ఒక మహిళ వక్షోజం బొమ్మను గనుక చూపిస్తే…. ఒక పిల్లాడికి అమ్మ స్తన్యం గుర్తురావొచ్చు… ఒక యువకుడిని శృంగార భావనలు చుట్టుముట్టవచ్చు… ఓ డాక్టర్‌కు బ్రెస్ట్ కేన్సర్, ఒక బట్టల వ్యాపారికి ఆమె బ్రా సైజు, ఓ ప్లాస్టిక్ సర్జన్‌కు ఆ షేపులో సరిచేయాల్సిన అంశాలు…. రకరకాలు… చూసే వ్యక్తుల భావనాస్థితిని బట్టి…! మన చూపుల్ని బట్టి కాదు, బుర్రలో ఉన్న ఆలోచనల్ని బట్టి ఒకే చిత్రం వేర్వేరుగా కనిపించవచ్చు… పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టే… ముంబైకి చెందిన నాజ్ పటేల్ అనే మహిళా కార్యకర్త ఒకామెకు మింత్ర అనే ఓ ప్రఖ్యాత ఆన్లైన్ కామర్స్ సంస్థ లోగో అసభ్యంగా కనిపించింది… పద్నాలుగేళ్లుగా ఆ లోగోలో ఎవరికీ అసభ్యత కనిపించలేదు… అసలు ఆ లోగోలో ఆమె ఊహిస్తున్న అసభ్యత, అశ్లీలం ఎవరికీ అనిపించలేదు… మరి ఆమెకే ఎందుకలా కనిపించింది..? పైగా ఆన్లైన్ కామర్స్ వాడికి అసలు అసభ్య లోగో అవసరం ఏముంటుంది…? నో, అవన్నీ ఆలోచిస్తే ఎన్జీవోలు అనిపించుకోబడవు… లేనిపోని తీట వివాదాల్ని క్రియేట్ చేస్తేనే మనం ఉద్యమ కార్యకర్తలం… మనకు మెదళ్లు లేకపోయినా సరే, ఎదుటి వాడి మెదడుకు పొల్యూట్ చేసిపారేయాలి… వీలయితే దండుకోవాలి…
ఇదీ తాజా వివాదం… చూశారుగా, ఫస్ట్ మింత్ర లోగో… ఆ ముంబై కార్యకర్త మహారాష్ట్ర సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది… ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలనీ, ఆ లోగో తొలగించాలని డిమాండ్… సోషల్ మీడియాలో కూడా మింత్ర మీద ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు… ఎందుకొచ్చిన పెంట అనుకుని సదరు సంస్థ ఆశ్చర్యకరంగా లోగోను మార్చేసుకుంది… నిజంగా హాశ్చర్యం… ఆమె ఆ లోగో మీద పెట్టిన అభ్యంతరం ఏమిటీ అంటే..? ఆ లోగో మహిళల పరువు తీసేలా ఉంది అని…! అది చూసేవాడి దృష్టిని బట్టి ఉంటుంది… పద్నాలుగేళ్లుగా ఆ లోగో విస్తృత ప్రచారంలో ఉంది… మరి ఎవరూ ఆ లోగోలో అసభ్యాన్ని, అశ్లీలాన్ని దర్శించలేదు… సదరు మహిళా కార్యకర్తకు కూడా ఇన్నేళ్లు కనిపించలేదు… ఇప్పుడు అకస్మాత్తుగా అందులో ఓ మహిళ కనిపించిందట… ఇవీ మన ఉద్యమాలు, మన మనోభావాలు, మన హక్కులు, మన కార్యాచరణ… థూమీబచె…
Ads
నిజానికి మింత్ర వంటి సంస్థలే భయపడితే ఎలా..? వణికేకొద్దీ ట్రోలింగ్ పెరుగుతుంది… లైట్ తీసుకుంటే ఒకేరోజులో సద్దుమణుగుతుంది… సోవాట్..? కొందరు నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తే ఏమవుతుంది..? పైగా అందులో అసభ్యత ఏముందని..? సైబర్ క్రైం వాళ్లు చేయగలిగేది ఏముంది..? అయితే ఈ మింత్ర వాడికి గతంలో ఇలాంటి ఓ చేదు అనుభవం ఉంది… అందుకే అనవసర వివాదం ఎందుకులే అనుకుని లోగోనే మార్చేశాడు… వాస్తవానికి ఓ తలతిక్క ఫిర్యాదుకు, ఆరోపణకు భయపడి అంత పెద్ద సంస్థ తన లోగోను మార్చడం విచిత్రమే… ఆ పాత కథ ఏమిటంటే..? నాలుగైదేళ్ల క్రితం అదేదో పిచ్చి సైటులో ఓ కార్టూన్ వచ్చింది… అది మింత్ర మార్కెటింగ్ యాడ్… దుశ్శాసనుడు ద్రౌపది చీరెలు లాగుతుంటే, అక్కడికి వచ్చిన కృష్ణుడు తన ఫోన్లో మింత్ర యాప్ ఓపెన్ చేసి, ఎక్స్ట్రా లార్జ్ సారీ కోసం సెర్చ్ చేస్తుంటాడు… దాంతో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నయ్… ట్విట్టర్లో భారీ క్యాంపెయన్ స్టార్టయింది… సారీ చెప్పింది సంస్థ… సద్దుమణిగింది… అప్పుడు కనీసం మహాభారతాన్ని వెకిలి చేసిందనే విమర్శ ఉంది… కానీ ఇప్పుడు ఆ లోగోలో ఏ వివాదమూ లేదు…
తెల్లారిలేస్తే ఆడదాని శరీరభాగాలను ప్రదర్శించే పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, సినిమాలు, టీవీలు, సైట్లు, ఓటీటీలు…. ఎక్కడ చూసినా అసభ్యత, అశ్లీలం బరిబాతల నర్తిస్తున్నాయి కదా… సదరు ముంబై మహిళా కార్యకర్తకు ఆ మింత్ర లోగోలోనే అదేదో వెకిలి ఫోజు కనిపించిందా..? నెటిజనం నిజానికి ఇలాగే స్పందించారు… మింత్ర అనవసరంగా భయపడింది కానీ నెటిజనం మింత్ర పట్ల వ్యతిరేకంగా ఏమీ పోలేదు… పైగా ఈ లోగో మార్చుకున్న తీరునే వెక్కిరిస్తున్నారు అందరూ… ఇంత పిరికివాడివి, దందా ఏం చేస్తావోయ్ అన్నట్టుగా మీమ్స్, పోస్టులు వైరల్ అయిపోతున్నయ్… ఓ మగపుంగవుడు అమెజాన్ లోగోను ముందుపెట్టి మరి మేమేం చేయాలి అనడిగాడు… ఆ లోగోలో అది మగ మర్మాంగ సింబల్ అనేది తన ఒపీనియన్… కానీ అది ఏటూజెడ్ అని చెప్పడానికి ఉద్దేశించిన ఓ క్రియేటివ్ యారో… రాను రాను w, x, m లెటర్స్‌ను కూడా తప్పుపడతారేమో… అంతెందుకు..? జీమెయిల్ లోగో చూశారా..? అది కూడా మింత్ర టైపే… కలర్ కాంబినేషన్ సహా… హేమిటో ఈ వివాదాలు..? ప్రస్తుతం మనోభావాలు అనేది మంచి దందా అయిపోయింది…!! నిజంగా బూతునే చూడాలనుకుంటే… మరి ఇవన్నీ అంతే కదా… ఇంకా ఘోరంగా..?!
Share this Article