.
ఐపీఎల్ అంటేనే ఫిక్సింగులు, బెట్టింగుల మాయా ప్రపంచం కావచ్చుగాక… వడ్డేల్లో, ఐపీఎల్, టీ20 మ్యాచుల్లో ఇంతకుమించిన ఛేజింగు, థ్రిల్లింగు విజయాలు ఉండవచ్చుగాక… ఒక టీ20 మ్యాచులో లేదా ఐపీఎల్ మ్యాచులో ఒక క్రికెటర్ ఇంతకుమించి పరుగులు (ఒకే మ్యాచులో) చేసి ఉండవచ్చుగాక…
కానీ వాట్ ఏ మ్యాచ్… రాత్రి పంజాబ్, హైదరాబాద్ జట్ల నడుమ… కావ్య మారన్, ప్రీతి జింతా నడుమ జరిగిన మ్యాచ్ సూపర్బ్… ముందు ఆడిన పంజాబ్ ఏకంగా 246 పరుగుల టార్గెట్ పెడితే… పాయింట్ల టేబుల్‌లో కింద కొట్టుమిట్టాడుతూ అందరినీ నిరాశపరుస్తున్న హైదరాబాద్ ఒక్కసారిగా పుంజుకుని అంతటి భారీ టార్గెట్‌ను ఉఫ్ అని ఊదిపారేసింది… ఐపీఎల్ చరిత్రలో రెండో అతి పెద్ద ఛేజింగు…
Ads
దాదాపు ఒక్కో బంతికి రెండు పరుగులు… జోక్ కాదు… బౌలర్లకు చుక్కలు చూపించింది మ్యాచ్… ఫాఫం షమీ… చెత్తా రికార్డును మూటగట్టుకున్నాడు… రెండు జట్లు ఎడాపెడా బాదేస్తుంటే బౌలర్లు ఠారెత్తిపోయారు… ఈ మ్యాచుకు సంబంధించి ఎందుకు చెప్పుకోవడం అంటే..? అభిషేక్ శర్మ…!
దేశీయ క్రికెట్‌లో పంజాబ్‌కు ఆడతాడు… ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టులో ఉన్నాడు… ఈ మ్యాచులో 55 బాల్స్‌కు 141 రన్స్ చేశాడు… ఐపీఎల్ ఓ భారతీయ క్రికెటర్ అత్యధిక స్కోర్ ఇది… సరే, క్రిస్ గేల్, మెకల్లం, డికాక్ ఇంతకన్నా ఎక్కువ చేశారు… గేల్ ఏకంగా 175 దాకా చేసినట్టు గుర్తు… అది సునామీ…
ఇదే అభిషేక్ శర్మ గతంలో (లాస్ట్ ఫిబ్రవరి) ఇంగ్లండ్‌పై 135 రన్స్ చేశాడు… అందులో 13 సిక్సులు బాదాడు… నిన్న 10 సిక్సులు… విశేషం ఏమిటంటే… ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు అస్సలు బాగా ఆడటం లేదు… కారణాలు అనేకం ఉండొచ్చు… అధిక ధర పెట్టబడిన రేసుగుర్రం అభిషేకుడు కూడా ప్లాప్ అవుతున్నాడు…
తన మీద విమర్శలు వస్తున్నాయి… ఏమనుకున్నాడో ఏమో… ముందుగానే ఓ నోట్ రాసుకున్నాడు… This One is for Orange Army… జేబులో పెట్టుకున్నాడు… ఎదురుగా భారీ లక్ష్యం… ఐతేనేం, కాష్మోరా ఆవహించినట్టు దంచుతూనే ఉన్నాడు…
సెంచరీ కాగానే గ్లవ్స్, హెల్మెట్ తీసి పక్కన పెట్టి… జేబులో నుంచి ఆ నోట్ తీసి స్టేడియం నలువైపులా చూపించి… చూశారా, చెప్పి మరీ కొట్టాను అన్నట్టు ఫోజ్ పెట్టాడు… ఇంట్రస్టింగ్… ఓవరాక్షన్ అంటారా..?
సో వాట్… అది ఎక్సైట్‌మెంట్… అచ్చంగా ఈ మ్యాచ్ తన విజయం… ఆ సంబురాన్ని అలా చూపించుకున్నాడు… పర్లేదు… నిన్నటి మ్యాచులో నువ్వే తోపు బ్రదర్… ఎంజాయ్… కావ్య పాప కళ్లల్లో కాసిన్ని మెరుపులు కనిపించేలా చేశావు ఇన్నాళ్లకు ఈ సీజన్‌లో…!
Share this Article