.
ముందుగా ఓ విషయం చెప్పుకుని మిగతా స్టోరీలోకి వెళ్దాం… అదేమిటంటే..? బిగ్ బీ… ది గ్రేట్ అమితాబ్ బచ్చన్… తన టీమ్ తన కళ్లు గప్పి ఓ యాడ్ చేయించారు… అది ఓ గుట్కా యాడ్… సరోగేట్ యాడ్… అంటే సదరు గుట్కా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే దుర్మార్గపు యాడ్…
అమితాబ్‌కు నిజం తెలిసింది… తను గడ్డి తినే రకం కాదు… పెంట మీద కాసులను ఏరుకునే రకం కాదు… అన్నింటికీ మించి ఉచ్ఛం నీచం తెలియని తెలుగు సగటు స్టార్ హీరో అసలే కాదు… అందుకని వెంటనే ఆ యాడ్ అగ్రిమెంట్ కేన్సిల్ చేశాడు, డబ్బులు వాపస్ ఇచ్చాడు… ఎవడైనా ఆ యాడ్స్‌కు తన పేరు వాడితే కోర్టుకు ఈడుస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు… వాడు గ్రేట్, గ్రేటర్…
Ads
సీన్ కట్ చేస్తే… తెలుగు స్టార్ మహేశ్ బాబు అలాంటి తిక్క యాడ్స్ చేస్తాడు… సరోగేట్ యాడ్స్ అనైతికం అని చెప్పే టీమ్ లేకపోవడం కాదు, తనకు డబ్బు ముఖ్యం… బిడ్డతో యాడ్స్ చేయిస్తూ ఆల్రెడీ డబ్బు సంపాదనలో పడ్డాడు కదా… అబ్బే, గుండె ఆపరేషన్లు, ప్రజాసేవ అని చెప్పకండి, ఆ పిల్ల బాల్యాన్ని హరిస్తూ, ఆ సేవ కార్యక్రమాలకు విలువ లేకుండా చేస్తున్నాడు…
ఎవరూ తక్కువ కాదు లెండి… దుర్మార్గమైన కార్పొరేట్ కాలేజీలకు అల్లు అర్జున్ యాడ్స్ చేయలేదా బ్రాండ్ అంబాసిడర్‌గా..! తాజాగా మరొకటి… అది జూనియర్ ఎన్టీయార్‌కు సంబంధించిన యాడ్… అది మలబార్ గోల్డ్ యాడ్… దానికి జూనియర్ బ్రాండ్ అంబాసిడర్… ఫాఫం, మలబార్ కథ తెలియనట్టుంది… ఏమో, తెలిసీ డబ్బు కోసం కక్కుర్తితో చేస్తున్నాడో తెలియదు, తన టీమ్ తనను తప్పుదారి పట్టిస్తున్నదో తెలియదు…
ఎప్పుడూ పాకిస్థాన్ ఇండియాకు శతృదేశమే… టైమ్ దొరికితే ఇండియాను నామరూపాలు లేకుండా చేద్దామనే దేశం అది… ధూర్తదేశం, దానికి ఇండియా మరో శతృదేశం చైనా దోస్త్… ఈ మలబార్ కంపెనీ ఎవరిదీ అంటే… ఇది కేరళలోని కొజికోడ్ బేస్… ఎంపీ అహమ్మద్ దీనికి ఓనర్… పక్కా పాకిస్థానీ సపోర్టర్…
https://www.facebook.com/reel/1506437913962647
చూశారా… రమ్య… మాజీ వీ6 తీన్మార్ ఫేమ్… సొంతంగా వైస్ టీవీ అని నడిపించుకుంటోంది… ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవముంది… ఆమే ఏమంటున్నదీ అంటే… జూనియర్ కాస్త శ్రద్ధగా విను…
‘‘నువ్వు మలబార్‌కు ప్రమోషన్ చేస్తున్నవు కదా… దాని యాజమాన్యం విజయ్ గజేరా అనే వాడిని 3 నెలలు జైలులో పెట్టాలని కేసు పెట్టింది… 445 యూఆర్ఎల్ లింక్స్ డిలిట్ చేయాలని నోటీసులు పంపించింది… మోడీని, మన ఆర్మీని, ఆపరేషన్ సిందూర్‌ను దూషించిన, ద్వేషించిన పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను తన బ్రాండ్ ప్రమోటర్‌గా ప్రమోషన్లు చేయించుకుంది..’’
మరి ఆ పాకిస్థానీ బ్రాండ్‌కు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నవ్… మన ఆర్మీని కించపరుస్తున్నవా..? మన ప్రధానిని కించపరుస్తున్నవా..? చిల్లర డబ్బు కోసం ఏమిటీ కక్కుర్తి జూనియర్..? నీకు ఈ దేశం ఏం తక్కువ చేసింది..? ఏం తక్కువ ఇచ్చింది… వందల కోట్ల డబ్బు ఇచ్చింది కదా… ఇదేనా నీ కృతజ్ఙత ఈ దేశం పట్ల..?
స్టార్ స్టేటస్… కోట్లకుకోట్ల డబ్బు… మూర్ఖాభిమానులు… ఐనా సరే, రకరకాల వ్యాపారాలు, అవీ సరే… కానీ ధూర్తదేశానికి సపోర్టుగా నిలిచే వాళ్లకు… చిల్లర డబ్బుల కోసం సపోర్టుగా నిలవడమా..?! ఈమధ్య ఎందుకోగానీ మరీ ఎండుకుపోయినట్టు కనిపిస్తున్నవ్ … కానీ ఈ విషయం ఆలోచించే ఓపిక ఉందో లేదో తెలియదు గానీ… నీకు మరకే..!!
నిన్ను రాబోయే కాలంలో ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని మేం కోరుకుంటున్నాం… నువ్వేమో మరీ ఇలా… ప్చ్, ఫాఫం..!!
Share this Article