Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ప్రాచీన శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాల సాయుధ ఘర్షణ..!!

July 24, 2025 by M S R

.

Srini Journalist ….. ఒక హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధం కోసం సిద్దమౌతున్నాయి … ఇప్పటికే రాకెట్ లాంచర్ల నుంచి మిస్సైల్స్ వెలువడుతున్నాయి … F16 లాంటి యుద్ధ విమానాలతో దాడులు కూడా మొదలయ్యాయి …

ఇవన్నీ ఒక హిందూ దేవాలయం కోసం… కంబోడియా, థాయిలాండ్ దేశాల బోర్డర్స్ లో ఉంది ప్రిహ విహియర్ గుడి… (Preah Vihear ) … ఇది యునెస్కో గుర్తించిన శివాలయం … డాన్గ్రేక్ పర్వతంపై ఉంటుంది…

Ads

అద్భుతమైన శిల్ప సౌందర్యం గల గుడి … 1962 లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ శివ టెంపుల్ కాంప్లెక్స్ కంబోడియాకు చెందుతుంది అని తీర్పు ఇచ్చింది . 11 వ శతాబ్దానికి చెందిన ఈ గుడిని ఖైమర్ రాజులు నిర్మించారు…. సూర్యవర్మన్-1, సూర్యవర్మన్-2 నిర్మించి విస్తరించారని చెబుతారు…

రెండు దేశాలకు ఇప్పుడు ఈ గుడి నేషనల్ ప్రైడ్ … 2008 లో కంబోడియా ఈ గుడిని యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిచడంతో , ఆ గుడి చుట్టూ ఉన్న స్థలం తనదని థాయిలాండ్ చెప్పడంతో అప్పటిదాకా నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా బయటపడింది…

మధ్యలో అప్పుడప్పుడు జరిగిన ఘర్షణల్లో వందల్లో ఇరు వైపులా చనిపోయారు … ఈ రోజు మొదలయిన భీకర పోరు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి … థాయిలాండ్ తన సరిహద్దు చెక్‌పోస్ట్‌లన్నింటినీ మూసివేసింది.., దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది… కంబోడియా కూడా థాయిలాండ్ రాయబారిని బహిష్కరించి, తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది…

చారిత్రక ఖైమర్ సామ్రాజ్య సరిహద్దుల ఆధారంగా కంబోడియా ఈ ఆలయ సముదాయాన్ని తమదని వాదిస్తుంది. అయితే థాయిలాండ్ మాత్రం ఇది తమ సూరిన్ ప్రావిన్స్‌లో ఉందని పేర్కొంటుంది… ఈ వివాదం 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఉంది…

ఈ ఏడాది ఫిబ్రవరిలో, కంబోడియా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి, తమ జాతీయ గీతాన్ని పాడుతూ అక్కడ మోహరించిన థాయ్ బలగాలను సవాలు చేశాయి… ఏప్రిల్ నాటికి ఒక సంధి కుదిరింది… కానీ తాజా ఘర్షణలు ఈ ఉద్రిక్తతలను మళ్లీ పెంచాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions