ఈమధ్య హిందూ ధర్మపరిరక్షక్ పాత్ర పోషిస్తున్న మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రాకు మరో కేసు దొరికింది… హిందూ దేవుళ్లు అనగానే రెచ్చిపోయి వెకిలి నవ్వులు, వ్యాఖ్యలకు దిగే సెలబ్రిటీలే ఆయనకు ఆ ఆస్కారం కల్పిస్తారన్నమాట… ఆమధ్య సన్నీలియోన్ గనుక క్షమాపణ చెప్పకపోతే మూడు రోజుల్లో లాక్కొచ్చి జైలులో పడేస్తా అని హెచ్చరించిన వార్త గుర్తుంది కదా… ఆయనే నరోత్తముడు… ఇప్పుడు తాజా ఏమిటంటే… శ్వేత తివారీ అనినలభయ్యేళ్ల వయస్సున్న ఓ టీవీ నటి… బిగ్‌బాస్ హిందీ నాలుగో సీజన్ విజేత… పదీపన్నెండేళ్ల క్రితం… ఓ వెబ్ సీరీస్ చేస్తోంది ఇప్పుడు… దాని ప్రమోషన్ కోసం భోపాల్‌లో ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు…
మీడియాను చూస్తే కొంతమందికి ఒళ్ల తెలియదు, కళ్లు కనిపించవు… శ్వేత కూడా ఆ బాపతే… ఆ ప్రెస్‌మీట్‌కు ఆమెతోపాటు ఇతర యాక్టర్లు సౌరభ్ రాజ్, కన్వల్జిత్, రోహిత్ రాయ్, దిగాంగన సూర్యవంశీ తదితరులూ హాజరయ్యారు… ఇందులో సౌరభ్ రాయ్ ఓ టీవీ మహాభారత్ సీరియల్లో కృష్ణుడి వేషం వేశాడు… ఈ వెబ్ సీరీస్‌లో బ్రాఫిట్టర్ వేషం వేస్తున్నాడు… సీరీస్ పేరు షోస్టాపర్… బ్రాఫిట్టర్ అనే వృత్తే మన దేశంలో అత్యంత అరుదు… మహిళల స్తనాల షేప్, సైజ్, కర్వ్ కొలిచి, దాన్ని బట్టి బ్రాలకు మార్పులు చేర్పులు చేసే వృత్తి…
హఠాత్తుగా ఓ విలేకరి ఓ ప్రశ్న వేశాడు… ‘‘మహాభారతంలో కృష్ణుడి వేషం వేసిన సౌరభ్ ఇందులో మరీ బ్రాఫిట్టర్ వేషం వేస్తున్నాడు, ఏమనిపిస్తోంది..?’’ ఇదీ ప్రశ్న… అది నిజానికి శ్వేత తివారీకి వేసిన ప్రశ్న కాదు, వేదిక మీద ఎవరు సమాధానం చెప్పినా సరే అనుకున్న ప్రశ్న… శ్వేత వెంటనే అందుకుని… ‘‘భగవంతుడు నా బ్రా సైజ్ తీసుకుంటున్నాడు’’ అని ఓ వెకిలి నవ్వుతో సమాధానం ఇచ్చింది… ఇదీ ఇప్పుడు వివాదంలోకి లాగింది ఆమెను…
Ads
‘‘అందరికీ ఈమధ్య హిందూ దేవుళ్లను వెక్కిరించడం ఓ అలవాటుగా మారింది, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అంటూ కొందరు ‘‘సంస్కృతీ బచావో మంచ్’’ సభ్యులు రోడ్డెక్కి ఆమె ఫోటోలను తగులబెట్టారు… అసలే ఇదంతా భోపాల్‌లో సాగుతున్నది… ఎక్కడెక్కడివో చూసి మరీ కేసులు పెట్టేద్దామని రెడీ అయిపోయే నరోత్తమ్‌కు ఇక తన అడ్డాలో జరిగిన ఈ కథ ఆకర్షించి ఉంటుంది కదా… పైగా కాంగ్రెసోళ్లు కూడా ఆమె మీద చర్య తీసుకోవాలని డిమాండ్లు మొదలుపెట్టారు… ఇక వెంటనే పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాడు… జస్ట్, 24 గంటల్లో నిజానిజాలేమిటో తనకు రిపోర్ట్ ఇవ్వాలనేది ఆ ఆదేశం… ఆ వీడియో చూస్తారా… ఇదుగో…
అసలు ఈ శ్వేత ఎవరు..? ఆమె వ్యక్తిగత జీవితం ఏమిటీ అని సెర్చితే… ఆమెదీ చాలామంది సెలబ్రిటీల కథే… 1998లో రాజా చౌదరి అనే నటుడిని పెళ్లిచేసుకుంది… 2000లో ఓ అమ్మాయి పుట్టింది… పాలక్ తివారీ… 2007 వచ్చేసరికి కథ మారిపోయింది… విడాకులకు అప్లయ్ చేసింది… అదేమంటే రోజూ ఫుల్లు తాగొచ్చి కొడుతున్నాడు అనేది కంప్లయింట్… ఆమె నటించే సెట్లలోకి వచ్చి అందరి ముందే గలీజుగా బిహేవ్ చేస్తున్నాడని ఆరోపించింది… ఆ కథ ముగిశాక మరో నటుడు అభినవ్ కోహ్లిని పెళ్లి చేసుకుంది 2013లో… అప్పటికే మూడేళ్లు డేటింగులో ఉన్నారు వాళ్లు… 2016లో ఓ అబ్బాయి పుట్టాడు… మళ్లీ అదే కథ… మూడేళ్ల తరువాత పోలీస్ కేసు పెట్టింది భర్త మీద… పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు… గృహహింస సెక్షన్లు పెట్టారు… తనను, తన బిడ్డను వేధిస్తున్నాడనేది ఆమె పెట్టిన కేసు… 2019లో ఆ పెళ్లీ పెటాకులైంది… ఇప్పుడు సింగిల్… అన్నట్టు ఆమె బిడ్డ కూడా నటి… ఈమధ్య సైఫ్ అలీ ఖాన్ కొడుకు, నటుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో తిరుగుతూ ముంబై మీడియాకు అప్పుడప్పుడూ వార్తాంశం అవుతుంటుంది..!!
Share this Article