.
చంద్రబాబు గారికి… పోనీ, చంద్రబాబు కొడుకు యాక్టింగ్ సీఎం లోకేష్ గారికి…
నిజానికి మీ టీడీపీ మీడియా మేనేజ్మెంట్‌లో ప్రపంచ ప్రసిద్ది… మీకోసం వర్క్ చేసే మీడియా పర్సనాలిటీలను మీరు మీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు…
Ads
మీడియా కంపెనీల గురించి కాదు, నేను చెప్పేది… మామూలు జర్నలిస్టుల గురించి… కానీ హఠాత్తుగా ఏమైంది మీకు..? అధికారం రాగానే ఓ దిక్కుమాలిన ధోరణి కనిపిస్తోంది…
మీ కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను కూడా పురుగుల్లా చూస్తున్నారు… మీ ప్రోగ్రామ్స్ దగ్గర మైకులు అరేంజ్ చేసేవాళ్లకు, చాయ్ అందించేవాళ్లకు కూడా మీరు టెక్నికల్ కన్సల్టెంట్లుగా అడ్డగోలు జీతాలు ఖజానా నుంచి ఇచ్చేలా జీవోలు ఇచ్చేస్తున్నారు…
సరే, మీ ప్రభుత్వం మీ ఇష్టం… ఎంత వరకూ సహించాలనేది పవన్ కల్యాణ్ ఇష్టం… అఫ్‌కోర్స్, ఏపీ బీజేపీకి ఏ సోయీ ఉండదు కాబట్టి వదిలేద్దాం… ఒకరికి 90 వేలు, మరొకరికి 60 వేలు, ఇంకొకరికి 40 వేలు… అసలు వాళ్లు టెన్త్ చదివారా..? (జీవో కాపీ ఉంది, వద్దులెండి, ఇక్కడ)
అదే 30 ఏళ్లు జర్నలిజంలో వివిధ హోదాల్లో పనిచేసి, 5 ఏళ్లుగా మీ కోసం వర్క్ చేస్తున్న ఓ సీనియర్ జర్నలిస్టుకు మీరు ఇస్తున్నది 27 వేలు… కాస్త పెంచండి సార్ అనడిగితే …. నిజానికి మీరు చేస్తున్నది ఏముంది అనే వెటకారపు ప్రశ్నలు, చీదరింపు చూపులు…
వీళ్లే కాదు… మీరు పెట్టుకుంటున్న పీఆర్వోలకూ అంతే కదా… దిక్కుమాలిన జీతాలు.,. పురుగుల్లా పరిగణనలు… ఫాఫం జర్నలిస్టులు… ఓ మంచి ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ కూడా ఇలాగే తయారైతే ఏమిటి పరిస్థితి..?
మంత్రులు, వీవీఐపీల పర్యటనలకు కూడా వద్దంటున్నారు… ఇంట్లో కూర్చుని ఏదో కంటెంట్ రాసి పంపించేదానికి పర్యటనల్లో మీరు కూడా ఎందుకు..? అదొక గుదిబండ భారం అంటున్నారు… చదువున్నవాడు, చదువులేనివాడు మీకు ఈక్వల్ అయిపోయారు… ఎంతలో ఎంత మార్పు పాలకా.,.?
మీకు సీఎంపీఆర్వో లేడు… ప్రస్తుతానికి అనధికారికంగా సీఎంపీఆర్వోగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషికి మీరు చెల్లిస్తున్నది ఎంతో ఓసారి సరిచూసుకొండి… అంతెందుకు..? మీ మంత్రుల దగ్గర పీఆర్వోలుగా నియమించుకున్న వారికి మరీ 30 వేలు… ఆలోపు… ఇదేం చాకిరీ స్వామీ..?
బౌన్సర్లుకు, అటెండర్లకన్నా తీసిపోయారా పీఆర్వోలు, మాజీ జర్నలిస్టులు..? నిజానికి ఇది టీడీపీ పాత ధోరణి కాదు… ఎవరు మిమ్మల్ని మిస్ లీడ్ చేస్తున్నారో తెలియదు.,. సేవలు చేయించుకోవడం కాదు, సేవలకు తగిన ప్రతిఫలం ఇస్తూ కాపాడుకోవడం ఓ కళ… హఠాత్తుగా ఎందుకిలా తయారైంది టీడీపీ క్యాంపు..? ఫాఫం… టీడీపీ సర్వీస్‌మెన్..!!
సర్, మీ దృష్టిలో దిక్కుమాలినవాళ్లుగా కనిపిస్తున్న మాజీ జర్నోలు ఫాఫం, ఇళ్ల స్థలాల గురించి ఏమైనా భారీ ఆశలు పెట్టుకుంటున్నారేమో… మంచి జీతాలు ఆశించే జీవోల కోసం ఆశిస్తున్నారేమో… కాస్త క్లారిటీ ఇవ్వండి…
జగన్ హయాం తెలుసుగా… దిక్కుమాలిన పనిగాళ్లకు కూడా వేలకువేల జీతాలు ఇస్తూ, హోదాలు ఇస్తూ జీవోలు ఇచ్చారు…! కొందరికి మరీ అడ్డగోలు ప్రోటోకాల్స్… సమాచార కమిషనర్ల వంటి హోదాలు… కన్సల్టెంట్లు, సలహాదార్లు… అదొక అరాచకం…
కొంపదీసి అవన్నీ చూసి, వీళ్లకు, అంటే ఆఫ్టరాల్ ఈ పిచ్చి రాతగాళ్లకు, కంటెంట్ రైటర్లకు అంత సీన్ లేదని అనుకుని తొక్కి పారేస్తున్నారా..?! ఇక్కడా ఒక రాబిన్ శర్మ ప్రభావం కనిపిస్తోందా..? సర్స్… టీవీ5 నాయుళ్లు, ఏబీఎన్ కృష్ణులు, ఈటీవీ బాసులు మాత్రమే కాదు, కాస్త మీ క్యాంపు యెల్లో జర్నలిస్టులను కూడా పట్టించుకొండి…!
Share this Article