.
పసిఫిక్ సముద్రంలో line islands … అక్కడే పక్కన baker islands… నడుమ 2000 km దూరం…
కానీ ఆ ద్వీపాల వాసుల గడియారాల్లో తేడా ఎంతో తెలుసా..? 26 గంటలు…
అంటే, ఒకరోజుకన్నా రెండు గంటలు ఎక్కువ తేడా… ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే… Line islands లో ఈరోజు ఉదయమే కొత్త సంవత్సరం వస్తే… Baker islands లో 26 గంటల తర్వాత వస్తుంది…
అర్థం అయ్యింది కదా… కాలానికి మనం గీసుకున్న గీతలు, మన ఉత్సవాలు ఎంత absurd అని..!! రకరకాల టైమ్ జోన్స్… ఒక ద్వీపవాసి ఆల్రెడీ రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలికి, విందులు చేసుకుంటే… ఆ పక్కనే ఉన్న మరో ద్వీపవాసి ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు…
Ads
మన పంచాంగం ప్రకారం, మన తెలుగు తిథుల ప్రకారం… ఉగాది రోజును మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకోవాలనీ, ఈ ఆంగ్ల సంవత్సరాల గోల మనకేల అనే పోస్టులు ప్రతి ఏటా వస్తూనే ఉంటాయి… జనం వాటిని చూసి వదిలేస్తూనే ఉంటారు…
దేనికదే… జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటే ఉగాది పండుగ జరుపుకోవద్దని ఉందా..? ప్రపంచంలో వేల రకాల కేలండర్లు… మన దేశంలోనే బోలెడు… పైగా చంద్రుడి గతిని బట్టి ఒక రీతి… సూర్యుడి పయనాన్ని బట్టి మరో రీతి… మరి ఏ కేలండర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి ప్రపంచం..? ప్రస్తుతానికి ప్రపంచం దాదాపుగా గ్రెగొరియన్ కేలండర్‌నే పాటిస్తోంది… జగంతోపాటు మనం…
రోజు మారుతుంది… సంవత్సరం మారుతుంది… ఈ మార్పు వల్ల మన జీవితాలు ఏమీ మారవు… ఐనా… జీవనపయనంలో ఒక క్షణం అలా ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడానికి… సమీక్షించుకోవడానికి… సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ కాల సందర్భం… దానికి ఇంతగా మథనాలు అవసరమా..?
ముందే చెప్పుకున్నాం కదా… ఆ జపాన్‌లో వాడు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికితే, ఇటు అమెరికా వాడు ఇంకా ఎదురుచూస్తూనే ఉంటాడు… ఆ కొత్త సంవత్సరం కోసం… నూతన సంవత్సరం ఇదుగో అని తేల్చిచెప్పే ఆ ప్రామాణిక క్షణమేమీ ఉండదు…
సో… విందులు, మందులు, చిందులు, ముగ్గులు, బాణాసంచా, హంగామా… ఒక సెలబ్రేషన్… అంతే, అంతకుమించి ఈ అనంత కాల ప్రవాహంలో కొత్త సంవత్సరానికి ఉన్న విశిష్ట విలువ ఏమీ లేదు… ఈ రోజులు, ఈ నెలలు, ఈ సంవత్సరాలు మనం గీసుకున్న విభజన గీతలు మాత్రమే… సమయం లెక్కింపునకు ఓ సౌలభ్యం కోసం మాత్రమే… కొత్త అంకె మాత్రమే… కొత్త మార్పు కాదు..!!
Share this Article