.
సమంత..! వివాదాలు, విషాదాలు… అక్కినేని నాగచైతన్యకు విడాకులు కొంతకాలం క్రితం రోజూ వార్తాంశం… మయోసైటిస్ అనే వ్యాధితో బాధింపబడం ఓ విషాదం… ఆమధ్య కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరో వివాదం…
మొత్తానికి ఎప్పుడూ సమంత వార్తల తెర మీదే ఉంటోంది… సురేఖ వ్యాఖ్యల తరువాత కూడా ఆచితూచి, చాలా పరిణతితో స్పందించింది… తన జీవన శైలి చాలామందికి నచ్చకపోవచ్చు… అవన్నీ అలా వదిలేస్తే… ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆమె ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె తత్వాన్ని వెల్లడిస్తున్నాయి…
Ads
తను చైతూతో వివాహ బంధాన్ని తెంచుకోవడానికి బోలెడు వేర్వేరు కారణాలు, బయటికి తెలియనివి ఏవేవో ఉండవచ్చు గాక… కానీ ఇప్పుడు ఆమె చెబుతున్న తన తత్వం, జీవన దృక్పథం కూడా ఓ కారణమేనేమో… ఆమె ఏమన్నదంటే..?
‘‘సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదు… ప్రయత్నించడం ముఖ్యమే… కానీ గెలిస్తేనే సక్సెస్ కాదు… అవార్డులు, రివార్డులు, ఇవేనా సక్సెస్ అంటే… కాదు, మనకు నచ్చినట్టు జీవించడం, జీవించగలగడమే నిజమైన సక్సెస్…
నా జీవితంలో నాకు నచ్చినట్లు బతకాలని అనుకుంటాను. నియమ నిబంధనలు నాకు నచ్చవు. నాకు ఇష్టమైన రంగంలో రాణించాలన్నదే నా కోరిక. ఆడపిల్ల కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆంక్షలు విధిస్తే నాకు నచ్చదు. జీవితంలో అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలనేదే నా లక్ష్యం”…
ఇవీ ఆమె వ్యాఖ్యలు… సక్సెస్ అంటే ఆమె చెప్పింది అక్షరసత్యం… సక్సెస్ అనేది అనేక అంశాల మీద ఆధారపడుతుంది… ఇక నచ్చినట్టు జీవించడం అంటే… అది అందరికీ సాధ్యం కాదు, నచ్చిన వృత్తిలో నచ్చినట్టు బతకడం అనేది ఈ రోజుల్లో అసాధ్యం…
అన్ని వృత్తులూ కడుపు నింపవు… కాకపోతే ఆంక్షలు, కట్టుబాట్లు, రూల్స్ నడుమ బతకడంకన్నా, కట్టేసినట్టు జీవించడంకన్నా స్వేచ్ఛగా బతకగలగడం సక్సెసే… కానీ అది అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది…
పెళ్లయ్యాక… ఆమె కొన్నాళ్లు సినిమాలు చేయలేదు… ఆహా ఓటీటీలో ఏదో చాట్ షో చేసింది… తన నటజీవితం ఇక సమాప్తమేనా అనే భావన ఆమెను కలవరానికి గురిచేసినట్టుంది… తను అలా ఓచోట కట్టేసినట్టు, అంటే బందీ అయిపోయినట్టుగా అక్కినేని కుటుంబంలో ఉండలేకపోయింది… తనకు స్వేచ్ఛ కావాలి, తను అనుకున్నది చేయగలగాలి… అందుకేనేమో చూసీ చూసీ వదిలేసింది…
తరువాత ఏదో వెబ్ సీరీస్‌లో బోల్డ్‌గా నటించింది కూడా… పుష్పలో ఒక ఐటం సాంగ్… వీటిని కూడా నచ్చినట్టు బతకడం కేటగిరీలో వేసుకుందేమో…!! కాకపోతే చైతూతో విడాకుల అనంతరం తన సినిమాలేవీ సక్సెస్ కాలేదు… సిటాడెల్ అని ఓ ఇంగ్లిష్ వెబ్ సీరీస్ చేసింది… పర్లేదు… రక్తబ్రహ్మాండ్ అనే సీరీస్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్ కోసం… అంతేకాదు…
తనే నిర్మాతగా మారింది ఇప్పుడు… శుభం అని ఓ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసింది… తనే వెల్లడించింది… ఒక దశలో టాప్ పెయిడ్, మస్తు గిరాకీ ఉన్న నటి తను… ఇప్పుడు ఓ మామూలు నటి… ఆమె చెప్పుకుంటున్న తీరును బట్టి తన జీవితం పట్ల, విజయాల పట్ల, కెరీర్ పట్ల నో రిగ్రెట్స్… బందిఖానా నుంచి బయటపడి స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు జీవించగలుగుతున్నాను కదా, ఇంతకు మించి సక్సెస్ ఏముంది, ఇది చాలు అనే భావన కనిపిస్తోంది ఆమె వ్యాఖ్యల్లో..!!
Share this Article