.
కాదేమో.., అందరూ రాస్తున్నట్టు… సోషల్ మీడియాకు కొన్నాళ్లు పూర్తిగా దూరంగా ఉండాలని టీవీ యాంకర్ రష్మి గౌతమ్ తీసుకున్న నిర్ణయం కేవలం డిజిటల్ డిటాక్స్ కాకపోవచ్చు… ఇంకేదో ఉంది…
ఆమెకు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో పాపులారిటీ ఎక్కువ… మరో పాపులర్ టీవీ స్టార్ సుడిగాలి సుధీర్ జోడీగా బోలెడు వార్తలు, స్కిట్లు పదేళ్లుగా వస్తున్నవే కాబట్టి… అందుకే అందరికీ ఆసక్తి దీనిపై… కేవలం ఆమె ఓ పోస్టు పెట్టింది…
Ads
‘‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను… దీనికి తోడు సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులను వినే ఓపిక, తీరిక నాకు లేదు… అందుకే నేను, నెల రోజుల పాటు సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను… అయితే నేను మళ్లీ బలంగా, ధైర్యంగా తిరిగి వస్తానని హామీ ఇస్తున్నాను… ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది…
నా శక్తిని నేను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది… దానికి మీ డిజిటల్ ప్రోత్సాహం అవసరం లేదు… నా ఆత్మవిశ్వాసంతో దాన్ని సాధించగలను… నా దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని నేనెప్పుడూ కోల్పోలేదు… అదెప్పుడూ నా దగ్గరే ఉంది… అయితే ఎక్కడో ఓ చోట నేను కృంగిపోతున్నా…
అందుకే పూర్తిగా పరిష్కారం కనుక్కోవాల్సిన సమయం ఆసన్నమైంది… నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా మీ ప్రోత్సాహం, ప్రేమ, సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను…’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది రష్మి గౌతమ్…
డిజిటల్ మీడియాలో ఆమెకు కనిపించే సలహాలు, సూచనలతో చిర్రెత్తి ఉండవచ్చుగాక… సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఓ తప్పనిసరి అవసరమే కావచ్చుగాక… కానీ కొన్నాళ్లు మనశ్శాంతి కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని అభినందిద్దాం… ఎందుకంటే, అది చాలామందికి చేతకాదు గనుక… ఈరోజుల్లో డిజిటల్ డిటాక్స్ అందరికీ ఓ అవసరమే గనుక…
కానీ వ్యక్తిగత, వృత్తిగత ఇబ్బందుల్ని ప్రస్తావిస్తున్నది ఆమె… ఈటీవీ ఆస్థాన యాంకర్ ఆమె… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను హోస్ట్ చేస్తుంది… బయట మరే టీవీలకూ షోలు చేయదు, స్పెషల్ షోలలో కూడా పాల్గొనదు… కంఫర్ట్ విత్ టూ షోస్… పైగా వైతరిణి అనే సినిమాను కూడా అంగీకరించింది… హారర్ సినిమా కావచ్చు…
సో, వృత్తిపరంగా ఆమెకు పెద్ద ప్రాబ్లమ్ ఉన్నట్టు అనిపించదు… ఏమో, ఉన్నాయేమో కూడా..! ఇక వ్యక్తిగతానికి వస్తే, ఎస్, ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి… కొన్నాళ్ల క్రితం సమస్యగా మారిన యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ సర్జరీ చేయించుకుంది…
ఆ విషయాన్ని కూడా ఆమె సోషల్ మీడియాలో చెప్పుకుంది కూడా… (ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల పీరియడ్స్ రోజుల్లోనే గాకుండా ఇతర రోజుల్లోనూ రక్తస్రావం, రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పడిపోవడం, నీరసం, బరువు తగ్గడం ఎట్సెట్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి…)
వయస్సు 37 ఏళ్లు… పెళ్లి కాలేదని అంటారు… ఒడియా రూట్స్ ఉన్న విశాఖ మహిళ ఆమె… మొదట్లో చాలా కష్టాలు పడినా తరువాత టీవీ ఫీల్డులో నిలదొక్కుకుంది… డబ్బు అధిక సంపాదన కోసం, అవకాశాల కోసం పెద్దగా వెంపర్లాడే కేరక్టర్ కూడా కాదంటారు మరి…!!
Share this Article