Ramesh Adusumilli…. పేరుకు చివర్లో భారత్ అని తగిలించి ఒక కంపెనీ పెట్టిన అయిదు రోజులకే గచ్చిబౌలి వంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో క్రీడల అభివృద్ది పేరు చెప్పి, ఒకే ఆర్డినెన్సుతో 400 ఎకరాలు, మరో మూడు రోజులాగి మరో 450 ఎకరాలు కట్టబెట్టారు… కట్టబెడితే ప్రాబ్లం అని, అమ్మాం అన్నారు… సుమారు 5 కోట్ల వరకు ప్రభుత్వానికీ వచ్చాయట!
ఇంతటితో అవ్వలేదు, ఆ చుట్టుపక్కల ఉన్న స్టేడియంలు, ఇతర పార్కులు అన్నీ ఆ కంపెనీకే రాసిచ్ఛారు… ఊరికెనే కాదండోయ్… మరి ఇన్ని ఎకరాలు, ఇన్ని స్టేడియంలు మెయింటైన్ చేయటానికి ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని రాసి మరీ ఇచ్చారు… ఇంతేనా అని అనుకోకండి… మరి కంపెనీ అన్నాక ఆఫీసు ఉండాలిగా… దానికి కూడా జూబిలీ హిల్స్ లో అయిదు ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు…
మీరు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా… మూడేళ్ల పాటు వారు ఎటువంటి పన్నులు కట్టనవసరం లేదు, ఆఖరికి కరెంట్ బిల్లులు కూడా కట్టననవసరం లేదు.. అన్నీ ప్రభుత్వమే అదేనండి అంటే మనమే ప్రజలం భరిస్తాం అన్న మాట. చూసారా, మనకు ఎంత మంచి డీలో!
Ads
ఇంకొక్క మాట, ఇది సాదా సీదా కంపనీ కాదు, అమెరికాలో స్టేడియంలు అన్నీ ఈ కంపెనీనే కట్టింది… ఏదో మన ముఖ్యమంత్రిగారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి కేవలం ఆయన మీద ప్రేమతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయటానికి ఒప్పుకున్నారు అని అప్పట్లో చెప్పారు. అసలింత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం పని చేయనంత వేగంగా… ఒక్కరోజులో అన్ని డిపార్ట్మెంట్ లు (క్రీడా, సాంస్కృతిక, రెవెన్యూ, ..) చుట్టూ ఫైల్ తిరిగింది, అందరూ జాగ్రత్తగా పరిశీలించి, అనుమతులు కూడా ఇచ్చేశారు. ప్రజల కోసం ఒక ప్రభుత్వం ఎంత వేగంగా పని చేయగలదో కదా!
నిప్పు చంద్రబాబు గారు సాధించిన ఈ ఘనత చూసి కాంగ్రెసోళ్లకు కన్నుకుట్టింది… ఓర్వలేకపోయారు… ఇంత మంచి డీల్ ను వైఎస్సార్ రాగానే రద్దు చేసారు. అసలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఇటువంటి పనులు చేయటం ఏమిటి, దీని వెనకాల ఎన్ని కోట్లు చేతులు మారాయి, లెక్క తేలాలి అని cbi విచారణకు కూడా ఆదేశించారు.
అక్కడే వైఎస్సార్ గారి అమాయకత్వం బయటపడింది. సీబీఐ వాళ్లు మేము చాలా బిజీగా ఉన్నాం, ఈ కేసు విచారించే సమయం, వనరులు మా వద్ద లేవు అని చెప్తుందని ఆయన ఊహించలేక పోయారు. అలా ఆ కేసు 18 ఏళ్ల నుంచి నలిగి నలిగి చివరకు వైఎస్సార్ ప్రభుత్వం చేసినది సరైనదే, అసలు అమెరికాకు ఈ కంపెనీకి సంబంధం లేదు అని హై కోర్టు నేడు తీర్పు ఇస్తూ సీబీఐ విచారణ జరిపించమని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి ఒక వారం గడువు ఇచ్చింది. ఇక తర్వాత ఏమవుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను…
Share this Article