Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!

November 4, 2025 by M S R

.

మీడియా ఎక్కడైనా అంతే… ఇండియా అయినా… అమెరికా అయినా..! గాసిప్పులకు ఇచ్చే ప్రాధాన్యం క్లారిఫికేషన్లకు ఇవ్వదు… మంట పెట్టి, పెట్రోల్ పోస్తుందే తప్ప… ఆ మంటలు ఆరిపోయాయనే అంశం దానికి అక్కర్లేదు.., సెలబ్రిటీల వార్తల్లో అయితే మరీనూ…

మూడో రోజులుగా అమెరికాలో, ఇండియాలో ఒకటే ప్రచారం… ఏమని..? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇండియన్ రూట్స్ ఉన్న ఆయన భార్య ఉష విడాకులు తీసుకోబోతున్నారు అని..! కానీ ఎందుకు..?

Ads

ఈ ప్రచారం ఎలా మొదలైందో చూద్దాం… రెండు వేర్వేరు ఘటనలు…

1) ఒక బహిరంగ కార్యక్రమంలో జేడీ వాన్స్ మాట్లాడుతూ, తన భార్య ఉషా హిందువు అయినప్పటికీ, ఆమె ఏదో ఒక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించాలని తాను ఆశిస్తున్నానన్నాడు… తనతో ప్రతి ఆదివారం చర్చికి కూడా వస్తున్నదనీ, తను కూడా క్రైస్తవ మతంలోకి వస్తుందనీ చెప్పాడు…

2) ఇటీవలే మరణించిన ఛార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌తో జేడీ వాన్స్ ఆలింగనం చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, న్యూయార్క్ టైమ్స్ రచయిత్రి షానన్ వాట్స్ వంటి వారు “వాన్స్ విడాకులు తీసుకుని, 2026 నాటికి ఎరికాను పెళ్లి చేసుకుంటారని” సంచలన వ్యాఖ్యలు చేశారు…

usha

ఈ రెండింటికీ ముడిపెట్టింది మీడియా… అదుగో ఉష మతంపై వాన్స్ విపరీత వ్యాఖ్యలు… ఇదుగో ఎరికాతో బహిరంగంగా గాఢాలింగనం… ప్లస్ మరణించిన తన భర్త పోలికలు వాన్స్‌లో కనిపిస్తున్నాయని ఎరికా వ్యాఖ్యలు… ఇవన్నీ కలిపేసి… దీనికి ఏకంగా రాబోయే అధ్యక్ష ఎన్నికల దాకా ముడిపెట్టేసింది మీడియా… ఎలాగంటే..?

అమెరికాలో నాన్ వైట్ జాతులపై ద్వేషం పెరుగుతోంది… ట్రంపు విధానాలు కూడా ప్రొ అమెరికా విపరీత పోకడలు… సో, ట్రంపు వైదొలిగాక, ఎలాగూ మూడోసారి అధ్యక్ష పదవికి చాన్స్ లేదు కాబట్టి, ట్రంపు వారసుడిగా వాన్స్ పోటీలో ఉంటాడని ఓ ప్రచారం…

ఆల్రెడీ అమెరికాలో రచయితలు, జర్నలిస్టులు నాన్ వైట్ ద్వేషాన్ని పెంచుతున్నారు… ఉష మతాన్ని కూడా ప్రస్తావిస్తూ ఎగదోస్తున్నారు… సో, నాన్ వైట్, నాన్ క్రిస్టియన్ ఉషకు విడాకులు ఇచ్చేసి, తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్లస్ తన కొత్త భాగస్వామి కోసం ఎరికాను పెళ్లి చేసుకుంటాడు అనేదాకా వెళ్లిపోయింది ప్రచారం…

erika

నిజానికి ఎరికాతో గాఢాలింగనం వంటివి అమెరికా సమాజంలో సర్వసాధారణం… అది అభిమాన వ్యక్తీకరణ, అంతే… అలాగే ఉష మతం మారాలనేది తన కోరిక అని వెల్లడించాడు… అదేమీ సీరియస్ వ్యాఖ్య కాదు… ఆమె మతం తనకు తెలియదా పెళ్లికి ముందు..? పెళ్లి తరువాత కూడా ఆమె ప్రాక్టీసింగ్ హిందూయే… కొడుక్కి కూడా హిందూ పేరే పెట్టుకుంది…

మొన్నామధ్య ఇండియాకు వచ్చినప్పుడు కూడా హిందూ అల్లుడిగా మెలిగాడు… పిల్లలకు ఇండియన్ దుస్తులు వేసి, ఒకటీరెండు గుళ్లు కూడా తిరిగాడు… తనకేమీ మతమౌఢ్యం లేదు… ఇన్నేళ్ల వాళ్ల సంసారంలో మతం ఎప్పుడూ పెద్దగా జోక్యం చేసుకోలేదు…

రాజకీయాల కోసం… నాన్ వైట్ ద్వేషం ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే… అంతకుమించిన తప్పుటడుగు మరొకటి ఉండదు… అమెరికాలో నాన్ వైట్, నాన్ క్రిస్టియన్ వోట్లు అపారం… వాళ్లను కాదనుకోలేడు, పైగా తనే అధ్యక్ష అభ్యర్థి అవుతాడనే నమ్మకమూ లేదు…

usha

ఈ విడాకుల ప్రచారం ఎక్కడి దాకా పోయిందీ అంటే… హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ అంశంపై స్పందిస్తూ… అమెరికాకు పునాదిగా ఉన్న భావనల్లో మతస్వేచ్ఛ కూడా ఒకటి… అది హిందువులకూ వర్తిస్తుంది…’ అని వాన్స్‌కు సూచించింది…

ఇవన్నీ ఎటెటో దారితీస్తున్నాయని గ్రహించిన జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగానే స్పందించాడు… ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు… ‘‘విడాకులు తీసుకుంటున్నామనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు… ఆమె నా భార్య… మా వైవాహిక జీవితంలో ఎలాంటి విభేదాలు లేవు…

usha

ఉష నా జీవితంలో దొరికిన అత్యంత అద్భుతమైన ఆశీర్వాదం… సంవత్సరాల క్రితం నన్ను తిరిగి మత విశ్వాసంలోకి వచ్చేలా ప్రోత్సహించింది కూడా ఆమెనే… ఉషా క్రైస్తవురాలు కాదు, మతం మారే ఆలోచన కూడా ఆమెకు లేదు… ఆమె ఇష్టాన్ని నేను గౌరవిస్తాను… ఏదేమైనా, నేను ఆమెను ప్రేమిస్తూ, మద్దతు ఇస్తూనే ఉంటాను, ఎందుకంటే ఆమె నా భార్య…” అని క్లారిటీ ఇచ్చాడు… ఈ ప్రకటన మెచ్యూర్డ్…

ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే..? సెలబ్రిటీల సంసారాలు, బ్రేకప్పులు, సంబంధాలపై ప్రపంచవ్యాప్తంగా గాసిప్స్ వస్తూనే ఉంటాయి… కాకపోతే ఇక రేపో మాపో విడాకులు తప్పవు అన్నంత బలంగా ప్రచారాలు చేసిన సెక్షన్… వాన్స్ క్లారిటీని మాత్రం పట్టించుకోకపోవడం..! అందుకే చెప్పింది, మీడియా ఎక్కడైనా మీడియాయే… అమెరికా అయినా, ఇండియా అయినా… సేమ్ సేమ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జస్టిస్ సూర్యకాంత్..! కొత్త సుప్రీంకోర్టు సీజేఐ కొన్ని కీలక తీర్పులు ఇవీ..!!
  • ఆ ట్రంప్ కొడుకే వచ్చాడు అతిథిగా… అంగరంగ వైభవం ఓ తెలుగు పెళ్లి…
  • ఊపిరి పీల్చుకోవడానికి మరో విజ్ఞప్తి… ముగ్గురు సీఎంలకు మరో అభ్యర్థన…
  • ‘పవర్’… ఎప్పుడు వాడాలో తెలియాలి… వదిలేయడమూ తెలియాలి…
  • పోటీ… పోటీ…! ఫుడ్, రవాణా, కిరాణం, ఇతర డెలివరీల్లో పోటాపోటీ..!!
  • బీఫ్..! ఇండియా నుంచి ఎగుమతులు – రాజకీయాలు – నిజాలు..!!
  • పేలిపోయిన తేజస్..! ఎవరు బాధ్యులు..? ఏం చేయాలి మనం..? (పార్ట్-3)
  • ఫైనల్ సెల్యూట్…! మనసుల్ని ద్రవింపజేసే ఓ విషాద దృశ్యం..!!
  • తేజస్ ఎందుకు పేలిపోయిందో తెలుసా..? ఇవీ కారణాలు..!! పార్ట్-2
  • తేజస్ కుప్పకూలి, పేలిపోవడం వెనుక పైలట్ తప్పుందా..? పార్ట్-1

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions