.
ఎయిర్‌పోర్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌లో వెల్‌నెస్ ప్యాచ్ హైలైట్!
ఎప్పుడూ తన స్టైలిష్ లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించే నటి రకుల్ ప్రీత్ సింగ్, ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పాపరాజీ కెమెరాల్లో బంధించబడింది… ట్రావెల్ ఫ్యాషన్‌లో రకుల్ లుక్ చాలా సింపుల్ అయినా, అందరి కళ్ళూ ఒక చిన్న డీటైల్‌పై పడిపోయాయి…
Ads
హై పోనీటెయిల్‌లో మెరిసిన రకుల్ మెడపై ఒక ప్యాచ్ స్పష్టంగా కనిపించడంతో, ఫ్యాన్స్, మీడియా అందరూ ఆసక్తిగా గమనించారు… బాగా కుతూహలం కలిగించిన ఈ ప్యాచ్ నిజానికి ఒక వెల్‌నెస్ ప్రోడక్ట్ — “లైఫ్‌వేవ్ X39 స్టెమ్ సెల్ ప్యాచ్” అని నెటిజన్లు గుర్తించారు…
లైఫ్‌వేవ్ X39 అంటే ఏమిటి?
అమెరికాలో అభివృద్ధి చేసిన ఈ ప్యాచ్, ఫోటోథెరపీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే శరీరంలో సహజంగానే ఉన్న స్టెమ్ సెల్స్‌ను యాక్టివేట్ చేసి శరీరం త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేస్తుందిట…
- శక్తి (energy) & స్టామినా పెంచుతుంది
- రసాయనాలు, మందులు, ఇంజెక్షన్లు లేకుండా శరీరానికి వెల్‌నెస్ సపోర్ట్ ఇస్తుంది
- ఇది పూర్తిగా non-invasive (శరీరానికి హాని చేయని) పద్ధతిలో పనిచేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
ధర & వాడే విధానం
ఒక బాక్స్‌లో 30 ప్యాచ్లు ఉంటాయి (ఒక నెలకు సరిపడే సప్లై) … ధర మాత్రం ఇండియాలో సుమారు ₹19,816 … ప్యాచ్‌ను neck, shoulder, లేదా wrist మీద వేసుకోవచ్చు… అంటే రోజుకు ఆరేడు వందలు…
ప్రతి రోజూ ఉదయం ఒక ప్యాచ్ వాడి, 24 గంటల తర్వాత మార్చాలి… సరిగ్గా ప్రతిరోజూ వాడితేనే ఫలితం స్పష్టంగా తెలుస్తుందని కంపెనీ సూచిస్తోంది…
ఈ ప్యాచ్ చాలా తేలికగా, కనిపించని విధంగా ఉండటంతో, డైలీ లైఫ్‌లో సౌకర్యంగా వాడుకోవచ్చని చెబుతున్నారు…
రకుల్ ఎందుకు వాడుతోందో?
రకుల్ ప్రీత్ ఎప్పుడూ ఫిట్‌నెస్ ఫ్రీక్‌గానే పేరొందింది. జిమ్ వర్కౌట్స్, యోగా, హెల్దీ ఫుడ్ — ఇవన్నీ ఆమె డైలీ రూటీన్‌లో భాగమే… ఇప్పుడు ఈ ప్యాచ్ వాడుతున్నదాన్ని బట్టి చూస్తే, వెల్‌నెస్ & ఎనర్జీ లెవల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికే దీన్ని ట్రై చేస్తోందని అనుకోవచ్చు…
రకుల్ ప్రీత్ సినిమా ప్రాజెక్ట్స్… ఇక సినిమా ఫ్రంట్‌లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉంది… కమల్ హాసన్ నటిస్తున్న “ఇండియన్ 2” లో కీలక పాత్ర పోషిస్తోంది… అదేవిధంగా బాలీవుడ్‌లో కూడా పలు సినిమాలు సైన్ చేసింది…
పాన్-ఇండియా ప్రాజెక్ట్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటోంది… మొత్తానికి, ఫిట్‌నెస్ & వెల్‌నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ పెట్టే రకుల్ ప్రీత్, ఇప్పుడు లైఫ్‌వేవ్ X39 ప్యాచ్ వాడుతూ కొత్త ట్రెండ్‌ని ఫ్యాన్స్‌కు పరిచయం చేసినట్టే కనిపిస్తోంది…
Share this Article