ముందుగా ఒక వార్త చెప్పుకుందాం… బెంగుళూరులోని జేపీనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం (67) ఓ వ్యాపారి… తన ఇంట్లో పనిచేసే మహిళతో (35) తనకు వివాహేతర సంబంధం ఉంది… నవంబరు 16… సాయంత్రం అయిదు గంటలకు మనమడిని బ్యాడ్మింటన్ క్లాసుకు వదిలిపెట్టేందుకు బయటికి వచ్చాడు… అక్కడి నుంచి పనిమనిషి ఇంట్లోకి చేరుకున్నాడు… కాస్త లేటుగా వస్తానంటూ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫోన్ చేసి చెప్పాడు… ఇంకేం..?
ఆమెతో ‘ఆ సంబంధం’లో మునిగిపోయాడు… అర్ధరాత్రయినా సరే, ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులకు డౌటొచ్చింది… మొబైల్ కూడా స్విచాఫ్ అయిపోయింది… తరువాత పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు… విషయం ఏమిటంటే… సంభోగసమయంలో గుండెపోటు వచ్చింది… సివియర్ స్ట్రోక్… అక్కడికక్కడే ఆమెపైనే కుప్పకూలిపోయి, ప్రాణాలు వదిలాడు… ఆమె షాక్… పోతేపోయాడు గానీ, తమ సంబంధం బయటపడిపోతుందని భయం…
మొగుడికి, సోదరుడికి ఫోన్ చేసింది… మొగుడు ‘ఏం అర్థం చేసుకున్నాడో’ ఏమో తెలియదు… ముగ్గురూ కలిసి మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టారు… తీసుకుపోయి ఓ రోడ్డు పక్కన పడేశారు… నవంబరు17న పోలీసులకు గుర్తుతెలియని మృతదేహం సమాచారం వచ్చింది… నిన్నటి మిస్సింగ్ కేసు వివరాలు, ఈ గుర్తుతెలియని మృతదేహం వివరాలు కలిపితే తనే బాలసుబ్రమ్మణ్యం అని తేలింది… అందరినీ విచారిస్తూ పనిమనిషిని కూడా విచారించారు…
Ads
ఆమె జవాబులతో సందేహాలు పెరిగి, ఇంకాస్త ప్రెజర్ పెంచారు… దాంతో ఆమె మొత్తం బయటపెట్టేసింది… పట్టుబడతామనే భయంతో ఇలా చేశామని అంగీకరించింది… ఏదో నేరమని కాదు, తమ సంబంధం బయటపడుతుందని..! మృతదేహానికి పోస్ట్‌మార్టం, కేసు నమోదు చకచకా జరిగిపోయాయి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? వాళ్ల మీద ఏం కేసు పెట్టారు..? నిజంగా అరెస్టు చేయాల్సిన తీవ్రత వాళ్ల చర్యలో ఉందా..? కన్నడ, ఇంగ్లిషు, తెలుగు వార్తలు ఎన్ని చదివినా ఆ వివరాలు లేవు…
వాళ్లే హతమార్చి, గుండెపోటు అని నిందితులు చెబుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారా..? అలాంటప్పుడు విచారణ జరిపి, ఆధారాలు దొరికితే కదా అప్పుడు కదా అరెస్టు చేయాలి, ఆ సెక్షన్లు పెట్టాలి… పైగా పోలీసులే సంభోగసమయంలోనే గుండెపోటు, గత ఏడాది అతనికి ఆంజియో కూడా జరిగింది అని మీడియాకు చెప్పారు… మరిక ఆమెపై నేరమేమిటి..?
ఆల్‌రెడీ 67 ఏళ్ల వయస్సు, గత ఏడాదే యాంజియో జరిగింది… చాలా ఏళ్లుగా ఆమెతో సంబంధం ఉంటే ఉండవచ్చుగాక… మళ్లీ ఈ రిస్క్ తీసుకున్నది, నిజానికి ఆమెను ఈ చిక్కుల్లో ఇరికించింది ఆ వ్యాపారి..? ఆమెను ఓ నేరస్థురాలిగా చూడటం బేసబబు అనిపిస్తోంది… పోనీ, మృతదేహాన్ని పారేయడం నేరమా..? అది పెద్ద నేరమేమీ కాదు… అది భయంతో చేసిన పని… అక్రమ సంబంధం నేరమా..? అదసలు నేరమే కాదని సుప్రీం ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది, అదేమీ కోర్టులో నిలవదు… మరి వెంటనే అరెస్టులు దేనికి..?
Share this Article