ఒకవైపు కశ్మీర్‌లో పండిట్లను కాల్చేస్తూనే ఉన్నారు… మరోవైపు ఖలిస్థానీవాదం ప్రాణం పోసుకుని, ఢిల్లీని ముట్టడించి, ఈమధ్య పంజాబ్‌లో అనుకూల ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకుంది… ఇంకోవైపు కొత్తగా ప్రత్యేక తమిళనాడు (ఈలం) కోరికలు బలాన్ని పెంచుకుంటున్నాయి… ఈ దేశం నుంచి విడిపోతారట… ప్రత్యేకంగా తమిళదేశం కావాలట… ఎవరో కాదు, అధికారంలో ఉన్న స్టాలిన్ అనుయాయులు, మిత్రులే గొంతెత్తుతున్నారు…
మొన్నటి జూలైలోనే రాజా అనబడే మాజీ కేంద్ర మంత్రి ‘‘ఇప్పటివరకూ మా ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నా బాటలో నడుస్తున్నాడు… మాకు గనుక స్వయంప్రతిపత్తి ఇవ్వకపోతే పెరియార్ మార్గంలోకి వెళ్లాల్సి వస్తుంది… మోడీకి ఇదే నా సూచన…’’ అని బహిరంగంగా హెచ్చరించాడు… (అంటే ద్రవిడనాడు పోరాటం అని సదరు రాజా అభిప్రాయం)… ఈ రాజా అంటే గుర్తుంది కదా… అప్పట్లో టెలికాం మంత్రి… వేల కోట్ల 2జీ స్కాంలో ప్రధాన నిందితుడు…
కరుణానిధి బిడ్డ కనిమొళి జైలుకు వెళ్లొచ్చింది కూడా ఇదే కేసులో… ఇప్పటికీ కేసు ఉంది… ఆ నీడ తొలగిపోలేదు… శశికళ మీద చూపించిన కక్షలో పైసా శాతం కూడా ఈ టూజీ స్కాం మీద చూపించలేదు మోడీ… వాళ్లేమో ఏకంగా ప్రత్యేక దేశం మాటలు మాట్లాడుతున్నారు… మళ్లీ వేరు పురుగు మెసులుతోంది… ఐనా మోడీ తమ ప్రత్యర్థి రాజకీయ కూటమి డీఎంకే పట్ల ఎందుకు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు..? అసలు మోడీకైనా తెలుసా..?
Ads
చివరకు దేశం నుంచి విడిపోతాం అనే డిమాండ్ ఎంత అలుసు అయిపోయిందంటే… చివరకు వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా చాన్స్ ఇవ్వకపోతే ‘‘సౌతిండియా ప్రత్యేకదేశం’’ అని సొల్లుతున్నారు కొందరు ఆంధ్రా జర్నలిస్టులు ప్లస్ మేధావులు… అఫ్‌కోర్స్, వాళ్లంతా చంద్రబాబు కొంగుబంగారాలు… మరోవైపు అదే చంద్రబాబు బాబ్బాబు, నా పాత తప్పులు కాయండి దొరా, నాతో మాట్లాడు దొరా, మళ్లీ కలుద్దాం దొరా, మళ్లీ వెన్నుపోటుకు మరో చాన్స్ ఇవ్వు దొరా అన్నట్టుగా మోడీ దగ్గరకు పైరవీలు చేయిస్తుంటాడు…
రాజా కోరుతున్న ప్రత్యేక ప్రతిపత్తి ఏమిటి స్టాలిన్..? మొన్నమొన్నటిదాకా కశ్మీర్‌కు ఉన్నట్టు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రధాని ఎట్సెట్రా కావాలా..? లేక మొత్తం దేశాన్నే చీల్చి ద్రవిడనాడు ఏర్పాటు చేయాలా..? (ద్రవిడనాడు అనగానే మేమూ కలిసొస్తాం అంటారేమో తెలుగు రాష్ట్రాల మందబుద్ధులు… తమిళ తంబీలు ఎవరినీ కలుపుకోరు… ఆ పక్కన మలయాళాన్నే సహించరు… ఇక తెలుగును, కన్నడాన్ని ఎందుకు సహిస్తారు..? వోన్లీ తమిళ్… అంతే…)
ఇప్పుడు తాజాగా ఇదే డీఎంకే కూటమి సభ్యపార్టీ విడుదలై చిరుతైగల్ కచ్చి… సింపుల్‌గా వీసీకే… ఈ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వన్ని అరసు అదే మాట అంటున్నాడు… ఎక్కడో బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘ప్రత్యేక తమిళదేశమే శరణ్యం… దానికోసం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పోరాడదాం, వచ్చే ఆగస్టు 17 వరకూ ఇక ఇదే ఉద్యమం…’’ అన్నాడు… సనాతన ధర్మ వ్యతిరేక పోరాటానికీ, ప్రత్యేక దేశ పోరాటానికీ లంకె ఏమిటి..? ఏమో, స్టాలిన్ మాత్రమే చెప్పాలి… ఎందుకు స్టాలిన్ చెప్పాలీ అంటే… రాజా తన పార్టీ కీలక నాయకుడు… వీసీకే తన మిత్రపార్టీ… అసెంబ్లీలో నాలుగు సీట్లలో గెలిచింది పార్టీ…
ఆల్‌రెడీ లోకసభలో కూడా ఓ సీటుంది దానికి… ఈ పార్టీలో మొదటి నుంచీ ఎల్టీటీఈ ప్రభాకరన్ ఆరాధకులు… సమర్థకులు… (అంతెందుకు, ఇదే డీఎంకే కూడా అంతేకదా…) శ్రీలంక సైన్యం, టైగర్ల నడుమ హోరాహోరీ నడుస్తున్న కాలంలో ఈ పార్టీ ఇతర పార్టీలను తోడేసుకుని Tamil Eelam Supporters Organization పేరిట ప్రదర్శనలు నిర్వహించింది… అలాగని ఇది అంత స్థిరంగా ఒకే కూటమికి అంటిపెట్టుకుని ఉండే రకమేమీ కాదు… ఇది చదవండి, అర్థమవుతుంది…
1) TMC : (VCK Party First Election 1999-2001)
2) DMK–BJP : (NDA) (2001-2004)
3) VCK – Makkal Koottani : (2004-2006)
4) AIADMK (Democratic People Alliance) : (2006-2009)
5) DMK–Congress (UPA) : (2009-2014) & (2017-2021)
6) DMK (DPA) : (2014-2015)
7) Makkal Nala Koottani (2015-2016)
8) DMK (SPA) : (2021-Present)
సో, తన పార్టీ రాజకీయ ధోరణి ఏమిటో, ఈ ప్రత్యేక దేశం డిమాండ్లేమిటో స్టాలిన్ వివరణ ఇచ్చుకోవాలి… స్థూలంగా డీఎంకే పొలిటికల్ లైన్ అదేనా..? చెప్పు బ్రదర్, ఏమీ కాదు, మోడీకి ఏమీ చేతకాదు… ఆదానీకి దోచిపెట్టడం మినహా… తన అదృష్టం కొద్దీ రాహుల్ అనే ఓ గ్రహం కాంగ్రెస్‌ను మింగేస్తూ మోడీని బలవంతుడిగా చూపిస్తోంది… చిన్న రాష్ట్రాలు అనే దిశలో మోడీ నుంచి వీసమెత్తు కదలిక లేదు… యోగీ గనుక ఈ దేశ హోం మంత్రిగా ఉండి ఉంటే కథ వేరే ఉండేది…!!
Share this Article