…….. By…. పార్ధసారధి పోట్లూరి…….. సోమవారం రోజున DRDO Supersonic Missile Assisted Torpedo (SMART) – సూపర్ సానిక్ మిసైల్ ఆసిస్టెడ్ టార్పేడోని విజయవంతంగా ప్రయోగించింది! ఇది రెండవ టెస్ట్ ఫైర్. మొదటిది గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రయోగించింది DRDO. ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలని పూర్తి చేసింది. సాంప్రదాయ టార్పెడోలు సముద్రం అడుగున ఉండే జలాంతర్గాముల నుండి ప్రయోగిస్తారు. ఈ టార్పేడోలు శత్రు జలాంతర్గాములు లేదా శత్రు దేశపు యుద్ద నౌకల మీదకి ప్రయోగిస్తారు. అలాగే యుద్ధ నౌకలయిన ఫ్రిగెట్, డిస్ట్రాయర్ ల నుండి సముద్రంలోకి ప్రయోగిస్తారు. అలాగే సముద్రం మీద ఎత్తులో ఎగురుతూ నీటి లోపల ఉన్న జలాంతర్గాములని పసి గట్టి వాటిని నాశనం చేస్తే P-8 పోసోడియన్ విమానాలు వాడతారు. ఇక హేలికాప్టర్లు కూడా చిన్న సైజు టార్పేడోలని ప్రయోగించగలవు. మరి ఈ SMART టార్పెడోలు ఎందుకు ?
మనకి విశాలమయిన సముద్రతీరం ఉంది. ఎటువైపు ఎక్కడ నుండి శత్రు జలాంతర్గాములు ప్రవేశిస్తాయో నిఘా పెట్టడం కష్టం. అలాగని మన నేవీ ఊరుకోదుగా. శత్రువు ఎక్కడ నుండి మన జలాలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందో ఆయా ప్రదేశాలలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు నిఘా పెడుతూ ఉంటాయి. ఒకవేళ కోస్ట్ గార్డ్ కనుక శత్రు సబ్ మెరైన్లను పసిగట్టినట్లయితే వెంటనే దగ్గరలోని నేవీ నౌకలకి సమాచారం ఇస్తాయి. అయితే అవి చాలా దూరంలో ఉండవచ్చు ఆ సమయానికి. అవి నిర్దేశిత ప్రదేశంలోకి వచ్చే లోపు శత్రు సబ్ మెరైన్ దాడి చేయవచ్చు లేదా తప్పించుకొని అంతర్జాతీయ జలాలోకి వెళ్లిపోవచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే SMART టార్పేడో అవసరం ఏర్పడుతుంది.
Ads
ఈ SMART టార్పేడోలని సముద్ర తీరానికి దగ్గలోనే మొహరిస్తారు. నిఘా హెలికాప్టర్ ఇచ్చిన GPS కో-ఆర్డినేషన్ సమాచారాన్ని ఆధారం చేసుకొని వెంటనే SMART ని ప్రయోగిస్తారు. దీని పేరే మిసైల్ అసిస్టేడ్ అంటే భూమి మీద నుండి క్యానిస్టర్ ద్వారా గాల్లోకి లేచి మినిమం 50 KM లేదా మాగ్జిమం 600 KM సూపర్ సానిక్ వేగం [గంటకి 2000 KM ] ప్రయాణించి శత్రు జలాంతర్గామి ఎక్కడ అయితే కనపడ్డదో ఆ ప్రదేశంలో మిసైల్ పారాచూట్ ద్వారా టార్పేడోని జార విడుస్తుంది. నీళ్ళలోకి వెళ్ళీ వెళ్ళగానే టార్పేడో తన సోనార్ సెన్సర్ ద్వారా సబ్ ని కనుక్కొని వెంటాడి ధ్వంసం చేస్తుంది. మొదటి ప్రయోగం చేసిన సంవత్సరం తరువాత DRDO ఈ రెండవ ప్రయోగం చేసింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా రష్యాల వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ క్లబ్ లోకి భారత్ చేరింది. వచ్చే సంవత్సరం అర్ధ భాగంలోపు సైన్యంలోకి ప్రవేశ పెడతారు . తరచూ మన జలాలోకి రహస్యంగా వచ్చి వెళ్తున్న చైనా సబ్ మెరైన్ ని దృష్టిలో పెట్టుకొనే ఈ SMART టార్పెడోలని అభివృద్ధి చేసింది DRDO! మరోసారి అభినందనలు DRDO కి…!
Share this Article