Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియాపై యుద్ధానికి బంగ్లాదేశ్ సన్నాహాలు… అదీ పాకిస్థాన్ సాయంతో..!!

September 1, 2024 by M S R

భారత్ తో తలపడడడానికి బంగ్లా సైన్యం సిద్దపడుతున్నదా? తెరవెనుక ఏం జరుగుతున్నది? బాంగ్లాదేశ్ లో అమెరికా కుట్రతో షేక్ హసీనాని ప్రధాని పదవి నుండి తొలగించేశాక, అక్కడి పరిస్థితుల మీద అమెరికా పట్టు కోల్పోయి, పాకిస్థాన్ ISI చేతిలోకి వెళ్ళిపోయింది. భారత్ బాంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకుంటుంది అనుకుని, ముందు జాగ్రత్తగా బాంగ్లాదేశ్ సైన్యం సన్నాహాలు చేసుకుంటున్నదా?

భారత్ ఎందుకు బాంగ్లాదేశ్ లో జోక్యం చేసుకుంటుంది? అలాంటి పరిస్థితులు బంగ్లా సైన్యం లేదా ISI సృష్టిస్తుందా? అంతా ముందస్తు ప్రణాళికతో జరుగుతున్నదా?

 

Ads

*********
1.ఆగస్టు 5 న షేక్ హసీనా బాంగ్లాదేశ్ వదిలి భారత్ చేరుకున్న తరువాత మొహమ్మద్ యూనస్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించింది సైన్యం!

2.వారం తిరగకుండానే బంగ్లా సైన్యం తన అవసరాల కోసం అంటూ పాకిస్థాన్ రక్షణ సంస్థలకి భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది!

3.సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ బాంగ్లాదేశ్ కి చేరుకునేలా మరియు డిసెంబర్ నెల నాటికి మరో రెండు షిప్మెంట్స్ లతో కలిపి మొత్తం మూడు దశలలో మొత్తం ఆర్డర్ సప్లై చేయాలి పాకిస్థాన్!

4. నలభై  వేల రౌండ్స్ ఆర్టీలరీ షెల్స్ పాకిస్థాన్ నుండి కొంటున్నది బంగ్లా సైన్యం. 2023 లో 12,000 రౌండ్స్ మాత్రమే కొన్న బంగ్లా సైన్యం ఇప్పుడు దానికి మూడు రెట్ల మొత్తంలో ఎందుకు కొంటున్నది?

5.బంగ్లా సైన్యం ఆర్డర్ పెట్టిన ఆర్టిలరీ షెల్స్ ఆర్టిలరీ గన్స్ ద్వారా ప్రయోగిస్తే 30 నుండి 35 km దూరం ప్రయాణించి టార్గెట్స్ ని కొట్టగలవు! బాంగ్లాదేశ్ కి మూడువైపులా భారత్ తో సరిహద్దు ఉండగా ఒకవైపు బంగాళాఖాతం ఉంది. 30 km దూరం వెళ్లగల షెల్స్ కొంటున్నదీ అంటే వాటిని భారత్ మీద ప్రయోగించిండానికే అన్నది స్పష్టం! బర్మా మీదకి అయితే కాదు!

6. 40 టన్నుల RDX మైనం రూపంలో ( Wax consistency ) పేలుడు పదార్ధంకి ఆర్డర్ ఇచ్చింది. RDX అనేది సైన్యం కొంటున్నదీ అంటే అది యుద్ధం కోసమే! అల్లర్లని అణిచివేయడానికి వాడరు!

7. 2,900 మోర్టార్ లాంచర్స్ హై ఎక్సప్లోజీవ్ ప్రాజక్టైల్స్ తో కూడినవి. వీటిని యుద్ధంలో ఫార్వార్డ్ సైనికులు వాడతారు!
8. ఇవి కాక భారీ మొత్తంలో మెషిన్ గన్ బులెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది.

 

********
బంగ్లా సైన్యం పాకిస్థాన్ కి ఇచ్చిన ఆర్డర్ విషయం భారత ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టాయి. ఈ నెల మొదటివారంలో ఇచ్చిన ఆర్డర్ ని వెంటనే అమలు చేయాలని పాక్ ఆర్మీ చీఫ్ తమ రక్షణ సంస్థలకి తెలియచేస్తూ, గడువుకి ముందే తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

 

*******
బంగ్లాదేశ్ జమాతే – ఇ – ఇస్లామీ పార్టీకి అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఇస్లామీ చ్చాత్ర శిబిర్ ( Islami Chatra Shibir ) తో చైనా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. చైనాకి బంగ్లాదేశ్ అమెరికా లేదా భారత్ తో కలిసి పనిచేయడం ఇష్టం లేదు.

అమెరికాకి బంగ్లాదేశ్ చైనా గుప్పిటలోకి వెళ్లడం ఇష్టం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా మొహమ్మద్ యూనస్ ఉండడం చైనా, పాకిస్థాన్ లకి ఇష్టం లేదు. యూనస్ అమెరికా తొత్తు అన్న విషయం బహిరంగ రహస్యమే! ప్రస్తుతం యూనస్ చేత రాజీనామా చేయించి సైన్యం పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించి బేగం ఖలీదా జియాని గెలిపించి ప్రధానిగా చేయాలని పాకిస్థాన్ ప్లాన్! ఇది పాకిస్థాన్ లో అక్కడి సైన్యం చేసేదే!

********
గత జూన్ నెలలో మొహమ్మద్ యూనస్ తరుచూ బేగం ఖలీదా జియా ముఖ్య అనుచరులతో లండన్ లో సమావేశం అయ్యేవాడు యూనస్! షేక్ హసీనాని ఎలా గద్దె దింపాలో యూనస్ ఖలీదా జియా అనుచరులతో చర్చలు జరిపాడు. ప్లాన్ విషయం యూనస్ కి తెలుసు, అదే సమయంలో ఖలీదా జియా ప్రధాని కావడానికి తాను మద్దతు ఇస్తానని హామీ ఇచ్చాడు. తీరా తానే ప్రధాని అయ్యాడు! ఇప్పుడు యూనస్ రాజీనామా చేసే దాకా విద్యార్థి సంఘాలు ఊరుకోవు!

*******
విద్యార్థుల పేరుతో రాజకీయ పార్టీల మద్దతుదారులే నకిలీ ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్థాన్ ISI చాలా చురుకుగా పనిచేస్తున్నది బంగ్లాదేశ్ లో!డిజిటల్ మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలని చేయిస్తున్నది. బంగ్లా ప్రజల మూర్ఖత్వం ఎంతవరకు వెళ్లిందంటే తమని తామే దోచుకునేంతగా!
షేక్ హసీనా రాజీనామా చేసి మూడువారాలు దాటినా హింస మాత్రం తగ్గలేదు.

Cold War 1
అమెరికా దాని మిత్రదేశాలు ఒకవైపు సోవియట్ యూనియన్, దాని కమ్యూనిస్ట్ మిత్ర దేశాలు మరోవైపు మొహరించాయి! కోల్డ్ వార్ 1 సమయంలో అంటే 1950 నుండి 1990 వరకు అమెరికా దాదాపుగా 80 దేశాలలో ప్రభుత్వాలని కూలగొట్టింది! సోవియట్ యూనియన్ పతనం తరువాత దాని అవశేషం రష్యా బలహీనపడడం వలన అమెరికాకి తిరుగులేకుండా పోయింది!

2014 నుండి కోల్డ్ వార్ 2 మొదలయ్యింది!

ఈసారి సోవియట్ యూనియన్ స్థానంలోకి చైనా వచ్చి చేరింది! రష్యా కేవలం అణు ఆయుధాలు భారీ సంఖ్యలో కలిగి ఉన్న కారణంగా ఇంకా పోటీలో ఉండగలుగుతున్నది!  చైనా గుప్పిట్లోకి ఆసియా దేశాలు వెళ్లకుండా అమెరికా ఆపాలని చూస్తున్నది! మనం పట్టించుకోలేదు కానీ లావోస్ దేశం పూర్తిగా చైనా అధీనంలోకి వెళ్ళిపోయి చాలా రోజులు అయ్యింది!

లావోస్ దేశం చైనా నుండి తీసుకున్న అప్పు ఆ దేశ GDP నీ మించిపోయి దేశం మొత్తం చైనా చేతిలోకి వెళ్ళిపోయింది! లావోస్ లాండ్ లాక్డ్ దేశం. అప్పు తీర్చే సంగతి పక్కన పెడితే కనీసం వడ్డీ కూడా కట్టలేని దీన స్థితి లావోస్ దేశానిది! ఇప్పటికిప్పుడు లావోస్ ని స్వాధీనం చేసుకోకపోయినా ఆ దేశాన్ని రిమోట్ కంట్రోల్ తో పాలిస్తున్నది చైనా!

So! బంగ్లాదేశ్ కి ఆ స్థితి రాకుండా షేక్ హసీనా జాగ్రత్త పడ్డది! బంగ్లాదేశ్ లోని తీస్తా నది మీద ప్రాజెక్ట్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇవ్వమని అడిగింది చైనా. కానీ ఆ ప్రాజెక్ట్ కోసం చైనా తన గూఢచారులని నియమిస్తుంది అని మోడీ తీస్తా ప్రాజెక్ట్ భారత్ కి ఇవ్వమని అడగడం హసీనా ఒప్పుకోవడం జరిగింది!

*********
అమెరికా, చైనాలకి ఆట బొమ్మ అయింది బంగ్లాదేశ్! ప్రధానిగా మొహమ్మద్ యూనిస్ ఉన్నా అమెరికా, బ్రిటన్ ల చేతిలో కీలుబొమ్మ అని అందరికీ తెలిసిందే! ఇప్పుడు పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు జరపాలి అని నకిలీ విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి!

మొహమ్మద్ యూనిస్ రాడికల్ ఇస్లాం సంఘాలని మంచి చేసుకోవాలని చూస్తున్నాడు, తద్వారా తాను ప్రాధాని పదవిని కాపాడుకోవాలి! దీని కోసం జమాతే – ఇ – ఇస్లామీ మీద ఉన్న నిషేధం రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇది భారత్ మీద ISI ప్రయోగించిన అస్త్రంగా భావించ వచ్చు!

జమాతే – ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంస్థ ఇస్లామీ చ్చాత్ర శిబిర్ మీద ఉన్న నిషేధం కూడా రద్దు చేశాడు యూనస్! ఆన్సర్ల్లాహ్ బంగ్లా టీమ్ – Ansarullah Bangla Team! ఇది అల్ ఖైదాకి బంగ్లాదేశ్ లో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపు. దీని మీద ఉన్న నిషేధం కూడా రద్దు చేసి దీని నాయకుడు జషిముద్దీన్ రహమాని ని జైలు నుండి విడుదల చేశాడు యూనస్!

వీటి ఎఫెక్ట్ వెంటనే కనపడింది! అవామీ లీగ్ నాయకుడు అయిన ఇషాక్ అలీ ఖాన్ పన్నా మృతదేహం బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో భారత్ భూభాగంలో ఉన్న వక్క తోటలో (Betel nut plantation ) కనుగొన్నారు. ఇషాక్ అలీ ఖాన్ పన్నాని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్( BGB ) కాల్చి చంపి ఉండవచ్చు అని భారత అధికారులు పేర్కొన్నారు. ఇషాక్ అలీ ఖాన్ పన్నా మృతదేహంని అతని కోటు జేబులో ఉన్న పాస్పోర్ట్ ఆధారంగా గుర్తించారు!

ఆఫ్ఘానిస్థాన్ లో చేసినట్లు బంగ్లాదేశ్ లో కూడా అవామీ లీగ్ పార్టీ నాయకులని చంపేసి… అక్కడ కేవలం BNP పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీలు మాత్రమే మనుగడలో ఉండేట్లుగా చేస్తున్నది CIA.

1990 లో ఆఫ్ఘనిస్తాన్ లో అప్పటి కమ్యూనిస్ట్ అధ్యక్షుడు అయిన మొహమ్మద్ నజీబుల్లాని బహిరంగంగా ఉరితీశారు ముజాహిదిన్ లు. అప్పటి వరకు కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ని రాజ్యాంగం మర్చి ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు.! ఇదంతా CIA, ISI లు కలిసి చేశాయి! అప్పటి వరకూ శక్తివంతమైన దేశంగా ఉన్న సోవియట్ యూనియన్ 10 ఏళ్ళ పాటు ఆఫ్ఘనిస్తాన్ లో నజీబుల్లా ప్రభుత్వాన్ని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో చివరికి కుప్ప కూలిపోయింది!

రెండు పోలికలు ఉన్నాయి……..
మొహమ్మద్ నజీబుల్లా భారత్ లో ఆశ్రయం కోరాడు. భారత ప్రభుత్వం అంగీకరించింది. కానీ కాబూల్ విమానాశ్రయం కి చేరుకునేలోపే ముజాహిదిన్ లు నజీబుల్లా కాన్వాయ్ ని చుట్టముట్టడంతో కాబూల్ లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచ్చింది. చివరికి అక్కడి నుండే ముజాహిదిన్లు నజీబుల్లాని బయటికి లాక్కొచ్చి ఉరి తీశారు!

షేక్ హసీనా విషయంలో CIA, ISI లు సాహసం చేయలేక పోయాయి. మోడీ చూస్తూ ఊరుకోడు అని తెలుసు. నిజానికి షేక్ హసీనాకి లండన్ కంటే న్యూ ఢిల్లీనే సురక్షితం!

********
జరగబోయేది ఇదే!
బంగ్లాదేశ్ లోని హిందువుల మీద దాడులు ఉద్తృతం చేస్తారు! మోడీ సైనిక చర్య తీసుకునేలా రెచ్చగొడతారు. మోడీ సైనిక చర్య తీసుకుంటే భారత్ విదేశీ పెట్టుబడులకి అనుకూలం కాదు అంటూ ప్రపంచ దేశాలలో ప్రచారం చేస్తారు. తద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాస్తా వెనక్కి వెళుతుంది!

పోనీ సైనిక చర్య తీసుకోకుండా ఉంటే బంగ్లాదేశ్ లో హిందువులని రక్షించలేని బీజేపీ ఎప్పటికీ హిందువులకి ప్రాతినిధ్యం వహించలేదు అని ప్రచారం చేస్తారు!

చివరగా…..
“ నా ప్రభుత్వం కూలిపోవడానికి రాహుల్ లండన్ లో రహస్య మంతనాలు చేశాడు “ అని షేక్ హసీనా ఇటీవలే ప్రకటించింది! CIA, ISI లు కలిసి భారత్ పక్కనే మరో ఆఫ్ఘనిస్తాన్ ని సృష్టించాయి! ……. (By పొట్లూరి పార్థసారథి )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions