.
Pardha Saradhi Potluri …… మోడీని గద్దె దించాలి -part 1
మోడీని ప్రధాని పదవి నుండి దించే వరకూ ఇల్యూమినాటి వదలదు!
మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మోడీ విషయంలో వ్యతిరేకంగా ఉంది, అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యూఎల్ మాక్రాన్ మోడీకి మద్దతుగా గట్టిగా నిలబడుతున్నారు!
జార్జియా మెలోని ఇటలీని ముస్లిం వలసదారులతో నింపడానికి సిద్ధంగా లేదు. తన ఎన్నికల ప్రచారంలో ఏదైతో ప్రజలకి హామీ ఇచ్చిందో వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తూ వస్తున్నది. అఫ్కోర్స్! మోడీని రోల్ మోడల్ గా తీసుకొని పనిచేస్తున్నాను అని బహిరంగంగానే చెప్తున్నది. రష్యా, ఉక్రెయిన్ విషయంలో నేరుగా జోక్యం చేసుకొని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం లేదు.
Ads
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అమెరికా వత్తిడి ఉన్నా అమెరికన్ F/A-18 కారియర్ బెస్డ్ ఫైటర్ జెట్స్ కాదని రాఫెల్-M జెట్స్ కొనడానికి ఒప్పందం చేసుకోవడం వెనుక మోడీ ఫ్రాన్స్ పట్ల చూపిన ధృఢమైన విశ్వాసం, ఎలాంటి జాప్యం లేని పేమెంట్స్ అనేవి మాక్రాన్ ని భారత్ వైపు ఉండేలా చేశాయి.
యూరోపియన్ యూనియన్ సెక్రటరీ మార్క్ రుట్టే ( Mark Rutte) మాత్రం ట్రంప్ వర్గం వైపు ఉండి భారత్ కి చికాకులు సృష్టిస్తున్నాడు! మార్క్ రుట్టే ని EAM జై శంకర్ ఎదుర్కుంటూ వస్తున్నారు!
ఇల్యూమినాటికి యూరోపు అండలేకుండా చేసుకున్నారు! జస్ట్! మీ భద్రత మీదే అమెరికాకి సంబంధం లేదు, కావాలంటే అమెరికా నుండి ఆయుధాలు కొనండి అని ట్రంప్ చేత చెప్పించడం వెనుక ఇక మీదట యూరోపు తమకి పనికిరాదు అనే నిర్ణయానికి రావడమే!
ఇల్యూమినాటికి ఆసియాలో ప్రధాన అడ్డంకి చైనా జీ జిన్జ్పింగ్, భారత్ నుండి మోడీ!
జీ జిన్జ్పింగ్ కి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి 10 ఏళ్ళు అవుతున్నా అవి సఫలం అవడంలేదు!
అదే మోడీ విషయానికి వస్తే ఇల్యూమినాటికి భారత్ లో ప్రతిపక్షాలు ఉన్నాయి తమ తరుపున పనిచేయడానికి.
*************
ఇల్యూమినాటి ( Illuminati ) అంటే ఏమిటీ?
ఇల్యూమినాటి అనేది బహువచనం. ఇల్యూమినాటస్ ( Illuminatus) అనే లాటిన్ పదానికి ఇంగ్లీష్ రూపాంతరం. ఇల్యూమినాటి అంటే ఒక సమూహంలో ఉండే వ్యక్తుల యొక్క పేరు లేదా సొసైటీ!
ఇల్యూమినాటి అనే పదం 15వ శతాబ్దం నుండి వాడుకలో ఉంది!
అయితే మొదటిసారిగా 1776 లో ఆడం విషప్ ( Adam Weishaupt) బవేరియా ( జెర్మనీ) లో బవేరియన్ ఇల్యూమినాటిని స్థాపించాడు.
బవేరియన్ ఇల్యూమినాటిలో యూరోపులోని ప్రముఖ రచయితలు, సిద్ధాంతకర్తలు సభ్యులుగా ఉండేవారు. అయితే వీళ్ళ పనులు చాలా రహస్యంగా ఉండేవి, అలాగే సీక్రెట్ కోడ్ తో సమాచారం ఇచ్చి పుచ్చుకునేవారు.
బవేరియన్ ఇల్యూమినాటి సొసైటీ వ్యవహారాలు రహస్యంగా ఉండడం చేత 1785 లో అప్పటి బవేరియన్ ప్రభుత్వం ఆ సంస్థని నిషేధించింది.
- అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇల్యూమినాటి అంటే అదొక ఊహ మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు, లేదు లేదు అప్పటి నుండి ఇప్పటివరకు ఇల్యూమినాటి యాక్టీవ్ గానే ఉంది అనే వాళ్ళు ఉన్నారు!
అఫ్కోర్స్! ఇల్యూమినాటికి మత పట్టింపులు అనేవి ఉండవంటూనే మూలాలు వాటికన్ తో ముడిపడి ఉన్నాయాంటారు! మొదటి ఆదేశం వాటికన్ నుండే వస్తుందంటారు!
ఆదేశాలు అమలు అయ్యే క్రమం ఇలా ఉంటుంది….
వాటికన్ ➡️ఇల్యూమినాటి➡️డీప్ స్టేట్ ➡️అమెరికా అధ్యక్షుడు. ఇల్యూమినాటిని డీప్ డీప్ స్టేట్ అని పిలవడం మొదలుపెట్టారు ఇటీవలే!
డీప్ స్టేట్ అంటే అమెరికన్ ఆయుధ, ఫార్మా, ఆర్ధిక ( wall street) సంస్థలతో కూడినది.
అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా అతను లేక ఆమె కేవలం తోలు బొమ్మలు మాత్రమే!
ఇల్యూమినాటి అనే సమూహం రహస్యంగా ఉంటుంది తప్పితే ఎవరి పేర్లు బయటికి వినిపించవు లేదా వ్యక్తులు కనిపించరు. ఎలాంటి ఇంటర్వ్యూ లు ఉండవు, మీడియాలో ప్రస్తావన ఉండదు. ప్రపంచంలోని 90% మీడియా అది ప్రింట్, ఎలెక్ట్రానిక్, సోషల్ మీడియా ఈ ఇల్యూమినాటి చేతిలో ఉన్నాయి. అందుకే ఎలాంటి ప్రచారము ఉండదు, వాళ్లకి అవసరం కూడా లేదు.
ఇదే ఇల్యూమినాటికి చెందినవే ప్రతీ రోజూ ఉదయం లేవగానే వాడే బ్రష్, టూత్పేస్ట్, సబ్బుల దగ్గర నుండి విమానాలు, ఆటోమొబైల్, ఔషధాలు, ఆయుధాలు, ఇతర అవసరాలని తీర్చేవి వీళ్ళ చెప్పుచేతల్లో ఉంటాయి.
రష్యా, చైనాకి చెందినవి ఈ సమూహంలోకి రావు.
అలా అని ఇల్యూమినాటి కమ్యూనిస్టులకి వ్యతిరేకం కాదు!
ఇదే ఇల్యూమినాటి రష్యన్ జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడడానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దానిని అమలుచేయడానికి జోసెఫ్ స్టాలిన్ కి నిధులు సమకూర్చింది!
బోల్షవిక్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం ఇలా పెద్ద లిస్టే ఉంటుంది ఇల్యూమినాటి నిధులు అందించి రాచరిక వ్యవస్థ ని కూల్చడానికి చేసిన ప్రయత్నాలు.
So! కమ్యూనిజం, సోషలిజం, ప్రజాస్వామ్యం లాంటి పదాలని వాడి ప్రభుత్వాలని కూల్చడం అనేది ఇల్యూమినాటి చలువే! అసలు పేర్లు ఎప్పటికీ బయటికి రావు!
ఇల్యూమినాటికి వ్యతిరేకంగా పనిచేస్తే చివరికి అమెరికా అధ్యక్షుడిని కూడా హత్య చేయగలదు! జాన్ f కెన్నడీ హత్య ఒక ఉదాహరణ. ఒక పాలస్టీనా మద్దతుదారుడు జాన్ F కెన్నడిని హత్య చేసినట్లుగా బయటి ప్రపంచానికి తెలుసు! అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడిని ఒకే ఒక వ్యక్తి హత్యచేయగలడా?
ప్రజలు సుఖంగా జీవించడానికి అవసరం అయ్యే ఆహార పదార్ధాలు, వైద్య చికిత్స, మందులు, దేశ రక్షణకి అవసరం అయ్యే ఆయుధాలు, ఎలెక్ట్రీకల్, ఎలక్ట్రానిక్, వైద్య చికిత్సకి అవసరం అయ్యే అధునాతన పరికరాలు, ప్రజలకి సమాచారం ఇచ్చే మీడియా, వ్యవసాయ ఎరువులు, పురుగు మందులు, చీడ పీడ పురుగులని సృష్టించే మందులు ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద జాబితా ఉంటుంది ఇల్యూమినాటి అదుపులో ఉండేవి!
Well, మరి డబ్బు సంగతి ఏమిటీ?
ప్రపంచంలో అన్ని దేశాలలో జరిగే ఆర్ధిక లావాదేవీలలో 70% ఇల్యూమినాటి చేతిలో జరుగుతూ ఉంటాయి.
ఇల్యూమినాటి ప్రపంచ ఆర్ధిక లావాదేవీలని కంట్రోల్ చేస్తూ ఉండడమే కాదు స్వయంగా పెట్టుబడులు పెడుతూ బీద దేశాన్ని ధనికదేశంగా మార్చగలదు లేదా ధనిక దేశాన్ని బీద దేశాంగా మార్చగలదు.
ప్రపంచ కుబేరుడిని బీదవాడిగా మార్చగలదు, బీదవాడిని కుబేరుడిగా మార్చగలదు!
స్టాక్ మార్కెట్ అది ఏ దేశంది అయినా సరే ఇల్యూ మినాటి పెట్టుబడులు ఉంటాయి!
స్టాక్ మార్కెట్ లో లాభాల స్వీకరణ అనేది పెద్ద అబద్ధం!
అది సంస్థాగత పెట్టుబడిదారులకి మాత్రమే నిజం!
సంస్థాగత పెట్టుబడి దారుల పేర్లు బయటికిరావు!
Master Card, Visa Card లతో పాటు అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగేది SWIFT సిస్టమ్ ద్వారానే!
SWIFT సిస్టమ్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు?
G10 దేశాలకి చెందిన సెంట్రల్ బ్యాంకులు.
Swift సిస్టమ్ ఆపరేట్ అయ్యేది బెల్జీయంలో కాబట్టి నేషనల్ బ్యాంకు అఫ్ బెల్జియం (NBB) కి SWIFT లావాదేవీల మీద పట్టు ఉంటుంది. సహజంగానే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కి కూడా SWIFT మీద పట్టు ఉంటుంది.
మరి SWIFT కి యజమాని ఎవరు?
సహకార పధ్ధతి ( Co-operative) లో ప్రపంచ వ్యాప్తంగా ఉండే బాంకులు, ఆర్ధిక సంస్థలు swift కి యజమానులు.
అంతా బాగుంది కదా?
ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రపంచదేశాలు సభ్యులే కానీ ఇల్యూమినాటి మాటే చెల్లుబాటు అవుతుంది కానీ మిగతా దేశాల మాట చెల్లుబాటు అయిన ఉదంతాలు ఉన్నాయా?
ప్రతీ మూడు సంవత్సరాలకి ఒకసారి యాజమాన్య పధ్ధతిలో ఎవరు ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరుపుతారో వాళ్ళు తాత్కాలిక యజమానులు అవుతూ ఉంటారు. 2,000 లకి పైగా ఉన్న సభ్యులలో ఎవరు ఎవరి తరుపున ఎక్కువ లావాదేవీలు జరుపుతున్నారో తెలియని స్థితిలో యజమానులుగా ఉంటారు. రబ్రీ దేవి ముఖ్యమంత్రి కానీ నడిపేది లాలూ ప్రసాద్ యాదవ్! ఇక్కడ అయిదేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అక్కడ మూడేళ్ళకి ఒకేసారి పారదర్శకంగా యజమానులు మారుతూ ఉంటారు.
SWIFT ని ఎవరు రన్ చేస్తారు?
2,000 బ్యాంక్స్, ఆర్ధిక సంస్థల నుండి 25 మంది డైరెక్టర్స్ గా ఎన్నుకుంటే వాళ్ళు రన్ చేస్తారు.
ఇల్యూమినాటి వ్యూహం ఎలా ఉంటుంది అంటే ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ఉంటాయి కానీ అమెరికా, యూరోపు దేశాల మాట ప్రకారమే అన్నీ జరుగుతుంటాయి.
SWIFT సిస్టమ్ లో వివిధ దేశాల రిజర్వ్ బ్యాంక్స్ తో పాటు ప్రయివేట్ ఆర్ధిక సంస్థలు యజమానులుగా ఉంటారు కానీ అమెరికా, యూరోపు దేశాలదే ఆధిపత్యం! కంట్రోల్ చేసేది G-10 దేశాలే!
ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఎక్కువ నిధులు ఇచ్చేది అమెరికానే కానీ WHO కి అధిపతిగా వేరే దేశం వాళ్ళు ఉంటారు కానీ అమెరికా చెప్పినట్లు చేయాలి.
ఏ దేశంకి అన్నా ఋణం కావాలి అంటే ప్రైజ్ వాటర్ కూపర్ ( PWC) లాంటి సంస్థ చేత ఆడిటింగ్ చేయిస్తేనే IMF, ప్రపంచ బ్యాంక్ లేదా అమెరికా నుండి ఋణం దొరుకుతుంది. అంటే ప్రతీ దేశపు ఆర్ధిక స్థితి ఎలా ఉందో PWC లాంటి ఆడిటింగ్ సంస్థ ద్వారా అమెరికాకి తెలిసిపోతుంది.
ఇక ఏ దేశం ఏ దేశం నుండి ఏమేమి కొంటున్నది SWIFT సిస్టం ద్వారా డాలర్ కదలికలు తెలిసిపోతూ ఉంటుంది.
పెట్రో డాలర్ ద్వారా డాలర్ అంతర్జాతీయ మారక ద్రవ్యం అయేట్లుగా చేశారు కాబట్టి SWIFT సిస్టమ్ అవసరం ఏర్పడి, తద్వారా అన్ని దేశాల లావాదేవీలు తెలుసుకునే వీలు కలిగింది.
ALL ROADS LEAD TO ROME!
ఇది తరుచూ మనం వినే, మాట్లాడే వాక్యం!
అబ్బో, అన్ని దారులూ రోమ్ కే చేరుకుంటాయి అంటే చాలా గొప్పగా ఉంటుంది కదా?
కానీ నిజం ఏమిటో తెలిస్తే మనం ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని అనం!
జూలియస్ సీజర్ రోమ్ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలనుండి రోడ్లు వేయించి, వంతెనలు కట్టించి ఆ ప్రదేశాలనుండి డబ్బు దోచుకొని వచ్చి రోమ్ లోని వాటికన్ లో దాచేవాడు! అందుకే అల్ రోడ్స్ లీడ్ to రోమ్ అనే నానుడి పుట్టింది!
రోడ్లు వేసి, వంతెనలు కట్టి రోమ్ నగరానికి చేరుకునేట్లుగా చేశారు అని గొప్పలు చెప్పుకోవడం వెనుక దోచుకున్నది సులభంగా రవాణా చేసుకోవడానికే! బ్రిటీష్ వాళ్ళు రోడ్లు వేశారు, వంతెనలు కట్టారు, రైల్వే లైన్లు వేశారు అనేది కూడా దోచుకున్నది రవాణా చేయడానికే!
So! ఇల్యూమినాటి ఎలా పనిచేస్తుందో అర్ధం చేసుకువడానికే క్లుప్తంగా చెప్పడం జరిగింది.
ఇల్యూమినాటి ఎంత రహస్యంగా ఉంటుందో ఒక ఉదాహరణ అదీ ఇటీవలే జరిగిన సంఘటనతో ముడిపడిఉన్నది చెప్పి ముగించేస్తాను!
బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన యుద్ధవిమానాలు పూర్తిగా బ్రిటన్ ప్రభుత్వానికి చెందినవి కావు!
ముఖ్యంగా Royal Air Force ( RAF) కి చెందిన F-35 జెట్ ఫైటర్స్ లీజు లేదా అద్దె పధ్ధతిలో నడుపుతున్నది!
బ్రిటన్ కి చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ కి F-35 లని లీజుకి ఇచ్చేంత డబ్బు ఎవరికి ఉంటుంది?
లాక్ హీడ్ మార్టిన్? కాదు. F-35 లని తయారుచేసే లాక్ హీడ్ మార్టిన్ ( Lockheed Martin) అద్దెకు లేదా లీజుకి ఇవ్వదు, అమ్ముతుంది అదీ అమెరికా మిత్ర దేశాలకి మాత్రమే అమ్ముతుంది.
మరి బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి F-35 లని ఎవరు లీజుకి ఇచ్చారు?
వివరాలలోకి వెళితే మొత్తం 10 షెల్ కంపెనీలు కలిసి F-35 లని రాయల్ ఎయిర్ ఫోర్స్ కి లీజుకి ఇచ్చాయి. సదరు సంస్థలని షెల్ కంపెనీలు అని ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే వాటి వివరాలు గోప్యంగా ( classified) ఉంచబడ్డాయి.
ఈ 10 షెల్ కంపెనీలకి పెట్టుబడులు పెట్టింది కొన్ని రహస్య సంస్థలు అమెరికాలో ఉన్నాయి కానీ వివరాలు క్లాసిఫైడ్ గా ఉంచబడ్డాయి!
ఇల్యూమినాటి అంటేనే రహస్య సొసైటీ కదా!
బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేది లీజు పధ్ధతిలో యుద్ధవిమానాలు నడుపుతున్నది అంటే లీజు డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నట్లు? లాక్ హీడ్ మార్టిన్ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ అయిన డీప్ స్టేట్ లో భాగం అంటే డీప్ స్టేట్ ➡️ఇల్యూమినాటి కి అలాగే ఇల్యూమినాటి➡️డీప్ స్టేట్ కి డబ్బు చేరుతున్నది. తయారిదారు, పెట్టుబడి పెట్టినవాళ్లు వేరు వేరుగా కనపడుతున్నా అంతా ఒకటే. లీజుకి ఇచ్చిన షెల్ కంపనీలు వాళ్ళవే! డబ్బు బ్రిటన్ టాక్స్ పేయర్స్ వి.
HIRE WITH APSRTC అని మనం చూస్తున్నాం కదా?
RAF F-35 లు HIRE WITH ఇల్యూమినాటి అన్నమాట!
నెల రోజులకి పైగా RAF F-35B తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో ఉండిపోవడానికి కారణం లీజు అగ్రిమెంట్ లో స్పష్టత లేకపోవడమే! లేకపోతే RAF స్వంత విమానం అయితే అలా వదిలేస్తుందా అన్ని రోజులు? ఆర్బీట్రేషన్ ప్రక్రియ పూర్తికావడానికి నెల రోజులు పట్టింది అన్నమాట!
ఇల్యూమినాటి ఎంత రహస్యంగా ఉంటుందో మరియు ఎంత ప్రమాదకారో తెలుసుకోవడానికి ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది!
No! There is nothing religious that attracts illuminati. Money and Power to rule the world with secrecy.
So! ఇల్యూమినాటి అనే రహస్య సొసైటీ మోడీని తీవ్రంగా వ్యతిరేకించడంలో అర్ధం ఉంది!
అన్నీ దారులూ రోమ్ నగరానికే!
అందరు నేరగాళ్లు, దోపిడీ దారులు లండన్ కే!
మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ దేశాల డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు తమ అక్రమ సంపాదనని లండన్ బాంకుల్లో దాచుకోవచ్చు, అక్కడే స్థిరపడిపోవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు, సైనిక జనరళ్ళు డాలర్లతో లండన్ పారిపోయి రాజకీయ శరణార్దిగా అక్కడ ఉండవచ్చు. ఎందుకంటే అక్రమ సంపద అక్కడి బాంకుల్లో ఉంటుంది కాబట్టి అక్కడి చట్టాలు వాళ్లకి రక్షణ కల్పించే విధంగా రూపొందించారు ముందు జాగ్రత్తగా!
CIBIL ఎవరిది? CIBIL ( Credit Information (Bureau) India Ltd) లో India ఉంది అని పొరపాటు పడకండి!
CIBIL మాతృ సంస్థ TransUnion అమెరికా!
ఒక అమెరికన్ గ్లోబల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ! ప్రయివేట్ సంస్థ అంతే కానీ భారత ప్రభుత్వ సంస్థ కాదు. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది!
మోడీ దగ్గర ఎలాంటి అక్రమ సంపద లేదు!
మోడీ భారత ప్రధానిగా ఉన్నంత కాలం తమ మనుగడ కష్టం అవుతుంది అని ఇప్పటికిప్పుడు నిర్ణయానికి రాలేదు. మోడీ రెండవ సారి ప్రధానిగా ఎన్నికైనప్పటి నుండి తన పధక రచన మొదలుపెట్టి అమలుచేస్తూ వస్తున్నది ఇల్యూమినాటి!
ప్రస్తుతం సర్వ శక్తులూ ఒడ్డి ప్రయత్నం చేస్తున్నది!
అవేమిటో తదుపరి భాగంలో తెలుసుకుందాం! Contd.. Part 2
Share this Article