Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

MaViGun..! అర్థం కాలేదా..? ఏపీ రాజధాని అట… జగన్ కొత్త ప్లాన్..!!

April 1, 2026 by M S R

.

‘‘మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మాత్రమే ఎందుకు..? చీరాలను కూడా కలిపేసి… మావిచిగురు అని కారిడార్ డిక్లేర్ చేయమని అడిగితే బాగుండేది కదా’’…. ఇదీ ఓ మిత్రుడి సెటైర్ జగన్ మీద… ఎందుకు..?

అమరావతి రాజధానికి చట్టబద్ధత కోసం, మొన్న ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఈరోజు పార్లమెంటులో ఏపీ పునర్య్వస్థీకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు… పాసయింది… అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే వైసీపీ సహకరించలేదు… నాకౌట్… అంటే, అమరావతి రాజధానికి ఈరోజుకూ మేం వ్యతిరేకమే అని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన ధోరణిని ప్రకటించుకుంది…

Ads

ఐతే… రాజధాని విషయంలో జగన్ పాలసీ ఎప్పుడూ స్ట్రెయిటుగా లేదు, ఫెయిర్‌గా లేదు… దూరం నుంచి, అంటే ఏపీ పాలిటిక్స్ నుంచి దూరం నుంచి చూసేవాడికి అర్థమయ్యేది అదే… గతంలో అమరావతి వోకే అన్నాడు, తను అధికారంలోకి రాగానే కమ్మరావతి అని ముద్రలేసి, మూడు రాజధానులు అని ప్రకటించి, అమరావతిలో అప్పటిదాకా జరిగిన యాక్టివిటీని పండబెట్టి, పఢావుబెట్టి నిర్వీర్యం చేశాడు…

ఇప్పటికీ అదే ధోరణి… ఏందయ్యా అంటే… MA (మచిలీపట్నం), VI (విజయవాడ), (Gun)  అంటే… మావిగన్ అని ఓ 110 కిలోమీటర్ల కారిడార్ ప్రకటించాలట… (మావిగం అనాలా..? మావిగన్ అనాలా..?) సరే, ఏదో ఒకటి అందాం సరే గానీ… నీ విజన్ అదే అయినప్పుడు మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దీన్ని అమల్లోకి తీసుకురాలేదు..?

ఇప్పుడైనా సరే… అమరావతి పేరిట మరో 30, 35 వేల ఎకరాల్ని పూలింగ్ చేయాలనే ఆలోచన, అవినీతి, అడ్డదిడ్డంగా కేటాయింపుల్ని ఎత్తిచూపాల్సింది… ఎస్, ఇప్పటికీ జగన్ అమరావతికి వ్యతిరేకే… పార్లమెంటులో చట్టం చేశారు, ఇక జగన్ ఏమీ చేయలేడు అనేదీ నిజం కాదు… తన అప్పర్ హ్యాండ్ రేప్పొద్దున వస్తే… సవరణ బిల్లు మరో సవరణకు తలొగ్గదా..? తను రుషికొండలో కట్టుకున్న ప్యాలెస్ స్వాధీనం చేసుకుని, అక్కడే తిష్ట వేస్తే… అదే రాజధాని గాకుండా పోదు, తనేమీ వదిలిపెట్టడు…

అయితే ఇక్కడ రాజధానిపై తన ధోరణే ప్రశ్నార్థకం… తను అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ మూడు రాజధానుల విషయంలో ఏమైనా దూకుడుగా ముందుకు వెళ్లాడా..? లేదు…! ఈలోపు జనం మరీ పదకొండుకు పరిమితం చేశారు… అంటే, ఒకరకంగా ఏపీ ప్రజలు అనేకానేక పాలనాంశాలతోపాటు రాజధానిపై జగన్ ధోరణిని తిరస్కరించినట్టే లెక్క…

ఆల్రెడీ మావిగన్ (మావిగుం?) ప్రపోజల్ మీద, ప్లాన్ బీ అనే సూచన మీద, జగన్ వ్యాఖ్యల మీద నెటిజనం ట్రోల్ చేస్తున్నారు… కానీ ఒక్కమాట నిజం… ఒక రాష్ట్రానికి రాజధాని ఏమిటో నిర్ణయించుకునే అధికారం ఆ రాష్ట్రానిదే… అదే అంటున్నాడు జగన్… కరెక్టే, కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాళ్లే ఈమేరకు అమరావతియే రాజధాని అని తీర్మానించారు… కేంద్రం ఆమోదించింది…

రాజ్యాంగ ప్రకారం అది వేలిడా కాదానేది వేరే విషయం… కాకపోతే ఏకంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ద్వారా పార్లమెంటు ఆమోదించిందీ అంటే, దానికి ఖచ్చితంగా ఓ వాల్యూ ఉంటుంది… దాన్ని మళ్లీ జగన్ గనుక అధికారంలోకి వచ్చినా సరే, వెనక్కి తిప్పడం అంత సులభం అయితే కాదు… ఆ నిజం జగన్‌కూ తెలుసు… కానీ తనెప్పుడూ అమరావతి మీద తన వ్యతిరేకతను దాచుకోలేదు, ఇప్పుడూ అంతే, దాచుకోవడం లేదు..!!

ఐతే రాజధానికి ఇక మోక్షం దొరికినట్టేనా..? చంద్రబాబు చెబుతున్నట్టు హైదరాబాద్‌ను దాటేస్తుందా..? నెవ్వర్… అంత ఈజీ కాదు, హైదరాబాద్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది, లైఫ్ ఉంది, కల్చర్ ఉంది, మెల్లిమెల్లిగా పెరిగి విశ్వనగరంగా మారింది… అమరావతి ఆ రేంజ్ కు ఎదగాలంటే దశాబ్దాలు పడుతుంది…

గతంలో తన హయాంలో తను అరకొరగా, రాజధాని పనులు చేసి, గ్రాఫిక్స్ బొమ్మలతో కథ నడిపించిన తీరు అక్కడ జనానికి తెలుసు కదా… అందుకే ఫస్ట్ ఫేజ్ పూలింగ్ రైతులూ ఆందోళనలు చేస్తున్నారు, సెకండ్ ఫేజ్ రైతుల్లో 10 శాతం కూడా భూములివ్వడానికి ముందుకు రావడం లేదు… ఇది రియాలిటీ..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • MaViGun..! అర్థం కాలేదా..? ఏపీ రాజధాని అట… జగన్ కొత్త ప్లాన్..!!
  • పాపం, ఇటలీ గుండె పగిలింది… ఎందుకో తెలుసా..?
  • ట్రంపు పుణ్యాన పులిరాజాకు మళ్లీ ఎయిడ్స్ ముప్పు..?!
  • హైదరాబాదీ రాజసం..! ఎవరు ఈ రియా పిళ్లై..? ఎందుకు మళ్లీ వార్తల్లోకి..!?
  • పొదుపు వేరు- పిసినారితనం వేరు… శృతిమించితే పెళ్లామే వదిలేస్తుంది…
  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!
  • ఓ లయబులిటీ..! KCR వదిలించుకుంటే కాంగ్రెస్ నెత్తిన మోస్తోంది..!!
  • మన సుబ్రహ్మణ్యానికి మలయాళీలు చూపిన అరుదైన గౌరవం..!!
  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions