గుర్తుందా..? పదేళ్ల క్రితం… కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా హతమార్చిన తీరు… అప్పటికే తన ఖచ్చితమైన జాడ తెలుసుకోవడానికి కోట్ల డాలర్లు ఖర్చు చేసింది అమెరికా… చివరకు ఆచూకీ దొరికింది… ఎక్కడో కాదు, పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడు… అవును మరి, అది టెర్రరిస్టుల హబ్ కదా… ఆ దేశంలో టెర్రరిజం పుడుతుంది, ఎదుగుతుంది, విస్తరిస్తుంది, ఆపరేషన్లు చేస్తుంది, ఆశ్రయం పొందుతుంది… వాట్ నాట్..?
రాడార్ల నిఘాకు అందని స్టెల్త్ ఛాపర్లు… అఫ్ఘనిస్థాన్ వైపు నుంచి… చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నాయి… వాటిల్లో అమెరికన్ నేవీ సీల్స్ కమెండోలు… ఒక వెల్ ట్రెయిన్డ్ డాగ్… ఆ రెండు హెలికాప్టర్లు లాడెన్ దాగి ఉన్న భవనం చేరుకుని, ఒకటేమో పై నుంచి కమెండోలను జారవిడిచింది… మరొకటి భవనం ముందు ఎగురుతూ ఇంకోవైపు నుంచి దాడికి కమెండోలను దింపింది… అనూహ్యమైన ఈ దాడిని ఎవరూ ఊహించలేదు అక్కడ… ఆయుధాలు అందుకునే టైం కూడా లేదు… కమెండోల తుపాకులు గర్జించాయి… లాడెన్‌తోపాటు మరికొందరూ మరణించారు… ఆపరేషన్ ఓవర్…
పదేళ్ల తరువాత… అదే లాడెన్ వారసుడు… అల్ జవహరి… అంతే నొటోరియస్… అమెరికాకు ఆచూకీ చిక్కితే కదా… ముసలోడు అయిపోయాడు, అప్పుడెప్పుడో చచ్చిపోయాడు అని మధ్యమధ్యలో వార్తలు వచ్చేవి… అవన్నీ నమ్మితే అది అమెరికా ఎందుకు అవుతుంది..? కాకపోతే ప్రపంచంలో ఎవ్వడు ఏ మూల ఉన్నా సరే ఇట్టే కనిపెడతాం, ఖతం చేస్తాం అనేంత సీన్ లేదు దానికి… సరే, ఎట్టకేలకు ఈ జవహరి ఆచూకీ దొరికింది… అప్ఘనిస్థాన్‌లో ఉంటున్నాడు…
Ads
పర్‌ఫెక్ట్‌గా లొకేషన్ ఐడెంటిఫై చేశారు… ఈసారి అమెరికన్ నేవీ సీల్స్, కమెండో ఆపరేషన్ వంటి కథలేవీ లేవు… ఇలాంటి ఆపరేషన్లలో వాళ్లను పోగొట్టుకోవడం కూడా అమెరికాకు ఇష్టం లేదు… అది కొన్నేళ్లుగా నింజా బాంబ్, r9x హెల్‌పైర్, ఫ్లయింగ్ జిన్సు… ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఓ అధునాతన మిసైల్‌ను డెవలప్ చేసింది… ఇప్పుడు జవహరి మీద ప్రయోగించింది వాటినే…
ఈ మిసైళ్లను డ్రోన్ల ద్వారా ప్రయోగించవచ్చు… అంతెందుకు..? భూతలం మీద యుద్ధవాహనాల ద్వారా కూడా ప్రయోగించవచ్చు… పోర్టబుల్ మిసైల్‌ను కూడా డెవలప్ చేస్తున్నారు… ఇప్పుడు అమెరికా డ్రోన్ల ద్వారా ఈ నింజా బాంబ్స్ ప్రయోగించింది… వీటి విశేషం ఏమిటంటే..? పేలుడు పదార్థం ఉండదు… ఆరు పవర్‌ఫుల్ బ్లేడ్స్ ఉంటాయి… ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి, వదిలేస్తే సరి… సరిగ్గా ఆ టార్గెట్ వెంటపడుతుంది… మీదపడుతుంది… టార్గెట్ కారులో ఉంటే కారు పైభాగం తొలుచుకుని మరీ ఈ మిసైల్ టార్గెట్‌ను ఛిద్రం చేస్తుంది… చీల్చేస్తుంది…
చప్పుడు ఉండదు, కాస్త దూరంలో ఉన్నవారికి కూడా ప్రాణహాని ఉండదు… సైలెంట్ ఆపరేషన్… నిజానికి ఇప్పుడు జవహరి మీదే కాదు… ఇంతకుముందు ఇదే అల్ ఖైదాకు చెందిన మరో నొటోరియస్ గ్రూపు ఉగ్రవాదనేత అబూ యాహ్యాను గత ఏడాది మట్టుబెట్టింది… అల్ ఖైదా నేత అల్ మస్రి, తాలిబన్ నేత మొహబుల్లాలను కూడా 2017లోనే ఇదేతరహా మిసైళ్లతో మట్టుబెట్టిందని అంటారు… కమెండోలు, విమానాలు, చాపర్లు ఎట్సెట్రా ఏమీ లేవు… సరైన డ్రోన్లు, వాటికి బిగించిన నింజా బాంబ్స్, టార్గెట్ ఖచ్చితమైన ఉనికి… ఇవి ఉంటే చాలు… రాబోయే రోజుల్లో ఉగ్రవాద కీలకనేతల నిర్మూలన ఇలాగే ఉండబోతోంది… మోడీ, రాజనాథ్‌సింగ్, అజిత్ ధోవల్… అర్థమవుతోందా..?!
అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం రావడంతో అల్ జవహరి కాస్త నిశ్చింతగా ఉంటున్నాడు… అమెరికన్ బలగాలన్నీ వెళ్లిపోయాయి… కాబూల్ దగ్గర ఓ ఇల్లు తీసుకుని మొదట ఫ్యామిలీని పంపించాడు… తరువాత తనూ అక్కడ చేరాడు… రోజూ బంగ్లాపైన ఆరుబయట ఎండలో కాసేపు ఉండటం జవహరి అలవాటు… ఆ టైం, ఆ జియోగ్రాఫిక్ లొకేషన్ అన్నీ సరిచూసుకుని, టార్గెట్ ఫిక్స్ చేసి, అమెరికన్ డ్రోన్లు అప్ఘనిస్థాన్‌లోనే ఆపరేషన్ చాలా సింపుల్‌గా, సైలెంటుగా ముగించడం ఓ విశేషమే… 9/11 దాడులకు ప్రతీకారం కోణంలో జవహరి హత్య ఖచ్చితంగా అమెరికా అహానికి ఎనలేని సంతృప్తి…!!
Share this Article