… రేప్పొద్దున అవసరమైతే జగన్ కూడా ఇస్తాడు… అందరికీ అడ్డగోలుగా వచ్చిపడే మేఘా టైపు డబ్బులే ఆధారం… దాన్ని కట్ చేయడానికేనా..? దాన్ని అడ్డుకట్ట వేయడానికేనా బీజేపీ ప్రస్తుత చర్యలు…? మరి ఆ మైహోం, ఆ మేఘా కూడా బీజేపీ ఫోల్డ్‌లోకి వచ్చేసి, అన్నిరకాల రక్షణలూ కోరుకుంటే ఇక బీజేపీ చేయగలిగేది ఏమీ లేదా..? ఇవన్నీ ప్రశ్నలు… డబ్బు ఆధారిత ఇండియన్ పాలిటిక్సులో ఇవే అసలు ప్రశ్నలు..!!
Share this Article