క్రాక్ అనబడే ఓ సినిమాకు సంబంధించి ఒక డిస్ట్రిబ్యూటర్ శ్రీనుకు ఎక్కడో కాలి దిల్ రాజును కాస్తా కిల్ రాజూ అని తిట్టి ఉండవచ్చు… శిరీష్నూ నిందించి ఉండవచ్చు…. చివరకు ఎవరెవరికి ఏ భాషలు వస్తాయి, రావనేది కూడా తిట్టడానికి స్కోప్ ఇవ్వవచ్చు… దానికి బెల్లంకొండ సురేష్‌కు కోపమొచ్చి ఉల్టా ఈ శ్రీనును తిట్టవచ్చు… ఒరే, దిల్‌రాజు, శిరీష్ వంటి మహా మహితాత్ములను తిట్టడానికి నీకు నోరెలా వచ్చింది, ఇకపై నీకు సినిమాలు ఎవడిస్తాడు అని బెదిరించవచ్చుగాక… కానీ చివరాఖరికి ఏం జరగొచ్చు… వీళ్లు వాళ్లను, వాళ్లను వీళ్లు తిట్టేసుకుని, ఎక్కడో కూర్చొని సెటిల్ చేసేసుకుని, సాయంత్రానికి ఎక్కడో చీర్స్ కొట్టేసుకుని, తెల్లవారి నుంచే కౌగిలించుకుని తిరుగుతారు… ఎందుకంటే..?
సినిమా ఇండస్ట్రీ ఓ మాఫియా టైపు, ఓ సిండికేట్… థియేటర్ల సిండికేట్… డిస్ట్రిబ్యూటర్ సినిమా రైట్స్ కొనుక్కోగానే సరిపోదు… ఏ దిల్ రాజు దగ్గరో, ఏ అల్లు అరవింద్ దగ్గరో దేహీ అని చేతులు కట్టుకుని నిలబడాలి… ఎంత పెద్ద నిర్మాత, ఎంత పెద్ద హీరో అనేది జాన్తా నై… సిండికేట్ దయ, ఇండస్ట్రీ ప్రాప్తం… సరే, మధ్యలో ఏ పెద్దమనిషో పూనుకుంటాడు, సెటిల్ అయిపోతుంది… రోజూ క్యూబ్ డిజిటల్ వ్యవస్థల అద్దెల దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ల వాటాల పంచాయితీలు, ఫైనాన్స్ చెల్లింపులు, మిత్తీ రేట్ల దాకా బోలెడు ఇష్యూస్ ఉంటాయి… ఏ రంగమైనా సహజం… మూవీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువ… ఈ బెల్లంకొండల అదిలింపులు, దిల్ రాజుల బెదిరింపులు గట్రా కామన్…
Ads
ఎటొచ్చీ ఈ వార్తలలో చాలా వింతగా అనిపించింది ఏమిటంటే… సదరు డిస్ట్రిబ్యూటర్ వెంట ఓయూ జేఏసీ విద్యార్థులున్నారట… బెల్లంకొండ సురేష్ వాళ్లకూ రిక్వెస్టు చేస్తున్నాడు, వద్దు బ్రదర్స్, అలాంటివాళ్లకు సపోర్ట్ ఇవ్వకండి ప్లీజ్ అని…. బెల్లంకొండ బతిమిలాటలు సరే గానీ… అసలు ఓ సినిమా సంబంధ పంచాయితీలో ఓయూ జేఏసీ ఏమిటి అసలు..? రోజువారీ ఇండస్ట్రీ ఇష్యూల్లో విద్యార్థుల పేరిట సపోర్ట్ వెళ్లడం ఏమిటి..? మొన్నటికిమొన్న రాంగోపాలవర్మ ఆఫీస్ మీదకు వెళ్లారు ఓయూ జేఏసీ పేరిట..! ఉన్నయ్, ఓయూలో చాలా జేఏసీలున్నయ్… అవేం చేస్తున్నయ్..? ఈ పనులా..? క్రమేపీ ఈ జేఏసీలు ఏం వ్యవహారాల్లోకి మళ్లుతున్నయ్… విద్యార్థుల సమస్యల మీదో, పలు సామాజిక సమస్యల మీదో చాలా యూనివర్శిటీల్లోని విద్యార్థులు గొంతులెత్తుతున్నారు… అది యువశక్తికి ఉండాల్సిన సామాజిక బాధ్యత, చైతన్యం అనుకుందాం… కానీ ఈ వర్మ తగాదాలు, ఈ దిల్ రాజు పంచాయితీలేమిటి..? హేమిటో మరి…!!
Share this Article