Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!

September 2, 2025 by M S R

.

మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఓ మాటన్నాడు… ‘కల్వకుండా చేసే కుటుంబది’… ఎవరిని అన్నాడు..? కేసీయార్ కుటుంబాన్ని..!

అంటే ఏమిటి..? ‘‘అది కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, కల్వకుండా చేసే కుటుంబం, బీసీలు ఓసీలు కలవొద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవొద్దు, హిందూ ముస్లింలు కలవొద్దు, ఎవరినీ కల్వకుండా చేసే కుటుంబం’’…

Ads

బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి… నిజానికి కల్వకుండా చేసేది కేసీయార్ కుటుంబమే కాదు… మరోరకంగా ‘‘కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి’’ కూడా… ఇదేమో పొలిటికల్ స్ట్రాటజీ… ఇంతకీ ఎవరిని కల్వకుండా చేస్తున్నాడు తను..?

revanth

అవును… కాళేశ్వరం బాల్‌ను బీజేపీ కోర్టులోకి వేసి భలే స్ట్రాటజీ ప్రదర్శించాడు… బీజేపీ, బీఆర్ఎస్ కల్వకుండా చేసే స్ట్రాటజీ అది… ఆల్రెడీ బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహితులు అనేది తెలిసిందే, కాంగ్రెస్ కూడా చాలాసార్లు ఆరోపణలు చేస్తూనే ఉంది… బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాల దాకా వార్తలు వెళ్లాయి కదా…

ఒకవేళ అది జరిగినా, పొత్తు కుదిరినా, అవగాహన కుదిరినా… స్థానిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు గానీ… గ్రేటర్ ఎన్నికల్లో, జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉండొచ్చు… నగరంలో బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి గత ఎన్నికల్లో… బీజేపీ కూడా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బాగా ఇంపాక్ట్ చూపించింది… సో, అవి కలవొద్దు…

కలవొద్దు అంటే… సీబీఐ సమగ్ర దర్యాప్తు పేరిట బాల్‌ను కేంద్రం కోర్టులోకి విసరడం… సీబీఐ దూకుడుగా వెళ్తే బీఆర్ఎస్‌కూ బీజేపీకి సఖ్యత కుదరదు… సీబీఐ  పట్టించుకోకుండా ఉంటే..? చూశారా, మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం, బీఆర్ఎస్, బీజేపీ దోస్తులేనని… అని ఇద్దరినీ టార్గెట్ చేయొచ్చు పొలిటికల్‌గా… సో, ఆ రెండింటినీ కల్వకుండా చేయడం ఈ స్ట్రాటజీ..!

cbi

ఆల్రెడీ కాళేశ్వరం మీద బీఆర్ఎస్‌ను, కేసీయార్‌ను ఎంత బదనాం చేయాలో అంతా చేసింది ప్రభుత్వం… తెలంగాణ సమాజంలో కేసీయార్‌ను ఓ నిందితుడిగా నిలబెట్టింది… ఇక ఇప్పుడు అదే ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం అంతిమ బడా లబ్దిదారు ఎవరో తేల్చాలని సీబీఐని అడుగుతుంది… అదెప్పుడు తేలుతుంది, అసలు తేలుతుందా అనేది కాలం చెబుతుంది…

ఇలాంటి కేసులు లాజికల్ కంక్లూజన్‌కు వచ్చేవి ఒకటీరెండు శాతమే కదా… అదీ కేంద్రం గట్టిగా పట్టు బిగిస్తే తప్ప..! సో, ఈ కోణాల్లో రేవంత్ రెడ్డి నిర్ణయం మాత్రం తెలివైన స్ట్రాటజీయే అనే అభిప్రాయాలు కూడా చాలామంది పొలిటికల్ అనలిస్టుల నుంచి వినిపిస్తోంది…!

అదీ ఎవరికీ ముందుగా తెలియకుండా… అందరూ సిట్ అనుకుంటున్న దశలో సీబీఐ నిర్ణయాన్ని హఠాత్తుగా అసెంబ్లీలోనే ప్రకటించేసి, ఇక ఎవరూ మాట్లాడకుండా చేశాడు, కాంగ్రెస్‌లోనే కొందరు షాక్… తను అప్పటికప్పుడు ట్రివేండ్రం వెళ్లి (ఏదో పుస్తకావిష్కరణ కోసం) కేసీ వేణుగోపాల్‌కు కూడా ప్లాన్ వివరించాకే, ఈ నిర్ణయం ప్రకటించడం, తెలివైన అడుగు… పార్టీ కోణంలో కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!
  • సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
  • ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
  • తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
  • మోడీపై అగ్గిమండుతున్న ట్రంపు… దేనికి..? విస్తుపోయే వివరాలివి..!!
  • నిశ్శబ్ద సాహచర్యం… ఉన్నన్నాళ్లూ ఆ ఉనికి విలువ తెలియదు..!!
  • సినిమా ఆటంటేనే ఓ లాటరీ… నష్టానికి సిద్ధపడే ఆట మొదలెట్టాలి…
  • పంచెలో ఉన్న భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి..!!
  • సాక్షాత్తూ కేసీయార్ బిడ్డే చెబుతోంది… కాళేశ్వరంలో అవినీతి నిజమేనని..!!
  • కితకితలు గీతాసింగ్… జోవియల్ సెల్ఫ్ పంచుల నడుమ కళ్లల్లో చెమ్మ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions